S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/09/2019 - 19:35

పాటయందుప్రణవమ్మును, ఆడయందు విశ్వక్రీడ
మాటలందు మర్మమ్ముల వారలు చూపించినారు

వాల్మీకియె వారి గురువు వ్రాసెనతడు సీతకథ
రామాయణ మనుపేరను రాజిల్లెను విశ్వమ్మున

వెలుగుల వలె సంచరించి, వాయువటుల వ్యాపించి
సీతారాముల కథలను ఇంటింటికి జేర్చినారు

తలలూపుచు చిరుతలతో ఆ బుడతలు ఆడినారు
బుడతలైన చిరుతమైన చిరుతల తలపించినారు

04/09/2019 - 19:27

జయ హనుమాన జ్ఞాన గుణసాగర... హనుమాన్ చాలీసా ప్రతిరామ మందిరంలోను హనుమద్దేవాలయంలోను ప్రతిదినం వినిపిస్తుంటుంది. ఈ హనుమాన్ చాలీసా, రామచరిత్ర మాసన్ ను , తులసీ మంజరీ రచించిన తులసీ దాసు గురించి తెలుసుకుందాం.

04/08/2019 - 22:39

మన కథయే రామ కథ! మనమే రామాయణం
శ్వాసించిన వినిపించును ఎద ఎద రామాయణం!

ఆ కవితా గానమన్న నా భాగ్యమె భాగ్యం!
ఆ నాట్య కలాపమన్న ధన్యవ్మౌ జీవనం!

నేనెవ్వడ? శ్రీరాముని కథను చెప్పుకొరకు?
రాముండే రామకథను చెప్పుకొనెడివాడు!

నేనెవ్వడ శ్రీకృష్ణుని వంశిని మాత్రమ్మే!
పలికించెడి వాడాతడె పలుకుయు నాతండె!

04/08/2019 - 22:38

ఆ పాటను అతివలపుడు- అందుకొంచు పాడిరి
ఆడుచు పాడుచు అతివలు ఆనందమునందిరి

ఒక సూర్యుని చుట్టునెన్నొ గ్రహములు తిరుగాడినట్లు
ఒక చుక్కను చుక్కలెన్నొ చుట్టుముట్టె నన్నట్టుల

నీహారికలే హారతులివ్వదొడిగె నన్నట్టుల
పాలపుంతలే ముంతల పాల గ్రుమ్మరించినటుల

04/08/2019 - 18:40

సీ. తల్లిదండ్రుల యెడ దయలేని మనుగడ
మనుగడ కాదది మరణవౌను
అవ్వారి సేవయునావంత నెఱపక
బ్రతికెడి బ్రతుకది బ్రతుకుగాదు
వారి సేమము పట్ల బట్టనట్లుండిన
వారేల భూదేవి బాధనొందు
ప్రత్యక్ష దైవాలు వారల నివడచిన
జలనిధిలో జొచ్చి వారలనివిడిచిన

04/05/2019 - 18:49

నా రాముని ఆన వాని వాలమ్మున బంధించెద
వానితోడ వానికొంప తగులబెట్టి వచ్చెద

అనియెనపుడు హనుమంతుడు
అగ్ని పుక్కలించుచు
కృష్ణపత్నులు:
మేమే నిను పిలిచినాము! మేమె నిన్ను తలచినాము
నీ నోటను శ్రీరాముని కథను వినగనెంచినాము
హనుమ:
నా రాముని తోడ మీరలున్నవారు కారె?
తల్లులార! రాముని కథనే జెప్పుట ఏమి?

04/05/2019 - 18:48

1. విళంబి కాలకాళిందిపై కదము తొక్కె
వికారి ఉధృతముగా ఉత్తుంగ తరంగముతో ఉద్భవించె
విరించికైననూ తప్పునా కాలనాగు కాటులు
విచారించి దత్త కాలభైరవుని కాళ్లపైబడుట తక్షణ కర్తవ్యం

04/05/2019 - 18:47

క్లోనింగ్ కోయిల కాబోలు కొత్త రాగాలు తీస్తోంది
ఉగాది గుర్తుకొచ్చి ఉత్సాహం పుట్టుకొచ్చింది
వికారి పేరు గుర్తురాగానే వికారం తన్నుకొచ్చింది
‘విశ్వదాభిరామ వినుర వేల’అంటే వినే రోజులా ఇవి!
కోపం వచ్చినప్రతివాడూ కొత్త పార్టీ పెడ్తున్నరోజులుగా!
టన్నుల కొద్దీ దిగుమతి ఔతున్న విదేశీ సంస్కృతిలో
సంప్రదాయాలు మసకబారుతున్నాయిగా!

04/05/2019 - 18:47

కళ్ళవైపు మీసాల బ్రాకెట్లో
అసత్యాల అగ్నిగోళాల్ని
కంప్రెస్ చేసి
దూరంగా వేళ్లాడదీసిన
చూడలేని కళ్లవైపు
మడమలు వెనక్కి త్రిప్పి
పరుగెడుతున్నానని అనుకుంటూ
నడుస్తున్నాను
ప్రబల నిశీరాగ ప్రళయోదధీతాడిమృగ్యఛనీ
మాత్రంబునై ధరాదోముఖుంఢనై
రాగినై నడుస్తున్నాను
శిశిరామోదిత క్షయాన్నై
ఉగాది కోకిల రవాల వైపు

04/04/2019 - 19:36

హనుమ:
అమ్మా! నీవిటనుంటివె? నే గానకనుంటిని!
నీ బిడ్డను చూడకుండ నీ వెట్టుల నుంటివి!

అనుచునతడు సత్యభామ పదములపై బడెను
పిల్లడేడ్చినటులాతడు గొల్లుమంచు నేడ్చెను

తల్లి ఏడ్చె, పిల్లడేడ్చె- ఏడ్చినారు ఎల్లరు
రిక్కలె కన్నీళ్ళు నింపి వెక్కివెక్కి ఏడ్చెను

తల్లిని మరచిన వాడొక తనయుండెటులగును?
తనయుని మరచిన తల్లియు తల్లియెట్టులగును

Pages