S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/17/2016 - 07:48

ఢిల్లీ నడిబొడ్డున విదేశీ గళానికి మరో రూపం వికటాట్టహాసం చేసింది. పాకిస్తాన్ అనుకూల శక్తులు సాంస్కృతిక ఉత్సవం2 పేర తీవ్రవాదులకు జయగానం చేశారు. కళాశాల విద్యలో ఏనాడైనా జనగనమన పాడేరో లేదో కాని కరువుతీరా అరువు తెచ్చుకున్న భారత వ్యతిరేక నినాదాలతో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణం హోరెత్తించారు.

02/15/2016 - 23:27

ఈ రెండేళ్ల పాలనా కాలంలో నరేంద్ర మోదీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది సాంస్కృతిక, కళా రంగాలు, చలనచిత్ర పరిశ్రమ, సాహిత్య సంగీత నాటక అకాడమీలు, విద్యావిధానం, పాఠ్యాంశాల రూపకల్పన. వీటిల్లో ఎటువంటి వౌలికమైన మార్పులు జరగలేదు. గత అరవై సంవత్సరాలుగా వస్తున్న విద్యా విధానాలే గతానుగతికంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో సంస్కృత, హిందీ పదాలు కనబడకుండా చేశారు.

02/15/2016 - 01:22

గత సాధారణ ఎన్నికల (2014) అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ స్పష్టత ఏర్పడింది. కానీ తెలంగాణలో అది జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికార పక్షం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షం అయ్యాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కనుచూపు మేరలో లేవు. బిజెపి విడిగా ఉండకుండా అధికార కూటమిలో భాగస్వామి అయింది.

02/14/2016 - 04:32

రెండు వర్గాల మధ్యన వైరాన్ని లేవదీయడం వలసవాదుల నీతి. ఈ నీతిని బ్రిటీషు వాళ్ల నుంచి వారసత్వంగా అదిపుచ్చుకున్నారు మన పాలకులు. స్వాతంత్య్రానికి ముందు ఎలాంటి సామాజిక సమస్యలున్నాయో, దాదాపు దేశంలో ఇప్పుడు అవే సమస్యలు జఠిలంగా మారి కొనసాగుతున్నాయి. బ్రిటీషు ఇండియాలో జాతుల మధ్యన గల వైరుధ్యాల్ని, వెనుకబడిన ఆదిమ జాతుల సామాజిక ఆర్థిక, రాజకీయ కారణాల్ని పరిశీలించడానకి అనేక కమిషన్లను వేయడం జరిగింది.

02/12/2016 - 22:46

ప్రపంచ దేశాలకు చెందిన ఆర్థిక వ్యవస్థలకు నూతన సంవత్సరం చిరు దరహాసాన్ని అందించింది. అయితే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తాను కూడా ఉన్నానని భారత్ దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు మరచిపోకుండా గుర్తు చేస్తుంటుంది. ముఖ్యం గా ప్రపంచంలో జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశంగా భారత్ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పరంగా స్థిరంగా ముందుకు పోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏ దేశం కూడా స్వయం సమృద్ధం కాదు.

02/12/2016 - 05:24

స్పానిష్ అంతర్యుద్ధం అప్పట్లో మెడిటరన్ యూరోపియన్ దేశ సరిహద్దు ప్రాంతాలకు పరిమితమైంది. 1936-39 సంవత్సరాల మధ్య చోటు చేసుకున్న ఈ అంతర్గత పోరాటం తర్వాతికాలంలో అంతర్జాతీయ సంఘర్షణగా మారిపోయింది. ఈ యుద్ధంలో మాడ్రిడ్‌లోని వామపక్ష ‘రిపబ్లికన్’ ప్రభుత్వాన్ని, జనరల్ ఫ్రాన్సిస్‌స్కో నేతృత్వంలోని ‘నేషనలిస్ట్’లు సవాలు చేయడమే కాదు అధికారం నుంచి తప్పించారు కూడా.

02/11/2016 - 06:00

ఏమి ‘తక్కు నాలగీ?’-టెక్నాలజీ- ఎంత అద్భుతం అని గ్రామీణులు ముక్కుల మీద వేళ్లు వేసుకొని ఉండేవారు. ఈ ‘టెక్కునాలజీ’ గురించి నగరాలలోని కాలనీలలో సాయంత్రంపూట వీధుల చివర ఆసీనులైపోయే విశ్రాంత మేధావులు సైతం పెద్ద గొంతులతో ప్రచారం చేసి ఉండేవారు.

02/10/2016 - 04:39

వర్తమాన ప్రపంచ పరిస్థితులు శరవేగంగా మార్పు చెందుతున్నాయి. ఈ తరుణంలో కూడా వామపక్షాలు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా కాకుండా, ఇంకా కాలం చెల్లిన సైద్ధాంతిక కోణంలోనే తమ రాజకీయ విన్యాసాలను నడుపుతుండటం విచిత్రం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఈ ఎండాకాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి.

02/09/2016 - 05:33

‘‘ఆస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మా- హిమాలయో నామ నగాధిరాజః’’ అని కాళిదాసు హిమాలయాలను దేవతాత్మగా వర్ణించాడు. సృష్టి పుట్టినప్పటినుండి హిమాలయాలు భారతదేశానికి సహజ రక్షణను కల్పించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంవల్ల విమానాల ద్వారా రాకెట్ల ద్వారా అంతర్జాతీయ క్షిపణుల ద్వారా హిమాలయాలను అధిగమించి భారత్ పైకి దాడిచేసే అవకాశాలు శత్రువులకు ఏర్పడింది.

02/08/2016 - 01:21

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పోలింగు రోజున ఇతర పార్టీలపై చేసిన దౌర్జన్యాలతో మజ్లిస్ పార్టీ ఒంటరిగా మారింది. ఎన్నికల కార్యక్రమం మొదటినుంచి ప్రశాంతంగా సాగింది. పోలింగు కూడా ప్రశాంతగా ముగియనున్నదని అందరూ సంతోషిస్తున్న సమయంలో ఉన్నట్లుండి మజ్లిస్ పార్టీ హింస ఆరంభమైంది. ఇదీ అదీ అని గాక కాంగ్రెస్, బిజెపి, టిడిపిలతోపాటు తమ మిత్రపక్షమని అందరూ భావిస్తున్న అధికార టిఆర్‌ఎస్ పైన సైతం వారు దాడులకు తలపడ్డారు.

Pages