S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/07/2018 - 12:32

హైదరాబాద్ : బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ (బిట్స్) లో ఫీజుల పెంపునకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్,2018-19 విద్యాసంవత్సరంలో ఫీజులను రెట్టింపు చేయడంపై పిలానీ, గోవా క్యాంపస్ లలో బిట్స్ విద్యార్థులు నిరసన తెలిపారు. బిట్స్ క్యాంపస్ లో పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండు చేశారు.

05/07/2018 - 12:30

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం సోమవారం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైంది. చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయగా... అనంతరం పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ నిర్వహిస్తున్న వి.నారాయణస్వామి ప్రసంగించారు.

05/07/2018 - 12:26

న్యూఢిల్లీ: సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ పేర్కొన్నది. కనీసం 13 రాష్ర్టాలకు, రెండు కేంద్ర పాలితప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను, భారీ వర్షాల గండం పొంచి ఉన్నదని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీచేసింది.

05/07/2018 - 05:26

న్యూఢిల్లీ, మే 6: ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం కలిగివున్న నగరంలో ఒకటిగా పేరొందిన దేశ రాజధాని ఢిల్లీ ఇప్పడు మరో అపవాదును ముటగట్టుకుంది. దేశంలోనే అత్యధికంగా లైంగిక దాడులు నమోదైన నగరంగా ఢిల్లీ అపఖ్యాతి దక్కించుకొంది. ఈ ఏడాదిలో గత మూడు నెలల్లో ప్రతిరోజూ ఐదుగురు మహిళలు లైంగిక దాడులకు గురయ్యారని ఢిల్లీ పోలీసుల దగ్గర నమోదైన గుణంకాలను బట్టి తెలుస్తోంది.

05/07/2018 - 05:24

చెన్నై, మే 6: కొడుకుని నీట్ పరీక్షకు పక్క రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తమిళనాడులోని తిరువూర్ జిల్లాకు చెందిన వీలన్‌గుడి గ్రామానికి చెందిన కృష్ణస్వామి తన కుమారుడిని నీట్ పరీక్ష రాయించడానికి కేరళలోని ఎర్నాకులానికి ఆదివారం తీసుకువచ్చాడు. కుమారుడిని పరీక్ష కేంద్రం వద్ద వదిలి వచ్చిన కృష్ణస్వామి లాడ్జికి వచ్చాడు.

05/07/2018 - 02:46

న్యూఢిల్లీ, మే 6: మేజర్లయిన స్ర్తి పురుషులకు వివాహం లేకుండానే కలిసి జీవించే హక్కు ఉన్నదని సుప్రీం కోర్టు పేర్కొంది. వివాహం రద్దయిన కేరళకు చెందిన 20 ఏళ్ల మహిళ తాను ఎవరితో కలిసి జీవించాలో నిర్ణయించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. సంబంధాలను సజీవంగా కొనసాగించడాన్ని చట్టం గుర్తిస్తుందని పేర్కొంది. మహిళల గృహహింస రక్షణ చట్టం-2005లో దీనికి సంబంధించిన నిబంధనలున్నాయన్నది.

05/07/2018 - 02:41

భోపాల్, మే 6: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా భక్తిబాట పట్టారు. వచ్చే ఎడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, ఇప్పటినుంచే ప్రచారాలు మొదలుపెట్టిన రాష్టన్రేతలు గుళ్లు, గోపురాలను సందర్శించడం ద్వారా ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న భక్తి సెంటిమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం పని చేయదని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.

05/07/2018 - 03:46

చిత్రదుర్గం (కర్నాటక), మే 6: చరిత్రను వక్రీకరించి సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే సుల్తానుల జయంతులు నిర్వహిస్తూ, ప్రజలు పదికాలాలు గుర్తుంచుకునే వీరులను విస్మరించి అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

05/07/2018 - 02:37

న్యూఢిల్లీ, మే 6: ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ‘దళిత వ్యతిరేకులు’ అంటూ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఫాసిస్టు సిద్ధాంతాలను పుణికి తెచ్చుకున్న వీరు, దళితులు సమాజంలో అట్టడుగునే ఉండిపోవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నేతలు గతంలో చేసిన దళిత వ్యతిరేక ప్రకటనలకు సంబంధించిన వీడీయోలను కూడా ఆయన బయటపెట్టారు.

05/07/2018 - 03:49

న్యూఢిల్లీ/ కాబూల్, మే 6: ఆఫ్గనిస్తాన్ విద్యుత్ కంపెనీలో పనిచేస్తున్న ఏడుగురు ఉద్యోగులను కొందరు సాయుధులు అపహరించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. వీరిలో ఆరుగురు భారతీయులు. బాగ్లాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆఫ్గాన్ అధికార్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

Pages