S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/08/2018 - 13:18

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సమీపంలోని చెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఓ నెమలికి ఢిల్లీ పోలీసులు త్రివర్ణ పతకం కప్పి అంత్యక్రియలు నిర్వహించారు. ఈవిధంగా అంత్యక్రియలు నిర్వహించటం వణ్యప్రాణి చట్టం కింద విరుద్దమని వణ్యప్రాణి కార్యకర్తలు అంటున్నారు.

05/08/2018 - 13:16

న్యూఢిల్లీ: ప్రజల దృష్టిని ఆకర్షించటానికి మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆప్‌నేత అశుతోష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులు ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు బేగంపూర్ ఎస్‌హెచ్‌ఓలో పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

05/08/2018 - 13:15

ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర అభిశంసన తీర్మానంపై కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు నిన్న కోర్టుకు వెళ్లిన విషయం విదితమే. నేడు ఈ పిటిషన్‌పై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. నలభై ఐదు నిమిషాల విచారణ అనంతరం ఈ పిటిషన్లను కాంగ్రెస్ ఎంపీలు వెనక్కి తీసుకున్నారు. దీంతో ధర్మాసనం వీటిని కొట్టేసింది.

05/08/2018 - 13:14

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా తూర్పు, ఉత్తర భారత రాష్ట్రాలలో ప్రకృతి విలయానికి ప్రజలు అల్లాడుతున్నారు. 13రాష్ట్రాల్లోనూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే గత రాత్రి నుంచి ఢిల్లీని దుమ్ము తుపాను వణికిస్తోంది. దుమ్మూ,దూళి నిండిపోవటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

05/08/2018 - 03:49

హోస్‌కోట్/మాలూరు, మే 7: కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యోక్తులతో ధ్వజమెత్తుతున్న ప్రధాని నరేంద్రమోదీపై ఆపార్టీ అధినేత రాహుల్ గాంధీ మెరుపులు, చెళుకులతో కూడిన విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం ఇక్కడ ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్ వర్క్‌మోడ్‌లేని మొబైల్‌ఫోన్‌గా ప్రధాని మోదీని అభివర్ణించారు. మాట్లాడేందుకు ఇతర అంశాలు ఏమీ లేవుకాబట్టే ప్రధాని తమపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.

05/08/2018 - 05:19

బెంగళూరు, మే 7: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. పోలింగ్ తేదీ ఐదు రోజులే ఉండడంతో నేతల విమర్శలకు పదునుపెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం సైకిల్ ర్యాలీ చేసి కార్యకర్తలనే ఆశ్చర్యపరిచారు. 9వ విడత ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ఉదయం రాహుల్ మలూర్ చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలసి కోలార్‌లో రోడ్‌షోకు బయలుదేరిన రాహుల్ ఆకస్మాత్తుగా బస్ దిగిపోయి సైకిల్ ఎక్కారు.

05/07/2018 - 17:08

బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారంనాడు కోలార్ జిల్లాలో బస్సు షో నిర్వహించారు. న్యూఢిల్లీ నుంచి ఉదయమే మలూర్ చేరుకున్న ఆయన వేలాది మంది కార్యకర్తలు వెంటరాగా బస్సులో ప్రయాణిస్తూ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ అకస్మాత్తుగా బస్సు దిగి సైకిల్ నడుపుతూ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు పరుగులు తేశారు.

05/07/2018 - 17:06

బెంగళూరు: మోదీ అనుసరిస్తున్న హేతుబద్దతలేని విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారంనాడు కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రైతు సమస్యలు, ఉద్యోగాల సంక్షోభం, ఆర్థిక మందగమనం తదితర సమస్యలకు ఈ విధానాలే కారణమని అన్నారు.

05/07/2018 - 13:47

లక్నో: మాజీ సీఎంలకు ప్రభుత్వ బంగ్లాలు కేటాయించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో మాజీ సీఎంలకు ప్రభుత్వ బంగ్లాలు కేటాయిస్తూ యూపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీనిపై ఎన్జీఓ లోక్‌ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై తీర్పునిస్తూ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. మాజీ సీఎంలకు ప్రభుత్వ వసతిని కొనసాగిస్తూ యూపీ ప్రభుత్వం చేసిన సవరణను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

05/07/2018 - 13:42

బెంగళూరు: తనపై బీజేపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతుందని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. ఆయన గుజరాత్ ఎమ్మెల్యే జజ్ఞేష్ మేవానితో కలిసి కర్నాటకలోని హుబ్జాలిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు తనను వెంటాడుతున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులు తనను చంపేస్తారేమోనని భయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తాను చేస్తుంది న్యాయం అని ఈ సందర్భంలో ఎన్ని ఆపదలనైనా ఎదుర్కొంటామని అన్నారు.

Pages