S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/29/2018 - 23:44

ఓసినిమా నటుడు టీవీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ గమ్మతె్తైన మాట చెప్పాడు.
‘నేను చనిపోయిన తరువాత నా గురించి ఎవరూ ఏమి అనుకుంటే నాకేమిటీ? అవి నాకు విన్పించవు కదా?’
చాలా మంది చరిత్రలో తమ పేరు నిలిచిపోవాలని ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అవి అన్నీ వృథానా?
ఆ సినీ నటుడు అన్న మాటలో కొంత వాస్తవం వుంది. కొంత అవాస్తవం ఉంది. అది అర్థసత్యం అనవచ్చు.

09/29/2018 - 22:29

కోటలు కూలినా చరిత్ర చెరగదు... ప్రాణాలు పోయినా కీర్తి తరగదు అన్నట్లు రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా అలనాటి ఆనవాళ్లు చరిత్రకు నిలువెత్తు నిదర్శనాలు. అలనాటి రాచరిక పాలనకు సజీవ సాక్ష్యంగా చెప్పుకునే ‘ఖిల్లా’ మెదక్ పట్టణానికి ఓ మణిహారం. నేటికీ నిలిచిన పురాతన కట్టడాలు.. కోట గోడలు.. బురుజులు మెదక్ జిల్లా రాచరిక పాలనకు దర్పణం. రోమనులతో వర్తక, వాణిజ్య సంబంధాలు పెట్టుకోగా..

09/29/2018 - 19:26

మోచేతులపై ఇష్టదైవం బొమ్మలనో, ఆప్తుల పేర్లనో ‘పచ్చబొట్టు’ వేయించుకోవడం పాత పద్ధతి. విభిన్న రంగుల్లో వివిధ ఆకారాలను ‘టాటూ’లుగా వేయించుకోవడం నేటి నవ నాగరిక సమాజంలో వేలం వెర్రిగా మారింది. నగరాల్లో అయితే ‘టాటూ స్టూడియో’లు వెలుస్తున్నాయి. సుశిక్షుతులైన నిపుణులు ఈ స్టూడియోల్లో ‘టాటూ’లు వేస్తూ దండిగానే ఆదాయం సంపాదిస్తున్నారు. చేతులు, కాళ్లపైనే కాదు.. ముఖంపైన, హృదయ భాగంపైన, వీపుపైన, మెడపైన..

09/29/2018 - 18:08

అది ఓ పెద్ద జాగా... ఒక ఎకరం భూమిలో మధ్యన ఇల్లు, చుట్టూరా ఫలవృక్షాలు, పూల తీగెలు, స్విమ్మింగ్ పూల్ వగైరా వగైరా...
అది ఊరికి సుదూరం.. ఇది రమణమూర్తి చిరకాల ఆశయ తీరం-

09/29/2018 - 17:44

కిల్లర్ వేల్ జాతికి చెందిన ఓ తిమింగలం తను జన్మనిచ్చిన పిల్ల తిమింగలం చనిపోయాక కూడా దాని శరీరాన్ని పదిహేడు రోజుల పాటు వదిలిపెట్టలేదని పరిశోధకులు వెల్లడించారు. కెనడాలోని వాంకోవర్ దీవి సమీపంలోని సముద్రంలో చనిపోయిన పిల్ల తిమింగలాన్ని తన తలతో నెట్టుకుంటూ దాదాపు 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది తల్లి తిమింగలం. పదిహేడు రోజుల తర్వాత చనిపోయిన పిల్లను వదిలేసింది తల్లి తిమింగలం.

09/22/2018 - 19:49

ఇది... ఓ విహంగమో, విమానమో
చేసిన విన్యాసం కాదు...
నేలపైన కాదు, నింగిపైన కాదు...
శూన్యంలో తేలియాడుతూ
‘పరుగుల వీరుడు’ చేసిన మాయాజాలం ఇది...

09/16/2018 - 00:51

భక్తులు కొంగుబంగారంగా కొలుచుకునే కోనేటిరాయుడి ఆలయంలో నిత్యం
కోలాహలమే..! ఒకప్పుడు ఈ ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలంటే సౌకర్యాలు అంతంత మాత్రమే. వృద్ధులను డోలీల్లో కూర్చోపెట్టి కొండపైకి తీసుకుని వెళ్లేవారు. కాలగతిలో రవాణా, వసతి సౌకర్యాలు అనూహ్యంగా పెరగడంతో భక్తుల రద్దీ అదే స్థాయిలో పెరిగింది. పుష్కరిణి, కల్యాణకట్ట, తిరుమాడ వీధులు,

09/16/2018 - 00:43

ఫొటోలు: తలారి రెడ్డెప్ప

09/16/2018 - 00:29

శ్రీ వేంకటేశ్వర స్వామి పుష్పాలంకారప్రియుడు తిరుమల శ్రీనివాస ప్రభువుకు చేసే అన్ని సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనదని, పవిత్రమైన కార్యమని ‘‘తిరువాయ్ మొళి’’ అనే గ్రంథంలోకూడా పేర్కొన్నారు. స్వామిని క్షణ్మాత్రకాలం చూస్తేనే జీవితం ధన్యమవుతుందని తలిచే మానవునికి స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల పుష్పహారాలతోసర్వాంగ సుందరంగా అలంకరింపబడిన పూమాలలు తమ అదృష్టాన్ని ఇంకేవిధంగా భావిస్తాయోకదా!

09/16/2018 - 00:27

ఏడుకొండలుగా ప్రసిద్ధిగాంచిన శేషాచల శిఖరాలలో వెలసి ఉన్న శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ప్రదేశం ఒక దివ్యమైన ఘట్టమే! ప్రతిదానికీ ఏదో ఒక విశిష్టతే!

Pages