S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/26/2016 - 03:37

న్యూఢిల్లీ, మార్చి 25: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభంతో తనకెలాంటి సంబంధం లేదని యోగా గురు రాందేవ్ బాబా శుక్రవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో తమపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిరస్కరించారు. తానేం చేసినా, మాట్లాడినా అందులో దాపరికం ఉండదని, అయినా రాజకీయాలు తన ఆశయం కాదని వెల్లడించారు.

03/26/2016 - 03:35

శ్రీనగర్, మార్చి 25: జమ్మూకాశ్మీర్‌లోని సియాచిన్ సెక్టార్‌లో భారీగా కురుస్తున్న హిమపాతం వల్ల శుక్రవారం పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఒక జవాను మృతి చెందాడు. మరో జవాను గల్లంతయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ్భూమి టుర్‌టుక్ ప్రాంతానికి పెట్రోలింగ్ పార్టీ చేరుకోగానే ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో తీవ్ర స్థాయి లో మంచు కురిసింది.

03/26/2016 - 03:34

న్యూఢిల్లీ, మార్చి 25: పోలవరం ప్రాజక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలలోని పిల్లలకు కూడా నష్టపరిహారం చెల్లించే విషయాన్ని పరిశీలించేందుకు కేంద్ర జలవనరుల శాఖ అధికారుల బృందాన్ని పంపించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూవనరుల శాఖ కార్యదర్శి విజయ్ ఎస్.మదన్ తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డికి రాసిన సమాధాన లేఖలో ఈ విషయం వెల్లడించారు.

03/26/2016 - 03:30

చెన్నై, మార్చి 25: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేసే ప్రక్రియకు డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు శుక్రవారం శ్రీకారం చుట్టాయి. డిఎంకె అధ్యక్షుడు కరుణానిధితో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఇందులో భాగంగా చర్చలు జరిపారు.

03/26/2016 - 03:25

న్యూఢిల్లీ, మార్చి 25: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టు చేసిన భారతీయుడు వాస్తవానికి నౌకాదళానికి చెందిన మాజీ అధికారి అని, ప్రభుత్వంతో అతనికి ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది.

03/26/2016 - 01:08

జమ్ము, మార్చి 25: కాశ్మీర్‌లో రెండు నెలల రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విభేదాలను పక్కన పెట్టి పిడిపి, బిజెపిలు మళ్లీ చేతులు కలిపాయి. శనివారం గవర్నర్ ఎన్‌ఎన్ వోరాను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని ఇరు పార్టీలు శుక్రవారం నిర్ణయించుకున్నాయి. 58ఏళ్ల పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కొత్త సర్కార్ ఏర్పడబోతోంది.

03/26/2016 - 03:00

న్యూఢిల్లీ, మార్చి 25: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈనెల 22న జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ పరిస్థితులపై కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శికి, తెలంగాణ ప్రధాన కార్యదర్శికి, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తు నోటీసులు జారీచేసింది.

03/26/2016 - 02:51

ముంబయి, మార్చి 25: ముంబయిలో 2008లో ఉగ్రవాద దాడులు జరిగిన కొద్ది వారాల తర్వాత తన తండ్రి మృతికి సంతాపం తెలియజేయడానికి అప్పటి పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ తన ఇంటికి వచ్చినట్లు పాకిస్తానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ వెల్లడించారు. కాగా, 1971 భారత్-పాక్ యుద్ధం సమయంలో తాను చదువుతున్న స్కూలుపై బాంబు దాడి జరిగినప్పటినుంచి తాను భారత్‌పై ద్వేషం పెంచుకున్నానని కూడా హెడ్లీ చెప్పారు.

03/25/2016 - 12:44

లక్నో: హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం సేవించి వాహనాలను నడపడంతో రోడ్డు ప్రమాదాల్లో 14 మంది, రంగులు పూసుకునే విషయంలో కొట్లాటలు జరిగి పదిమంది మరణించారని అధికారులు ప్రకటించారు. హోలీని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు ముందుగా హెచ్చరించినప్పటికీ ఈ ఏడాది విషాదకర సంఘటనలు తప్పలేదు.

03/25/2016 - 03:41

న్యూఢిల్లీ, మార్చి 24: రంగుల పండుగ హోలీని దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వయోభేదాన్ని మరిచి ప్రతి ఒక్కరూ రంగుల్లో మునిగి తేలారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల దాకా ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఉదయంనుంచే వీధుల్లోకి వచ్చిన యువతీ యువకులు, పిల్లలు రంగు లు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి రంగులు చల్లి పండుగను ఆసాంతం ఆస్వాదించారు.

Pages