S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/28/2019 - 23:50

ఏదో సాధించాలన్న తపన..
ఇంకేదో కోల్పోతున్నామన్న ఆవేదన..
ఏవేవో కొత్త పరిచయాలు..
ఇంకెందరో కొత్త స్నేహితులు..
తెలియకుండానే సంవత్సరకాలం గడిచి..
మరో నూతన సంవత్సరంలోకి..
మరో నూతన దశాబ్దిలోకి స్వాగతం పలుకుతోంది కాలం..

12/28/2019 - 23:48

మరో రెండు రోజుల్లో మనం 2020లోకి ప్రవేశించబోతున్నాం. కానీ కొన్ని దేశాలు మాత్రం మనం 2020లోకి ప్రవేశించినా ఇంకా 2019లోనే ఉంటాయి. అది ఎలాగో.., కొత్త ఏడాది సంబరాలు అందరికంటే ముందు ఎవరు చేసుకుంటారో చూద్దాం..

12/28/2019 - 23:40

రివ్వున ఆకాశానికి బారులుతీరి ఎగిరే గువ్వల్ని.. చీకటిపడుతుంటే గూటికి చేరే గువ్వపిట్టల్ని.. టపటపమంటు నేలతల్లిని తాకే ప్రయత్నంలో సవ్వడిచేసే తొలకరి చినుకుల్ని.. తడిసిన మట్టిలో నుంచి అపుడప్పుడే మొలకలెత్తే మొలకల్ని.. బోసిబోస నవ్వులతో, బుడి బుడి నడకలతో పసివాడు కొట్టే కేరింతల్ని... వేసే తప్పటడుగుల్ని చూస్తుంటే లోకంలో అంతకంటే సంబరం, సంపద మరేది అనిపించదు నాకు.

12/28/2019 - 23:24

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడెమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
*

12/28/2019 - 23:22

మదిని చొచ్చిన వ్యాకులత
సమస్యల వలయంపై వాలి
ముందుకెళ్లాల్సిన గమనానికి
అడ్డు సంకెళ్లు బిగిస్తుంది

ఎదను మొలిచిన బతుకు చింతన
విశ్వరూపాకృతిని పొంది
సంక్షోభపు పంట పండిస్తుంది

జీవనం బాధాతప్తమైన దారుల వెంట
పయనించాల్సి వచ్చిన విషమ స్థితి
వెంటాడి వేటాడి తరుముతుంది

12/28/2019 - 23:19

ఓ చట్రంలో ఒదిగిపోయి పని చేయడం తనకు కుదరదని, సంపూర్ణ స్వేచ్ఛను ఆస్వాదిస్తూ, ఆలోచనలను మధిస్తూ రంగుల పదనిసలు సాగించడం తనకెంతో ఇష్టమని శిల్పి, చిత్రకారుడు చిలువేరు మనోహర్ అంటున్నారు.

12/23/2019 - 23:42

రోజురోజుకీ మనుషులు తీరిక లేకుండా అవుతున్నారు.
సమయం తక్కువ. చేయాల్సిన పనులు ఎక్కువ. పనులు చేస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు.
మీకు ఎలా వుందో తెలియదు.
కానీ
నాకు మాత్రం రోజురోజుకూ పనులు పెరిగిపోతున్నాయి.
వయస్సు రీత్యా పనులని తగ్గించుకోవాలని అనుకుంటాను. కానీ కుదరదు.
కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఇంటర్నెట్‌ని ఆఫ్ చేయాలి. టెలిఫోన్ బంద్ చేయాలి.

12/22/2019 - 23:36

ప్రపంచంలో ఎంతకాలం
బ్రతుకుతావన్నది కాదు ముఖ్యం
మనినంతకాలం
మల్లెపూవై పరిమళించురా నేస్తం!
* * *
పోరాటం పోరాటమే
అది అవసరమే
అది చీకటితో ఐతేనే
అవనికి కళ్యాణం
* * *
ఆకురాలినంత మాత్రాన
చెట్టు కుంగిపోదురా
మళ్లీ చిగిర్చి పచ్చగా హసిస్తానని
దానికి తెలుసురా!
* * *
చదువు
సముద్రం
ఎంత లోతుకు వెళ్లినా

12/22/2019 - 23:23

చూడు మోయడానికి నలుగురైనా లేకపోయిరి
పదుగురైనా స్మశానం వరకూ కూడా తోడు రాకపోయిరి
నీ దగ్గర ఉన్న డబ్బు మోతకు తాళం వేసేవారే అందరూ!
ఇప్పుడు మరణమృదంగం మ్రోగగానే పరారే ప్రతి ఒక్కరూ!
పిడికెడు మట్టి వేయటానికి కూడా దిక్కులేరెవరూ!
ఇదేనా నువ్వు సంపాదించుకున్న కీర్తిప్రతిష్ఠలు
ఇదేనా నీ అప్రతిహత అవిశ్రాంత సంపాదనకు ఫలితం?!

12/22/2019 - 23:18

ప్రేమ ఒక వరం
ప్రేమ ఒక మధురస్వరం
ప్రేమ ఒక స్వప్నం
ప్రేమ ఒక పవిత్ర రూపం
చల్లని చూపులో ప్రేమ
చిరునవ్వులో ప్రేమ
ప్రేమ స్పృశిస్తుంది
ప్రేమ స్పందిస్తుంది
అమ్మ ఒడిలో లాలనలో ప్రేమ
హృదయాంతరాలలో ప్రేమ
సున్నితమైన స్వచ్ఛమైనది ప్రేమ
ప్రేమ ఆరాధిస్తుంది
త్యాగాన్ని కోరుతుంది ప్రేమ
ద్వేషభావాలు లేనిది ప్రేమ

Pages