S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

06/10/2018 - 00:18

గరుత్మంతుడు చిన్నప్పుడు తల్లి, దాస్యవిముక్తి కోసం, సవతి తల్లి కోరిక మేరకు అమరపురానికి వెళ్లి అమృతం తెచ్చి యివ్వడం.. ఆ తరువాత శ్రీహరికి వాహనం కావడం.. లోకపాలకుడు శ్రీహరికే వాహనం అయిన తను గర్విష్టిగా మారడం.. గమనించిన శ్రీహరి ఆ గర్వాన్ని అణచి కళ్ళు తెరిపించడం.. సుశాంత్ చిన్నప్పుడు పాఠ్యాంశంగా తెలుగులో ఉండేది. ఏదో పాఠంగా చదువుకున్నాడు కానీ ఒంట పట్టించుకోలేదు. అదే ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది.

06/09/2018 - 23:53

వేదాలు వెలిశాయి.. పురాణాలు పుట్టాయి.. ఉపనిషత్తులు ఉద్భవించాయి.. ఇతిహాసాలు విలసిల్లాయి.. యుగాలు గడిచాయి.. కోట్ల సంవత్సరాల ఈ భూ మండల చరిత్రలో ఎందరెందరో దేవ దానవుల ఆదర్శవంతమైన జీవితాలు తెరకెక్కి స్థిరస్థాయిగా నిలిచాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలు ధార్మిక సందేశాలకు నిలయమై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో ధర్మం నాలుగు పాదాలపై నడిచాయి. కలియుగం ఆరంభమయ్యాక రాజులతో కూడిన రాజ్యాలు ఏర్పడ్డాయి.

06/09/2018 - 21:25

ద లెజండరీ క్విజిన్ ఆఫ్ పర్షియా, హరీస్, హరిషా, హలీమ్.. ఇలా పేర్లు ఏదైనా రుచి మాత్రం అమోఘం. అరబ్, పర్షియన్ సేనలతో పాటు అరబిక్ ఎడారుల మీదుగా ప్రయాణించి హైదరాబాద్ చేరిన హలీమ్ వెనకాల పెద్ద కథే ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన నిజాం రాజులది విలాసవంతమైన జీవనశైలి. వారు వివిధ దేశాలనుంచీ గొప్ప గొప్ప వంటవాళ్లను రప్పించి వంటలు చేయించుకునేవారు. అలా తయారైన గొప్ప వంటకమే హలీమ్.

06/09/2018 - 21:20

పవిత్ర ఫలంగా, సంప్రదాయ ఫలంగా నీరాజనాలు అందుకుంటున్న ఫలరాజం ఖర్జూరం. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిములు ఉపవాస దీక్ష విరమణ సమయంలో విధిగా ఖర్జూరాన్ని ఆరగిస్తారు. మహమ్మద్ ప్రవక్త వారికి ఇది ఇష్టమైన ఫలరాజమని దివ్య ఖురాన్ గ్రంథంలో పేర్కొనబడింది. ఖర్జూరం చెట్టు కలపను ఆయన ఇంటికి ఉపయోగించారు. పవిత్ర మదీనా క్షేత్రంలోని మస్జిద్ ఏ నబవీ నిర్మాణంలో కూడా ఖర్జూరం కలపను వాడినట్లు తెలుస్తుంది.

06/03/2018 - 00:17

చాలారోజులకి సినిమా చూశాను. అది మహానటి. సావిత్రి జీవితం గురించి తీసిన సినిమా. విరామం వరకు సినిమా బాగనిపించింది. ఆ తరువాత మనస్సంతా బరువెక్కిపోతుంది. అయితే రెండు భాగాల నుంచి మనం నేర్చుకోవలసినవి ఎన్నో వున్నాయి.

06/03/2018 - 00:15

జీవితంలో కొన్ని సత్యాలు వుంటాయి. అవి ఎప్పుడూ మారవు. ఈ విషయాన్ని మనలో చాలామంది గుర్తించరు. గుర్తించినా అంతగా పట్టించుకోరు.
జీవితంలో ఏది వచ్చినా రాకపోయినా మరణం మాత్రం తప్పక వస్తుంది. సృష్టిలో వున్న ప్రతి జీవికి ఇది తప్పదు.
ఇది నిశ్చయం.
మనందరికీ ఈ విషయం తెలుసు. ఎప్పుడు, ఎలా, ఎక్కడ అన్న విషయం మాత్రం తెలియదు. కానీ ఇది తప్పదు.

06/02/2018 - 23:54

‘విచక్షణ కలిగి ఉండటం’ అనే వాక్యాన్ని మీరు చాలా సార్లు వినే వుంటారు. మరి దీనికి అర్థం ఏమిటి? అంటే మన లక్ష్యం మీద దృఢత, దాన్ని చేరుకునే గమ్యపథంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులను ధీరత్వంతో, సమయస్ఫూర్తితో ఎదుర్కోవడం. విచక్షం అంటే ఇదా? అని మీరు అనుకుంటున్నారు కదూ! కానీ నిశితంగా పరిశీలిస్తే జీవితమంతా లక్ష్యాలు ఏవైనా వివిధ గమ్యాలతో పయనిస్తూ ఉండటమే.

06/02/2018 - 23:23

కడుపు నిండితే గారెలు చేదు అని మనకో సామెత. గారెల రుచి తెలియాలంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలి. డబ్బు విలువ తెలియాలంటే డబ్బు లేని పరిస్థితులు ఉండాలి.

06/02/2018 - 22:47

ఆ శుభముహూర్తం రానే వచ్చింది. నేను, నా భార్యా పిల్లలు కొత్తగా కొన్న ఫ్లాట్‌లోకి శ్రీహరి పటంతో.. పవిత గంగా సమాన తీర్థ వెండి కలశంతో మా చెల్లి వెంటరాగా గృహప్రవేశం చేశాం. అదే ముహూర్తానికి మా ఎదురు ఫ్లాట్‌లోకి లింగమూర్తిగారు కూడా దంపతీ సమేతంగా గృహప్రవేశం చేస్తున్నారు. ఆయన తెల్లపాంటు, తెల్ల షర్టులో పెదవులపై చెరగని చిరు మందహాసంతో నా వైపు చూశారు పలకరింపుగా..

06/02/2018 - 22:44

‘రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బాహూ రుపాదమ్
బహూదరం బహుదంష్ట్రా కరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్త్థాహమ్’

Pages