S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/28/2016 - 00:46

కాకినాడ, మార్చి 27: పార్టీలోకి వస్తే కీలక బాధ్యతలను అప్పగిస్తామంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అధికార తెలుగుదేశం పార్టీ నుండి స్పష్టమైన హామీ లభించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష ఉపనేతగా ఉన్న జ్యోతుల నెహ్రూకు తూర్పు గోదావరి జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది.

03/27/2016 - 07:33

విజయవాడ, మార్చి 26: అత్యున్నతమైన పార్లమెంట్ భవనాన్ని అందులోనున్న పార్లమెంటు సభ్యులతో మట్టుబెట్టే దురుద్దేశంతో 13 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అఫ్జల్‌గురు, ముంబయి పేలుళ్లలో సూత్రధారి యాకూబ్ మీనన్ వంటి వారికి జేజేలు పలుకుతున్న సంఘ విద్రోహులకు సంఘీభావం పలుకటం సిగ్గుచేటని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు.

03/27/2016 - 06:34

హైదరాబాద్, మార్చి 26: అనంతపురంలోని మిస్సమ్మ బంగ్లా కేసులో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు అధికార పార్టీ ప్రస్తావించడంతో ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార, ప్రతిపక్షం మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ఈ సందర్భంగా శాసనసభలో ప్రకటించారు.

03/27/2016 - 06:33

హైదరాబాద్, మార్చి 26: రాజధాని నగర నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూముల్లో చేపట్టే నిర్మాణాలు, పనులన్నీ సిఆర్‌డిఏ చట్ట పరిధికి లోబడే చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు ఇష్టానుసారంగా లీజులుకు ఇస్తున్నారన్న మాట వాస్తవం కాదని అన్నారు.

03/27/2016 - 06:33

హైదరాబాద్, మార్చి 26 : రాష్ట్ర ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా పరిపాలనను అందించేందుకు ‘ఇ-ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శాసనసభలో శనివారం ఇ-ప్రగతిపై ఒక ప్రకటన చేస్తూ, ప్రజలకు వివిధ రంగాలకు సంబంధించి 745 సేవలను అందించాలన్నదే ఇ-ప్రగతి లక్ష్యమన్నారు.

03/27/2016 - 06:32

గుంటూరు, మార్చి 26: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులు గుంటూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్న తరుణంలో పార్టీ కార్యాకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగించాలనే తలంపుతో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. శనివారం పార్టీ హైకమాండ్ నుంచి పరిశీలకులుగా నాయకులు సాంబశివరావు, పార్టీ సాంకేతిక విభాగం సభ్యుడు రాజేష్ తదితరులు జిల్లాపార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.

03/27/2016 - 06:31

విజయనగరం, మార్చి 26: విద్యావేత్తగా, అర్థశాస్త్రంలో పట్టు ఉన్న వ్యక్తిగా, 105 దేవాలయాల అనువంశిక ధర్మకర్తగా, 15 విద్యా సంస్థల చైర్మన్‌గా మాజీమంత్రి, విజయనగరం రాజవంశీకుడు పూసపాటి ఆనందగజపతిరాజు (65) జిల్లాప్రజల మన్ననలు పొందారు.

03/27/2016 - 06:30

కడప, మార్చి 26: కేంద్ర మాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్ ఇటీవలే సైకిలెక్కడంతో ఆయన క్లాస్‌మేట్, సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి.మదనమోహన్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది.

03/27/2016 - 06:10

నల్లగొండ, మార్చి 26: వడదెబ్బ తీవ్రతతో నల్లగొండ జిల్లాలో ముగ్గురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఒకరు మరణించారు. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన పెద్దబోయిన సైదులు (55) తన వ్యవసాయబావి వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

03/27/2016 - 06:09

హైదరాబాద్, మార్చి 26: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పట్ల వివక్ష కొనసాగుతోందని, దళిత, మైనార్టీ వర్గాల అణచివేతతో విద్యార్థులు అసహనానికి గురవుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, గీతారెడ్డి ఆరోపించారు. శనివారం శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌వద్ద విలేఖరులతో మాట్లాడారు.

Pages