S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/03/2019 - 18:54

క్రూర మృగమ్ములనె జంపు- విడిచు సాధుమృగముల
పారనిచ్చు ముసలి ముదక- వీడును పసికూనల

ఎంత ఊరమటులరిగెనొ? ఎంత ప్రొద్దుగడిచెనొ?
ఎరుగబోడు ఆ నృపుండు! ఏ దెస పయనించెనొ?

సూర్యరథం పశ్చిమాన అంబుధిలో మునిగె
లోకమెల్ల కానరాని చీకటులను మునిగె

దివిటీలను వెలిగించుచు సాగెను సైన్యమ్ము
భూమిపైన చుక్కలనగ వెలిగెను సైన్యమ్ము

05/02/2019 - 19:23

ఆతని గుర్తించుచు
రాజదర్శనమ్మె దైవదర్శనముగ నెంచుచు

అపుడా దశరథుని ధనువు ఇంద్రధనువు బోలె
అతడు విడుచు బాణమ్ములు మెరుపులనే పోలె

ఒక దిశనే తన తేరును నడిపించెను ఇనుడు
దశదిశలను తన తేరును నడిపె దశరథుండు

నింగినుండి ఏమాత్రం భూమికి దిగడినుడు
నింగిని నేలను దున్నుచుతేరు నడుపు నృపుడు

05/02/2019 - 19:20

ప్రతులకు : H.No.7-8-51,Plot 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
====================================================================

05/01/2019 - 19:34

కైలాస నాథుడైన పరమేశ్వరుడు హిమాచల ప్రదేశ్ లోని కులూ జిల్లాల్లో బిజిలీ మహాదేవ్‌గా కొలువైనాడు. కులూ జిల్లాకు పదకొండు కి.మీ. దూరంలో బియాస్, పార్వతి నదుల సంగమ స్థానంలో మహాదేవుని ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి సమారుగా 2,455 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయంలోని మహాదేవ్ మహిమ ను చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

05/01/2019 - 19:31

దశదిశల్లో అతని కీర్తిరేఖలు విస్తరించాయి.
వాళ్ళకి అతడే తండ్రి, అతడే తల్లి, అతడే దేవుడు.
ఆ రాజుకు కన్నబిడ్డలు లేరు. ప్రజలే అతని కన్నబిడ్డలు.
ఆ రాజునీ, ఆ ప్రజల్నీ వేధిస్తోన్న సమస్య అదే! అదే సంతాన సమస్య!
వారి ఉత్తరాధికారి ఎవరనే సమస్య!
మృగయా వినోదంసూర్యుని రథచక్రమ్ములకేమి అడ్డుతగిలెనో?
ఆగిపోయెనతని రథం ఆకాశం నడుమ.

04/30/2019 - 18:45

‘‘మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాచ స్వదేశో భువనత్రయం’’.

04/30/2019 - 18:43

అందుకే, ఆ వీథులు దృశ్యశ్రవ్య కావ్యాల్లా భాసిస్తాయి. అక్కడ ఇంటింటా నిత్యాగ్నిహోత్రం. అందుకే ‘స్వాహా’కారాలు తప్ప ‘హాహా’కారాలు వినిపించవక్కడ.
అక్కడ సరస్వతికి గుళ్ళుండవు. ప్రజల నోళ్ళలోనే ఆమెకు కాపురం. లక్ష్మీదేవికి గుళ్ళుండవు. ఆమెకు ఇళ్లన్నీ గుళ్లే. అసలక్కడ ఏ దేవునికీ గుడి ఉండదు. దేవతలంతా ప్రజలై వసిస్తారక్కడ.
అక్కడి చెరసాలలన్నీ ఖాళీగా, బోసిగా ఉంటాయి, నేరస్థులు లేక!

04/29/2019 - 22:47

అంతా సమానం అని అందరూ చెబుతుంటారు. సమదృష్టిని కలిగి ఉండాలి అంటారు. అంతా సమానమైనపుడు దృష్టి మళ్లా సమంగా ఉండాలని ఎందుకంటారు? అక్కడే అసలైన విషయం ఉందన్నమాట. మనుషులందరూ సమానమైనా వారి వారి పూర్వజన్మలను బట్టి కొందరు ధనవంతులు, మరికొందరు దారిద్య్రావస్థలో మునిగివారు, మరికొందరు పెద్ద ఉద్యోగస్తులు, మరికొందరు నిరుద్యోగులు, ఇంకొందరు అటు తినడానికి, నివసించడానికి సరిపడని డబ్బు గలవారుగా ఉంటుంటారు.

04/29/2019 - 22:37

వేదమంత్రమన్నట్టుల- వేదసార మన్నట్టుల
ఏర్పడె ‘సీతాయనమ్ము’- విశ్వతత్త్వ మన్నట్టుల

‘సీతాయన’కావ్యమ్మే- ‘రామాయణ’మాయెను
మొక్కవోలె పెరిగి పెరిగి మహావృక్షమాయెను

ఎందరొ రాములు బుట్టిరి- ఒకటే రామాయణం
ఎందరొ కలములబట్టిరి కవియన వాల్మీకియే

నిలుచుదాక విశ్వమ్మే- నిలుచును రామాయణం
ముగియునేమొ విశ్వమైన- ముగియదు రామాయణం
**
అయోధ్య

04/29/2019 - 18:45

త్రేతాయుగంలో సీతారాములు అన్యోన్య అనురాగాలున్న దంపతులుగా కీర్తించబడ్డారు. శివుని విల్లు విరిచి దశరథుని అనుమతితో శ్రీరాముడు జనక మహారాజు ముద్దుల కుమార్తెగా పెరిగిన అయోనిజ సీతమ్మను పెండ్లాడాడు. కాని కాలవశాన రాముడు వనవాసాలకు వెళ్లవలసి వచ్చింది. రాముని వెంట సీతమ్మ వనాలకు బయలుదేరింది. సీతారాముల వెంట లక్ష్మణుడూ బయలుదేరాడు. ఆట్లా ముగ్గురూ వనవాసం చేయడానికి వెళ్లారు.

Pages