S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2016 - 07:01

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు జెడి శీలం ఆరో పించారు. శీలం శుక్రవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం గురించి వాదించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభు త్వం ఆదుకోవటం లేదని ఆయన దుయ్యబట్టారు.

03/05/2016 - 07:01

గువహటి: ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. లోక్‌సభలో గురువారం ప్రధాని చేసిన ప్రసంగం ఆయన హో దాను దిగజార్చేదిగా ఉందని రాహుల్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో దేశ ప్రజలకు మోదీ శుష్కవాగ్దానాలు చేశారని గువహటి సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విరుచుకుపడ్డారు.

03/05/2016 - 07:05

న్యూఢిల్లీ: మాజీ స్పీకర్, లోక్‌సభ సభ్యుడు పిఏ సంగ్మా(68) మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలూ శుక్రవారం వాయిదా పడ్డాయి. ఎలాం టి కార్యక్రమం చేపట్టకుండానే వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభ మాజీ స్పీకర్ సంగ్మా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందా రు.

03/05/2016 - 06:59

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలనుంచి తొలిసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయిన పిఏ సంగ్మా రాజకీయ జీవన ప్రస్థనమంతా కూడా ఎగుడు దిగుడుల మయమే.

03/05/2016 - 04:20

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పాండిచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైది శుక్రవారం మీడియా సమావేశంలో షెడ్యూలు ప్రకటించారు. పోలింగ్ మొత్తం ఏప్రిల్ 6 నుంచి మే 16వరకు ఏడు దశల్లో నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికలు మొదటి రెండు దశల్లో ఏప్రిల్ 4, 11 తేదీల్లో జరుగుతాయి.

03/05/2016 - 04:17

న్యూఢిల్లీ: షహీద్, ఉప్‌కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కప్‌డా ఔర్ మకాన్, క్రాంతి వంటి దేశభక్తి ఇతివృత్తంతో కూడిన ఎన్నో చిత్రాలను నిర్మించి, నటించి మిస్టర్ భరత్‌గా ఖ్యాతిగాంచిన ఒకప్పటి బాలీవుడ్ అగ్రనటుడు మనోజ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక దాదాఫాల్కే అవార్డు లభించింది. భారతీయ సినిమాకు చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా ఈ సమున్నత అవార్డుకు ఆయన్ని భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.

03/05/2016 - 04:15

న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా హఠాన్మరణం చెందారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవి నిర్వహించిన 68 ఏళ్ల సంగ్మా శుక్రవారం ఉదయం ఇక్కడ గుండెపోటుతో మృతి చెందారు. మేఘాలయలోని తుర నియోజకవర్గం నుంచి ఆయన తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత 16వ లోక్‌సభలో సభ్యుడైన సంగ్మా ఆకస్మిక మృతి వార్తను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం సభకు తెలియజేశారు.

03/05/2016 - 04:13

న్యూఢిల్లీ: సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు చెందిన హెస్టియా హోల్డింగ్స్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మారిషస్ బ్యాంకునుంచి సుజనా గ్రూప్ హామీదారుగా ఉన్న హెస్టియా సంస్థకు తీసుకున్న రూ.106 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని, లేదంటే ఆస్తులు జప్తు చేసుకునే అధికారం ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

03/04/2016 - 16:08

దిల్లీ: తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అయిదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో సుమారు 17 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

03/04/2016 - 13:01

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని సుకుమా అటవీ ప్రాంతంలో శుక్రవారం వేకువజామున కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మావోలు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా, 14 మంది గాయపడ్డారని తెలిసింది. జవాన్లు, మావోల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

Pages