S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/26/2016 - 02:03

సింహాచలం, మార్చి 25: ప్రకృతి విపత్తుల నుండి లోకాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో పూజలు, యాగాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయశాఖ అస్థాన జ్యోతిష్యుడు శ్రీపాద శ్రీవల్లభ మహాపీఠం వ్యవస్థాపకుడు పూజ్యం విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన సింహగిరిపై విలేఖరులతో మాట్లాడారు. విపత్తులను ముందుగా గ్రహించే వ్యవస్థ జ్యోతిష్య శాస్త్రంలో ఉందని అన్నారు.

03/26/2016 - 02:02

ఒంగోలు, మార్చి 25: ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని పట్ట్భాముల్లో ఇసుకను ఉచితంగా తవ్వుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయటంతో జిల్లావ్యాప్తంగా ఇసుకమాఫియాకు అడ్డుకట్ట పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం ఐదు ఇసుక రీచ్‌ల ద్వారానే ఇసుకను ఉచితంగా తరలిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా పట్ట్భాముల్లో ఇసుకను తవ్వుకునేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

03/26/2016 - 01:55

అనంతపురం, మార్చి 25 : రాయలసీమలో భానుడి ప్రతాపం ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. సీమవ్యాప్తంగా జిల్లాల్లో వేడిగాలులు, ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనంతపురం జిల్లాలో శుక్రవారం సగటు ఉష్ణోగ్రత 40.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా అత్యధికంగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో 47.4 డిగ్రీలు నమోదైంది. జిల్లా కేంద్రంలో మాత్రం 39.8 డిగ్రీలు నమోదైంది.

03/26/2016 - 02:54

తిరుమల, మార్చి 25: తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మార్గ మధ్యంలో ఉన్న జింకలపార్కు సమీపంలోని శేషాచల అడవుల్లో మంటలు అటవీసంపదను భస్మీపటలం చేస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్‌లు అక్కడకు చేరుకున్నప్పటికీ మంటలు చెలరేగుతున్న ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో పైపుల ద్వారా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, టిటిడి అటవీశాఖ తమ ధోరణిలో మంటలను అర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

03/26/2016 - 00:59

గుంటూరు, మార్చి 25: ముందుగా నిర్ణయించిన మేరకు గడువులోగా ఎపి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు సూచించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి గ్రామంలో ప్రారంభమైన తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు.

03/26/2016 - 00:56

హైదరాబాద్, మార్చి 25: రాష్ట్రంలో వౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. 2020 నాటికి వౌలిక సదుపాయాల రంగంలో దేశంలోనే నెంబర్ ఒన్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందన్నారు.

03/26/2016 - 00:53

అనంతపురం, మార్చి 25: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు వారి ముంగిటకే అందించేందుకు ప్రభుత్వం 2010లో 104 సేవలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల గ్రామీణ పేదలకు ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందడంతోపాటు సాధారణ జబ్బులకు సైతం మందులు ఇంటి వద్ద పొందే సదుపాయం కలిగింది. అయితే ప్రభుత్వం వైద్య రంగంలో సంస్కరణల పేరిట వైద్య ఆరోగ్య శాఖను ప్రైవేట్‌పరం చేసే ప్రక్రియకు తాజాగా తెర తీసింది.

03/26/2016 - 03:08

హైదరాబాద్, మార్చి 25: అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిటీ ఆధ్వర్యంలో ఆస్తులను వేలం వేసి వచ్చిన సొమ్మును పంపిణీ చేస్తామని ఆంధ్ర సిఐడి చీఫ్ ద్వారక తిరుమలరావు చెప్పారు. జ్యుడీషియల్ కమిటీ తొలి విడతగా వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఆరు ఆస్తుల వేలం ప్రక్రియను ఏప్రిల్ 20,21 తేదీల్లో చేపడుతుంది. ఎటువంటి పరిస్ధితుల్లో బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

03/26/2016 - 00:46

ఏలూరు, మార్చి 25: రాష్ట్రంలో రుణ విష వలయంలో చిక్కుకున్న రైతాంగాన్ని వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం ప్రస్తుతం అమలవుతోందని, అయితే రైతులను పూర్తిగా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారన్నారు.

03/25/2016 - 17:59

విజయవాడ: ఎపి రాజధాని అమరావతిలో నిర్మించే భవనాలకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు, వాస్తుశిల్పులు పాల్గొన్నారు. రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు వంటి భవనాలను నిర్మించేందుకు నిపుణుల నుంచి ప్రభుత్వం డిజైన్లను ఆహ్వానించింది.

Pages