S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/07/2017 - 23:24

మీకో ప్రశ్న

శ్రీరామ నామం ఎందుకు
తారకమంత్రం అయింది?

05/07/2017 - 23:22

కొండల మధ్య ఉన్న కుగ్రామం -రామతీర్థం. అక్కడ పాఠశాల లేదు. ఊళ్లో అక్షరాస్యత లేదు. ఉన్న రామాలయం పూజారి రామాచారికి మటుకు తెలుగు భాష రాయటం చదవటం వచ్చు. ఊళ్లో ఎవరికి ఏ అనుమానం వచ్చినా రామాలయం పూజారిని అడిగి తెలుసుకొనేవారు. ఆ ఊళ్లో అల్లరిచిల్లరిగా తిరుగుతున్న ఎనిమిదేళ్ల హరికి ఒకరోజు ఓ మర్రిచెట్టు కింద ఒక ఇత్తడి చెంబు దొరికింది. ఎవరిని అడిగినా మాది కాదంటే మాది కాదని చెప్పారు. ఆ చెంబు మీద ఏదో రాసి ఉంది.

05/07/2017 - 23:21

ఆరేడు అంగుళాలకు మించని ఈ పొట్టి నార్తర్న్ పిగ్మీ గుడ్లగూబలు చూడటానికి ముద్దుగా ఉంటాయి. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే చిన్నచిన్న పావురాల్లా కనిపిస్తాయి. రాత్రిపూట తెగ గోల చేసే ఈ పక్షులు ప్రమాదం ఎదురైనప్పుడు శరీరం చుట్టూ ఉన్న బొచ్చును ఉబ్బవేసి పెద్దగా ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. ఉన్న అతిచిన్న శరీరంలో తోక కాస్తంత పెద్దదిగా ఉంటుంది. విప్పారిన రెక్కల పొడవు మాత్రం పదిహేను సెంటీమీటర్ల మేరకు ఉంటుంది.

05/07/2017 - 11:03

ఔదార్యం మంచి లక్షణం. దానం గొప్ప గుణం. త్యాగం సాటిలేని గుణం. చరిత్రలో కొంతమంది ఈ అత్యున్నత లక్షణాలు కలిగిన వాళ్లున్నారు. వాళ్లని ప్రపంచమెప్పటికీ మరచిపోదు. అట్లాంటి వాళ్లలో కర్ణుడు ఒకడు. అందుకనే అతన్ని దానకర్ణుడు అన్నారు. ఎప్పుడు ఎవరు ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు కర్ణుడు.

05/07/2017 - 05:33

న్యాయవాద వృత్తి వదిలి 28 సంవత్సరాలు అవుతోంది. 1989 మే నెలలో న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాను. ఎంతోమంది వ్యక్తుల కేసుల ఫైళ్లు నా దగ్గర ఉండేవి. విచారణలో వున్న కేసులని మిత్రులకి ఇచ్చేశాను. విచారణ పూర్తి అయిన ఫైల్స్ అట్లాగే నా దగ్గరే ఉండిపోయాయి. అదే విధంగా కొత్త ‘లా’ పుస్తకాలు మిత్రులకి ఇచ్చేశాను. పాతబడినవి అట్లాగే నా దగ్గర ఉండిపోయాయి.

05/06/2017 - 03:46

చింటూచాలా అల్లరివాడు. అమ్మా నాన్న చెప్పింది విన్నట్టు నటిస్తూ.. బడికి వెళ్లకుండా బలాదూర్ తిరిగేవాడు. ఒకవేళ బడికి వెళ్లినా క్లాసులో మాస్టారు చెప్పింది వినేవాడు కాదు. పరీక్షలలో తప్పి మరలా అదే క్లాసు చదివేవాడు. చింటూ వాళ్ల అమ్మానాన్నా చాలాసార్లు చెప్పి చూశారు. వాడిలో మార్పు రాలేదు. జులాయి అనే పేరు పడ్డాడు.

05/06/2017 - 03:26

మనది తపోభూమి. భక్త్భివమే భారత్‌ను తరతరాల నుండి పుణ్యభూమిగా కీర్తినందుకునేలా చేసింది. ఇక్కడ చెట్టూ పుట్టా, రారుూ రప్పా అన్నీ పూజితాలే. ఇక గోవులు, పాముల గురించి చెప్పనక్కరలేదు. మనిషిలో దేవుడిని చూడాలని అద్వైతులు పూర్వమే చెప్పారు. కానీ మనవారు మరింత ముందుకెళ్లి మనుషులతో పాటు మరెన్నో వాటిలో దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు.

05/06/2017 - 03:25

మీకో ప్రశ్న

రాముడి తర్వాతి
తమ్ముడు ఎవరు?

05/05/2017 - 23:03

‘చెట్టు నా ఆదర్శం’ అన్నాడు కవి ఇస్మాయిల్. ‘చెట్టులా...’ ఉండలేనని అంటాడు మరో తెలుగు కవి.
చెట్టు ఒక్కటే. చూసే దృక్కోణాలు వేరు. ఇది ఒక చెట్టు విషయంలోనే కాదు. చాలా విషయాల్లో కన్పిస్తుంది.

04/29/2017 - 21:10

ఈ మధ్య ఓ మిత్రుడు రాజులా బతకాలని చెప్పాడు. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పాడు. అందరికీ ఎలా వర్తిస్తుందో అర్థం కాలేదు. రాజులా బతకాలంటే ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఆ విషయం అతనే్న అడిగాను. అతను ఓ నాలుగు విషయాలు చెప్పాడు. వాటిని పాటిస్తే రాజులా బతకొచ్చని చెప్పాడు.

Pages