S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/13/2020 - 23:28

ఓ నా సమస్యలారా!
నన్ను ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేను వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేస్తున్నాను.
నన్ను బలహీనపరచాలని చూస్తున్నారు.
కానీ నేను మరింత శక్తిని పుంజుకుంటున్నాను.
నా లక్ష్యం వైపు దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ నేను దాని వైపే నా దృష్టిని కేంద్రీకరిస్తున్నాను.
నన్ను కించపరచాలని చూస్తున్నారు.

01/12/2020 - 23:48

ఓ సాయంత్రం వేళ
చెట్టు కొమ్మల మాటున
తన సహజ తేజంతో అలరారుతూ
ఎర్రని కాంతి కిరణాలు ప్రసరిస్తూ
పడమటి దిక్కున సూర్యుడు
చిరుగాలికి ఆకుల కదలికలు
వాటి నడుమ దోబూచులాడుతూ దినకరుడు
కనువిందు చేసేలా ఆ దృశ్యం
పడమటి సంధ్యారాగం
తన ప్రస్థానం ఈ రోజుకింతేలా
కనుమరుగవుతూ నింగిలో
వెలుగులకు నీవు పొంగిపోవద్దని
చీకట్లకు కృంగిపోవలదని వాటిని

01/12/2020 - 23:44

ఉలకడు పలకడు
గలగలా మాట్లాడడు
మనసులో మాట ఎరిక చేయడు
నలుగురిలో వుంటాడు
కానీ
వొంటరితనంలో వాడు
తన లోకపు వ్యోమగామి వాడు.
దూరంలో ఉన్నవాళ్ల నెందరినో
చేతి వేళ్లతో పలకరిస్తాడు
వేల మైళ్ల దూరం వారికి
ఇష్టాయిష్టాలు ప్రకటిస్తాడు
ఆనందిస్తాడు ఆక్రోశిస్తాడు
ఆస్వాదిస్తాడు ఆవేదన పడతాడు - వాడు.

01/12/2020 - 23:29

సాంకేతిక విప్లవంలో
అణువుగా ఆరంభమై
జగంలోని ప్రతీ అంశాన్ని స్పృశించే
వైజ్ఞానిక ఖడ్గమై
అరచేతిలోనే విశ్వాన్ని దర్శింపచేసే
కరదీపికై
దారి చూపి తీరం చేర్చే
స్నేహ హస్తంలా
అనే్వషణ సేద్యం చేసే పిపాసకుల
దాహార్తి తీరుస్తుంది
ఒంటరితనం ఎరుగనీయకుండా
ఆప్స్‌తో మనసుకు విందు చేస్తూ
వినోదాలను అందిస్తుంది
ప్రేయసిలా మురిపిస్తుంది

01/12/2020 - 23:15

చలి గిలిగింతలు పెడుతుంటే.. ఆకాశంలో వొయ్యారాలొలుకుతూ పరుగులు పెడుతున్న పతంగులను చూడటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగరేయడంలోని ఆనందం అనిర్వచనీయం. చలికాలం నుంచి వేసవికాలంలోకి వచ్చే ఉత్తరాయణంలో.. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తున్న సమయంలో.. హైదరాబాద్‌లో పతంగుల పండుగ ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమవుతుంది.

01/12/2020 - 23:06

నేడు వివేకానంద జయంతి
*

01/12/2020 - 22:57

సీ॥ తలపాగటే అద్ది? ధర వెలార్చిన స్వీయ
దేశ ప్రతిష్ఠైక దీప్తిగాని,
నుదురౌనటే అద్ది? విదిత హైందవ సమ
భ్యుదిత విజ్ఞానంపుకుదురుగాని;
కళ్లౌనటే అవ్వి? ఘనతత్త్వ భరత తా
ర్కిక నవ ప్రభల లోగిళ్లుగాని,
గళరవమ్మటె అద్ది? గంభీర గతిగల్గు
‘నయగరా’ జలపాత లయలుగాని;
సద్గురువు రామకృష్ణుని ఛాత్రుడట్టె
అతడు? సంస్కృతి ఛత్రమై అలరుగాని;

01/12/2020 - 22:54

కవచాల్ని కూడా కుదించుకుని
కేంద్రకాలనే మిగుల్చుకున్న
సమూహంలోంచి
ఏదో ఒక గొంతు
మనల్ని ఆర్తిగా పిలిస్తే!
హృదయాల నడుమ
సేతువొకటి నిర్మించి
మనవైపు కొన్ని అడుగులు వేస్తే
ఎంత అదృష్టం!

01/12/2020 - 22:53

అమ్మ గొప్పది...
అమ్మలో కమ్మనైన అమ్మతనం ఇంకా గొప్పది...
వృద్ధికి మూలాధారం అమ్మ..
చెట్టుకి మూలాధారం వేరు.. తల్లి వేరు..
గుండె గొంతుకలోకొచ్చి అమ్మా అన్నా...
పెదవంచు నుంచి అమ్మా అన్నా..
ఆమె రక్తం పంచుకున్న నీవు
ఆమెపై మమతలు పెంచుకున్నా
నీ అవసరానికి ఆమెనొక
సాధనంగా ఎంచుకున్నా
మమతలుడుగని అమ్మ.. వయసుడిగిన అమ్మ..

,
01/12/2020 - 22:46

కోనసీమ నడుమ తరతరాల నుండి సంక్రాంతిలో వైభవోపేతంగా జరుగుచున్న జగ్గన్నతోట ప్రభల తీర్థ వైభవాన్ని చూద్దాం..

Pages