S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

03/18/2016 - 23:40

ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు చక్ర బంధంలో ఇరుక్కు పోయారు. సొంత రాష్ట్రంలో, ఢిల్లీలో, చివరకు పొరుగు రాష్ట్రం ఆయనకు అన్నీ సమస్యలుగా మారాయి. పివి నరసింహారావు తరువాత ఢిల్లీలో కీలక భూమిక పోషించిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ‘‘ఐకె గుజ్రాల్, దేవగౌడలను ప్రధానమంత్రులను చేసింది నేనే. బిఆర్ అంబేద్కర్‌కు భారత రత్న ఇప్పించింది నేనే.

03/18/2016 - 00:05

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్‌కు ముస్లింలపట్ల తనకున్న వ్యతిరేకత విషయంలో ఎలాంటి దాపరికాలు లేవు. ఇస్లాం మతం అంటే ఆయన ఒంటికాలి మీద లేస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఆశావహులుగా ఉన్నవారందరిలోకి ఆయన పేరు మారుమోగి పోతోంది.

03/17/2016 - 06:35

బాసిలస్ తురింజెనిసిస్-బిటి- జీవరసాయన విషం నిండిన పత్తిపంట వ్యవసాయ భూమిని బీడు చేస్తోంది, రైతుల బతుకులను పాడు చేస్తోంది. పరిసరాలను ప్రకృతిని గాయపరుస్తోంది. ప్రజలను వ్యాధిగ్రస్థులను చేస్తోంది. ప్రపంచీకరణ ప్రాంగణంగా మనదేశం ఏర్పడిన నాటినుంచి, మన వ్యవసాయ నందనం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలనే మారీచ మృగాలకు స్వేచ్ఛావిహార భూమిగా మారిపోయింది.

03/16/2016 - 00:45

‘‘మీ మోదీ ఎంతకాలముంటాడో చూద్దాం. ఆయన యాభైఏళ్లుంటాడా? ఆ తరువాత మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూ స్తాం,’’ఈ మాటలు మామూలుగా ఎవరంటారు? దౌర్జన్యం, గూండాగిరి చేసే వ్యక్తులు తమ ప్రత్యర్థులనుద్దేశించి అంటారు. కానీ ఢిల్లీలోని పేరు గొప్ప జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అయితే కొందరు ప్రొఫెసర్లు, స్కాలర్లే అనేస్తారు. ‘‘కాశ్మీర్‌ను, నాగాలాండ్‌ను భారత్ అన్యాయంగా ఆక్రమించింది.

03/15/2016 - 01:20

మనసున మల్లెల మాలలూగెనే అని దేవులపల్లివారు అరవై సంవత్సరాల క్రితం ఒక చిత్రగీతం రాశారు. ఇప్పుడు 2016లో దానిని కొంచెం మార్చి ‘‘మనసున మాల్యల మాలలూగెనే’’ అని పాడుకోవాలి. పదివేల కోట్ల ధనం బ్యాంకులకు ఎగగొట్టి విజయమాల్యా ఇంగ్లండ్‌కు పారిపోయాడు. దేశంలో ఇంకా వందలాది మంది మాల్యాలున్నారు. ఏ వ్యాపారమూ చేయకుండా దేశ ఆర్థిక ప్రగతి ఎలా సాధ్యమవుతుంది?

03/14/2016 - 00:41

తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఇంకా రుజువులు కావాలని కోరుతున్నవారు ఎవరైనా ఉన్నారా అనేది అనుమానమే. ఒకవేళ ఉండి ఉంటే అవి ఈ నెల 9వ తేదీన మరొకమారు లభించాయి. వరంగల్, ఖమ్మం, మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల ఫలితాల రూపంలో. అందుకు సంబంధించిన గణాంకాలను వేర్వేరు కోణాలలో చూసి రకరకాల విశే్లషణలు వెలువడుతున్నాయి. వాటన్నింటిని సారాంశరూపంలో చెప్పేందుకు బహుశా ఇవి సరిపోతాయి.

03/12/2016 - 22:29

‘మనవాళ్లంతా ఏం చేస్తున్నారు..?’ అంటూ ఓ స్నేహితుడు స్వంత ఊర్లో వుంటున్న మరో స్నేహతుడిని ప్రశ్నిస్తే, ‘ఏముంది..చదువుకున్న వారంతా ఏవో ఉద్యోగాలు చేసుకుంటూ వుంటే, ఫెయిల్ అయిన వారంతా కొందరు రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడితే, మరికొందరు ప్రైవేటు స్కూళ్లను పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాల్ని కల్పిస్తున్నారు..’ అనే తెలుగు సినిమా డైలాగు తెలిసిందే!

03/11/2016 - 23:50

న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై ఇటీవల ఒక పరిశోధన జరిగింది. అందులో కొన్ని దిగ్భ్రాంతిని కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడువేల గర్భ నిరోధక కండోమ్స్ దొరికాయి. మాదక ద్రవ్యాలు ఇంజక్షన్ రూపంలో తీసుకొనే సూదులు దొరికాయి. గంజాయి వంటి ఇతర పదార్ధాలు యూనివర్సిటీకి సరఫరా చేయబడుతున్నాయి. కాశ్మీరు నుండి ఉగ్రవాదులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

03/11/2016 - 01:31

‘స్వేచ్ఛ’, ‘అసమ్మతి హక్కు’, ‘నేరం చేసే హక్కు, ‘దేనికీ కట్టుబడని భావ ప్రకటన స్వేచ్ఛ’, ‘జాతీయత వర్సెస్ జాతి వ్యతిరేకత’ వంటి పదాలు లేదా పద బంధనాలు అందరినోట వినిపిస్తున్నాయి. ఇవి గణనీయ స్థాయిలో వామపక్ష లేదా అతివాద వామపక్ష శక్తులకు రాజకీయ ఊతాన్నిచ్చాయి. అలాగే విద్యా సంస్థల్లో తరిగిపోతున్న వామపక్ష భావజాలానికి ప్రాణవాయువును అందించాయి.

03/10/2016 - 04:24

మదరాసు ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. తమిళనాడులోని ప్రభుత్వేతర పాఠశాలల్లో ప్రతిరోజు జాతీయ గీతాన్ని-నేషనల్ యాంథమ్-ఆలపించాలని మార్చి ఐదవ తేదీన ఆదేశించింది! విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో విధిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్న కేంద్ర ప్రభుత్వం వారి సూచన ఈ ఆదేశానికి నేపథ్యం!

Pages