S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
06/26/2016 - 21:42

స్పెయిన్‌లో జరుగుతున్న 17వ ఐఫా చిత్రోత్సవంలో ఏకంగా 13 అవార్డులతో ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమచిత్రంగా ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఎంపిక కాగా బాజీరావ్ మస్తానీ చిత్రానికి దర్శకత్వం వహించిన సంజయ్‌లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.

06/26/2016 - 21:32

అర్జున్ యజత్, వౌర్యాని ప్రధాన పాత్రల్లో పత్తికొండ సినిమాస్ పతాకంపై భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో రవికుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘అర్ధనారి’. దీని ట్రైలర్‌ను శనివారం హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘్భనుశంకర్ గతంలో చాలా పాత్రలు చేసినా ప్రతిభకు తగిన సినిమా పడలేదు.

06/26/2016 - 21:30

శ్రీ చైత్ర చలనచిత్ర పతాకంపై ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా వాణి ఎం.కొసరాజు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మరల తెలుపనా ప్రియా. శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరిగింది. రమేష్‌ప్రసాద్ సినిమా బ్యానర్ లోగోను విడుదల చేయగా హీరో నిఖిల్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..

06/26/2016 - 21:27

ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ మోడరన్ సినిమా పతాకంపై రూపొందించిన చిత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్. విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల సీడీని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక నిర్మాతలు ఆదిత్య ఓం, విజయ్‌వర్మ సంయుక్తంగా సీడీని విడుదల చేశారు.

06/26/2016 - 21:22

గోపీనాథ్, విష్ణుప్రియ జంటగా బి.ఆర్.ఎస్.ఐ పతాకంపై రూపొందించిన చిత్రం 21 సెంచరీ లవ్. పోల్కంపల్లి నరేందర్ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

06/26/2016 - 21:20

భీమవరం టాకీస్ పతాకంపై మనీష్ ఆర్య, ప్రియాంకరావ్ జంటగా సుమంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శివగామి. తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటల సీడీ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి ఆడియో సీడీని విడుదల చేసి సి.కళ్యాణ్, ఓం.సాయిప్రకాష్‌లకు అందించారు.

06/26/2016 - 21:18

నాగశౌర్య, పారుల్‌గులాటి జంటగా శ్రీ సత్య విదుర మూవీస్ పతాకంపై లారెన్స్ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ చిర్రా రూపొందించిన చిత్రం నీ జతలేక. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరిగింది. ఎన్.శంకర్ ఆడియో విడుదల చేసి తొలి కాపీని సి.కళ్యాణ్‌కు అందించారు.

06/25/2016 - 21:21

‘నటుడు సునీల్ మంచి డ్యాన్సర్. తన సినిమా ఆడియో వేడుకకు రమ్మంటే కాదనలేక షూటింగ్ పోస్ట్‌పోన్ చేసుకుని ఇక్కడికి వచ్చా. ఒక అభిమాని అభివృద్ధిలోకి వస్తున్నాడంటే మొదటిగా సంతోషించేది నేనే. సునీల్‌ను చూస్తుంటే చాలా ఆనందంగా వుంటుంది..’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

06/25/2016 - 21:19

నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ప్రధాన తారాగణంగా సితార సినిమా పతాకంపై చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు సాగుతున్నాయి.

06/25/2016 - 21:16

గ్లామర్ హీరోయిన్ నయనతారకు ఈమధ్య కోలీవుడ్‌లో క్రేజ్ ఎక్కువైంది. ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ ఇతర భాషల్లో చేయడానికి డేట్స్ లేనంతగా బిజీగా మారింది. మరోవైపు సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె ఓ సినిమాలో లిప్‌లాక్‌కోసం అదనంగా డిమాండ్ చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చకు దారితీసింది.

Pages