S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/20/2016 - 07:55

ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని రాజకీయ పార్టీలు నాయకులు మారినా భారతదేశంలో మాత్రం అధికశాతం మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. వీరి జీవితాల్లో మెరుగుదల కనిపించడంలేదు. అభివృద్ధి పథంలో భారత్ వెలిగిపోతోందంటున్నా, అది కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం. రాజకీయ పెద్దన్నలు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, తమ వ్యక్తిగత ఆస్తులను కూడ బెట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు.

09/19/2016 - 04:33

సర్కారు బడుల్లో కూడా డిజిటల్ విద్యాబోధన జరగాలని అప్పటి కేంద్ర సహాయక ఐ.టి. మంత్రి కిల్లికృపారాణి అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. నేటికి రెండు సంవత్సరాలు పైబడినా ఈ పథకం నీరుకారిపోయింది. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో కంప్యూటర్లను కొనుగోలు చేసినా ఈ కంప్యూటర్లు ఏమయ్యాయో వీటి అతీగతీ లేదు.

09/18/2016 - 03:05

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరం నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో తొలిసారిగా ఈసారి వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అత్యధిక పందిళ్లలో నవరాత్రులతో పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. కృష్ణా జిల్లాలో 3 వేలకు పైగా పందిళ్లతో పాటు విజయవాడ నగరంలో వెయ్యికి పైగా పందిళ్లు పోటాపోటీగా వెలిశాయి.

09/17/2016 - 02:17

కొందరు సేవ చేయించుకోవడం కోసమే పుట్టినట్టుంటారు. మరికొందరు సేవ చేయడంకోసమే జన్మించినట్టుంటారు. ఇందులో ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు రెండో కోవకు చెందినవారు. తెలుగు సాహిత్యానికి తన రచనల ద్వారా ఉత్తేజాన్ని కలిగించిన గొప్ప దార్శనికుడు ఆయన. తెలుగు భాషలో కొత్త పదాలెన్నింటినో సృష్టించి ఖ్యాతి పొందిన వారిలో తాపీ తొలి పంక్తిలో ఉంటారు.

09/17/2016 - 02:14

ఇటీవలి కాలంలో హిందూ ధర్మాన్ని విమర్శించడంవల్లనే గొప్పవాళ్లం అవుతామని, గొప్ప పేరువస్తుందని భావిస్తున్నవాళ్లు ఎక్కువయ్యారు. వాళ్లు హిందూ ధర్మంపై పొరలను మాత్రమే పరిశీలించి తమ అహంకారం ప్రదర్శించి ఆనందం పొందుతున్నారు. నిజానికి హిందూధర్మం ప్రస్తుతం భారత్‌కు మాత్రమే పరిమితమైంది కాదు. ఇటీవల కాలంవరకు నేపాల్‌లో హిందూ రాజ్యం ఉండేది.

09/16/2016 - 05:56

ఆంధ్రాకు ప్రత్యేక హోదా అనే అంశం రాష్ట్ర విభజన చట్టంలో లేదని, వుండి వుంటే దానినిపుడు తాము అమలుచేసేవారమని బి.జె.పి. ప్రభుత్వంలోని కొందరు అగ్ర నాయకులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా మాటలా వుంచితే, అసలు రాష్ట్ర విభజన చట్టమనేది వుందా? ఆ చట్టాన్ని ఎవరు చేసారు? పార్లమెంటు చేసిందా? ఎలాంటి పార్లమెంటు, ఏ రీతిలో చేసింది?

09/16/2016 - 05:53

‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలెందరో?’ అన్నట్లు భారత స్వాతంత్య్ర సంగ్రామంలోకి దూకి బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడి, తమ మానప్రాణాలను సహితం త్యాగంచేసిన ఘనంగా 70వ స్వతంత్య్ర దినోత్సవం జరుపుకున్నాం అంటే అది వారి త్యాగఫలమే. కానీ ప్రభుత్వాలు మారుతున్నా, అప్పటి స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో వున్నారు. వారిలో కొందరికి పింఛను, తదితర ప్రభుత్వ పథకాలు అందటం లేదనడం అతిశయోక్తి కాదు.

09/15/2016 - 06:00

ఒకే నాగరికత, సంస్కృతి గల భారత జాతి తొలిసారిగా ఒకే ప్రభుత్వం, ఒకే పతాకం కిందకు వచ్చిన రోజైన సెప్టెంబర్ 17ను భారత జాతి మొత్తం ఐక్యతా దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యావత్ భారతదేశం ఒకే గొడుగుకిందకు వచ్చిన చారిత్రాత్మక క్షణం హైదరాబాద్ విమోచన దినం.

09/15/2016 - 05:58

భువనగిరి హైస్కూల్‌లో పనిచేస్తున్నప్పుడు లెక్కల సార్ తెలిదేవర వెంకట్రావ్ నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ఏ విషయమైనా ఆలోచించి మాట్లాడాలి అనేవారు.
ఆలోచన లేకుండా మాట ఎలా వస్తుందని నేను అన్నాను.
ఆలోచన అంటే ఏం చెప్తావని మళ్లీ అడిగాడు.
నా మొఖం తెల్లబోయింది. ఏం చెప్పలేకపోయాను.

09/14/2016 - 06:24

సుఖమైన జీవనానికి పునాది ‘యోగ’. యోగ అనేది ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. కొంతమంది ఈ ‘యోగ’ను సాధన చేయలేమని అపోహపడి చేయాలనే ఆసక్తివున్నా ‘శక్తి’చాలదని భయపడి దాని జోలికి వెళ్ళరు. కానీ యోగతో ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చునన్న నిజాన్ని గ్రహించరు. ఆసనాలువేయడం ఎంతో కష్టం అని అనుకుంటారు, సాధన చేయడానికి ఆసక్తి చూపరు.

Pages