S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/08/2018 - 02:22

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘ కరుణానిధి గొప్ప ప్రజానాయకుడు, ప్రాంతీయంగా ప్రజల ఆకాంక్షల సాకారానికి పోరాడూతూ దేశ ప్రయోజనాలకు నిలబడిన జాతీ య నాయకుడు అని’ మోదీ నివాళులర్పించారు.

08/08/2018 - 02:07

న్యూడిల్లీ, ఆగస్టు 7: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్న దొంగనోట్లను నిలువరించేందుకు ప్రభుత్వం నోట్ల రద్దును చేపట్టిన అనంతరం గుజరాత్ రాష్ట్రంలో అధిక మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడింది.

08/08/2018 - 00:33

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆర్థిక రంగంలో ఘోరంగా విఫలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో అవినీతి, సామాజిక విభజన విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత మంగళవారం మొదటి సారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించారు.

08/08/2018 - 01:57

చెన్నై, ఆగస్టు 7: భారతదేశ రాజకీయాల్లో హిమశిఖర సమానుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత, ద్రవిడ సింహం ఎం. కరుణానిధి అస్తమించారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆయన ఇక్కడ కావేరీ ఆసుపత్రిలో వయోభారం, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు.

08/07/2018 - 23:58

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఏపీ శాఖ మంగళవారం పార్లమెంట్ స్ట్రీట్‌లో ఆందోళన నిర్వహించింది. ఏపీకి న్యాయం చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు.

08/07/2018 - 13:48

తిరువనంతపురం: కేరళలోని మునంబాం వద్ద ఓడ, బోటు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మత్స్యకారులు చనిపోయారు. ప్రమాద సమయంలో బోటులో 15మంది ప్రయాణీకులు ఉన్నారు. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

08/07/2018 - 13:45

న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఎంపీ శివప్రసాద్ అంధుడి వేషధారణలో వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు.

08/07/2018 - 13:44

న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు మంగళవారంనాడు ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిశారు. కాగా విశాఖకు రైల్వేజోన్ తప్పక వస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పినట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మంత్రి సుజయ కృష్ణ రంగారావు కూడా వీరితో పాటు ఢిల్లీవెళ్లి కేంద్రమంత్రులను కలిశారు.

08/07/2018 - 13:52

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ముష్కరులు చొరబాటుకు యత్నించారు. గూరజ్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద దాదాపు ఎనిమిది మంది ముష్కరులు కాశ్మీర్‌లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు సైనికాధికారులు వెల్లడించారు.

08/07/2018 - 12:52

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్‌లోని చౌదర్‌పూర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆనంద్‌పాళ్ కుమార్తె తార పోషకాహార లోపంతో బాధపడుతుంది. దంపతులిద్దరూ వ్యాధి నయం కోసం మంత్రగాడ్ని సంప్రదించారు. పిల్లను చంపి పూడ్చిపెడితే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని చెప్పటంతో ఆ మాటలు నమ్మిన దంపతులు తారను గొంతునులిమి చంపి ఇంట్లో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు.

Pages