S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాంజలి

03/16/2019 - 19:54

భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలలో ఆహార్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే వస్తమ్రులు, మాలలు, ఆభరణములు మొదలైన వాటి వివరణ వీటిలో సుదీర్ఘంగా ఇవ్వబడింది. కొన్ని ఆభరణాలు విశిష్ట స్థానాన్ని సంతరించుకుని, తమకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాయి. వేల సంవత్సరాలుగా ఆభరణాల చుట్టూ అల్లబడిన కథలు, సంఘటనలు, కావ్యాలు, నాటకాలు ఉన్నాయి. ఇవి సంస్కృత, తెలుగు, ఇతర భాషల్లో చూస్తాం.

02/23/2019 - 20:32

శరత్‌చంద్ర ఒక యుగం, ఒక హిమపర్వతం, ఒక గంగానది. ఈయన రాసిన నవలలు దేశ, కాలములను అధిగమించి సర్వవ్యాప్తమైనాయి. అనగా త్రికాలా బాధితం. వీరు 15, సెప్టెంబర్ 1876 దేవానందపూర్, హుగ్లీలో జన్మించారు. వీరి బాల్యం నిరంతరం గర్భదారిద్య్రం, పరాశ్రయంలోనే గడిచిపోయింది.

02/16/2019 - 20:22

మన భారతదేశం గర్వించే రచయిత శరత్‌చంద్ర. వీరు బెంగాలీ రచయిత అయినా, వీరి నవలలు, కథలు అన్ని భాషలలోకి అనువదింపబడ్డాయి. వీరు సెప్టెంబర్ 1876లో హగ్లీ దేవానందపూర్‌లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భువల మోహిని, మోతీలాల్. తోబుట్టువులు అనిలాదేవి, ప్రకాశ్, ప్రభాస్, సుశీల. వీరి జీవితం సారా, నల్లమందు, ప్రేమానే్వషణ సత్యానే్వషణలో గడిచిపోయింది. ఇతడే దేవదాసు కదా!

02/09/2019 - 20:22

కాకతీయ సామ్రాజ్యాన్ని 13వ శతాబ్దంలో ఏలిన సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి. ఆవిడ తల్లిగా, కూతురిగా, భార్యగా, మహారాణిగా, వీర వనితగా, సైన్యాన్ని ముం దుకు నడిపించిన శక్తి స్వరూపిణిగా ఎన్నో బాధ్యతలు వహించింది. ఆమె మరణించే సమయానికి 80 ఏళ్ల వయసు దాటినట్లు తెలుస్తున్నది. ఒకప్పుడు ఆమెకు విధేయుడైన జన్నిగదేవుడు, అతని తమ్ముడు త్రిపురాంతకుడు ఆమెకు ఎంతో సహాయం చేసేవారు.

02/02/2019 - 19:48

కూచిపూడి మణిమయ కిరీటం భామా కలాపం. వందల సంవత్సరాలుగా, తరతరాలుగా చేసేవారినీ, చూసేవారినీ పవిత్రులని చేస్తూ, రసగంగలా ప్రవహిస్తోంది. భామాకలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుడు, మాధవి పాత్రలు ఉన్నాయి. సత్యభామ సౌందర్య గర్విత; భర్తను కొంగుకు కట్టుకున్న స్వాధీనపతిక. సత్యభామ జీవాత్మకు సంకేతం. శ్రీకృష్ణుడు పరమాత్మ. అందం, అహంకారం వదిలి, జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడం భామాకలాపం యొక్క సారాంశం.

01/26/2019 - 23:06

డా.పి.రమాదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, రచయిత్రి. కూచిపూడి నృత్యంలో పిహెచ్.డి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.్ఫల్ చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.లో స్వర్ణ పతకం పొందారు. వీరు ఎన్నో పుస్తకాలు రాశారు. శ్రీసాయి నటరాజ అకాడమీ స్థాపించి దశాబ్దాలుగా నృత్యం నేర్పిస్తూ ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. వీరు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. డా.

01/19/2019 - 20:37

డా. అక్కిరాజు సుందర రామకృష్ణ జగమెరిగిన కళాకారుడు. ఈయన కవి, నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేసి, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి అందుకున్నారు. పద్యకవి, అధిక్షేప కావ్య రచయిత వీరు. వారి గురించి వారి మాటల్లోనే...
* * *

01/12/2019 - 20:23

మస్తాన్‌రాజా ప్రఖ్యాత కీ బోర్డ్ ప్లేయర్. వీరి స్టేజి పేరు చంద్రలేఖ. ప్రొ.అలేఖ్య పుంజాల, దీపికారెడ్డి, పద్మభూషణ్ స్వప్నసుందరి మొదలగు కళాకారుల ప్రదర్శనలలో వీరు సంగీత సహకారాన్ని అందించారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు విద్యాసాగర్, స్నేహలతా మురళి మొదలగు వారితో కలిసి పనిచేశారు. టీటీడీ ఆధ్వర్యంలో బి.వి. మోహన కృష్ణగారికి వంద అన్నమయ్య పదాలకి కీబోర్డు వాయించారు.

01/05/2019 - 20:38

క్రీ.శ.1290 ప్రాంతంలో భారతదేశ చరిత్రను మార్చిన వీరుడు మాలిక్ కాఫిర్. ఇతడు ఢిల్లీని పాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీకి బానిస. వెయ్యి దీనారాలకు అమ్ముడుపోయి, నపుంసకుడిగా మార్చబడిన ‘హజార్ దీనారీ’ మాలిక్ కాఫిర్. ఇతను వీరుడు. కానీ నాయకుడు, ప్రతినాయకుడు కాదు. అంటే ఇతను హీరో కాదు, విలన్ కాదు. వేటాడి, వేటాడబడి, తన క్రోధాగ్నిలో తనే ఆహుతి అయిపోయిన అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రియుడు.

12/29/2018 - 18:41

ఏ భారతీయ నృత్యానికైనా ఆంగికం, వాచికం, సాత్త్వికం, ఆహార్యం అని నాలుగు అభినయాలు ఉంటాయి. నర్తకీమణులు, నర్తక రత్నాలు ఎంతో బాగా నృత్యం చేసి, హావభావాలతో ప్రేక్షకులను అలరించినా, ఆహార్యం అంటే మంచి వస్తధ్రారణ చాలా ముఖ్యం. ఆ విధంగా జీవితాన్ని నృత్య ఆహార్యానికి అంకితం చేసిన గొప్ప కళాకారుడు శ్రీ నాగయ్యగారు.

Pages