S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/29/2016 - 03:15

ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు ఓ పిల్లవాడు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. తండ్రి చనిపోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సాధించుకునేందుకు అధికారి లంచం అడగటంతో ఆ పిల్లవాడు సదరు లంచం మొత్తాన్ని సంపాదించేందుకు బిచ్చం ఎత్తుకోవలసి వచ్చింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కున్నత్తూర్‌లో అజిత్ అనే పదిహేనేళ్ల పిల్లవాడి తండ్రి నిరుడు చనిపోయాడు.

08/29/2016 - 03:13

కన్నబిడ్డను కాపాడుకోడానికి తన ప్రాణాలనే త్యాగం చేసి పేగు బంధానికి నిర్వచనం చెప్పింది ఓ అమ్మ.. ఏ దేశంలోనైనా, ఏ ఖండంలోనైనా మాతృప్రేమ ఒకేలా వుంటుంది. అమెరికాలో సరదాగా ఓ కుటుంబ బోట్లో షికారు చేస్తుండగా, రెండేళ్ల బాలుడు అకస్మాత్తుగా నీళ్లలో పడిపోయాడు. అది గమనించిన ఆ బాలుడి తల్లి చెల్సీ రస్సెస్ (35) ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి పిల్లాడిని పైకితీసి బోటులోని వారికి అందించి తాను మునిగిపోయింది.

08/29/2016 - 03:11

ఉత్తరభారతాన్ని అల్లాడిస్తున్న వరదలు యూపి, బీహార్‌లలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వారణాసిలో అంతిమసంస్కారం జరిపే పవిత్రమైన మణికర్ణిక ఘాట్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. దీంతో దానికి సమీపంలో ఉన్న ఓ చిన్న దేవాలయం ఉపరిభాగంపైనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

08/29/2016 - 03:10

న్యూఢిల్లీ, ఆగస్టు 28: వివాదాలతో అట్టుడికిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల నిర్వహణకు తొలిసారి ఒక మహిళ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. జెఎన్‌యుఎస్‌యు నిర్వహించిన సమావేశంలో సిఇసిగా స్కూల్ ఆఫ్ సోషల్ సైనె్సస్ ఎస్‌ఎస్‌ఎస్‌కు చెందిన పిహెచ్‌డి ప్రథమ సంవత్సర విద్యార్థిని ఇషితా మనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాజీ సిఇసి దిలీప్ వౌర్య తెలిపారు.

08/29/2016 - 03:09

న్యూఢిల్లీ, ఆగస్టు 28: హింసను వ్యతిరేకించే, శాంతి పునరుద్ధరణకు తోడ్పడే ఎవరితోనైనా చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీ చెప్పారు. వేర్పాటువాదులు గనుక శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లయితే వారితో కూడా చర్చలు జరపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ఆమె అన్నారు.

08/29/2016 - 03:07

శ్రీనగర్, ఆగస్టు 28: కాశ్మీర్‌లో గత నెల భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ తండ్రి బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌ను కలిసి జమ్మూ, కాశ్మీర్‌లో పరిస్థితిపై ఆయనతో చర్చించారు.

08/29/2016 - 02:57

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశంలో వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటోనుంచి అమలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆతృత పడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు వీలుగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను 15 రోజులు ముందుగా ప్రారంభించాలని భావిస్తోంది.

08/29/2016 - 02:56

న్యూఢిల్లీ, ఆగస్టు 28: పాక్ ఆక్రమిత కాశ్మీరు (పిఓకె) నుంచి తరలివచ్చి జమ్మూ-కాశ్మీరులోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

08/29/2016 - 02:55

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి)కు క్రీమిలేయర్ ప్రాతిపదికకు సంవత్సరాదాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ. ఆరు లక్షల నుంచి రూ. ఎనిమిది లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒబిసిలకు కేటాయించిన అనేక ప్రభుత్వ ఉద్యోగాలు అభ్యర్థులు దొరకక ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయడానికి క్రీమీలేయర్ పరిధిని సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సాలీనా రూ.

08/29/2016 - 02:54

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్టప్ ఇండియా/ స్టాండప్ ఇండియాలాంటి పథకాలను అమలు చేయడంలో అద్భుతంగా కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించనున్నారు.

Pages