S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైజాగ్ టు అకోలా

బోధన్, ఆగస్టు 4:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం కేంద్రంగా మహారాష్టల్రోని అకోలాకు పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతోంది. ఐదుగురు సభ్యులు గల ముఠా సభ్యులు ఈ గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ గంజాయి రవాణాకు కామారెడ్డి డివిజన్‌లోని ఇద్దరు వ్యక్తులు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తూ గంజాయిని మహారాష్టక్రు తరలిస్తున్నారు. హైటెక్ పద్ధతిలో సాగుతున్న గంజాయి రవాణాకు బోధన్ పోలీసులు ఎట్టకేలకు కళ్లెం వేశారు. బోధన్ సబ్‌డివిజన్‌లోని వర్ని మండలం బడాపహాడ్ వద్ద గతంలో పోలీసులకు గంజాయి రవాణా చేస్తూ విజయలక్ష్మి పట్టుబడగా రూరల్ పోలీసులు ఆమె పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రభుత్వ అవినీతికి చెంపపెట్టు.. ‘మల్లన్నసాగర్’!

వడ్డేపల్లి, ఆగస్టు 4: హైకోర్టు తీర్పును గౌరవించి జీవో నెంబర్ 123ను రద్దుచేసి, 2013 భూ సేకరణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని తెలుగు దేశం పార్టీ శాసనసభ ఉపనేత సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని, బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తెరాస ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్వర్యంలో తెదేపా శ్రేణులు పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

సామాజిక న్యాయాన్ని విస్మరిస్తున్న కెసిఆర్

నక్కలగుట్ట, ఆగస్టు 4: కెసిఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఉల్లఘించే ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ శాసన సభ ఉపనేత సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం బాలసముద్రంలోని జిల్లాపార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలైన బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్ కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది.

మల్లన్నసాగర్‌పై సిఎంకు వ్యామోహం ఎందుకు?

వరంగల్, ఆగస్టు 4: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మల్లన్నసాగర్‌పై ఎందుకంత వ్యామోహమని కేంద్ర జాతీయ విపత్తుల మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ డిసిసి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్‌లో రిజర్వాయర్ లేకుండా ప్రాజెక్టు నిర్మించలేరా? అని ఆయన ప్రశ్నించారు. రిజర్వాయర్ కోసం ప్రత్యేకంగా 123 జిఓ తీసుకవచ్చి భూసేకరణ చేయాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు చెంపపెట్టు పెట్టడం హర్షనీయమన్నారు.

కొనసాగుతున్న పుణ్య స్నానాలు

మంగపేట, ఆగస్టు 4: వరంగల్ జిల్లాలోని మంగపేట పుష్కరఘాట్ వద్ద అంత్య పుష్కరాలలో ఐదవ రోజైన గురువారం అనేక మంది భక్తులు, సందర్శకులు పుష్కర స్నానాలు ఆచరించారు. జిల్లా కేంద్రంతో పాటు అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి పుష్కర స్నానాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. మంగపేట పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం మండల కేంద్రంలోని శివాలయంకు వెళ్ళి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రాజెక్టుల కింద సేకరించిన భూముల్లో హరితహారం

నరుూంనగర్, ఆగస్టు 4: దేవాదుల ఎత్తిపోతల పథకం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కింద సేకరించిన భూములలో కూడా హరితహారం కింద బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలని, అందుకు గాను ఆ ప్రాంతాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దేవాదుల ఎస్సారెస్పీ ఇంజనీర్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు.

నాణ్యమైన విద్య.. ప్రభుత్వ లక్ష్యం

వరంగల్, ఆగస్టు 4: ఉత్తమ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం వరంగల్ నగర శివారులోని మడికొండలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు పాపారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేశామని, దాని ఫలితంగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు.

గోదావరి గలగలలు

ఏటూరునాగారం, ఆగస్టు 4: మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 6.12మీ చేరిన గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మండలంలో కురుస్తున్న వర్షాలతో మండలంలోని రాంనగర్ లోలెవల్ వంతెన వద్ద జీడివాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెన ధ్వంసమై రాంనగర్, లంబాడితండా, కోయగూడ ఎల్లాపూర్ గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రాంనగర్ లోలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పోలవరం అనుమతులకు త్వరలో లైన్‌క్లియర్

హైదరాబాద్, ఆగస్టు 4: కేంద్ర అటవీ శాఖ నుండి త్వరితగతిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు రానున్నాయని రాష్ట్ర అటవీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చెప్పారు. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి అనిల్ మాధవ్ దవేతో సమావేశమైన గోపాల కృష్ణారెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు. ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి సంబంధించి రాష్ట్రానికి రావల్సిన నిధులను సత్వరం విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు.

దగాపడ్డ కులాలకు న్యాయం

విజయవాడ, ఆగస్టు 4:దగాపడిన కులాలకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రజ క, నారుూ బ్రాహ్మణ, వడ్డెర, కుమ్మరి/శాలివాహన, సగర, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ల చైర్మన్లు, డైరక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారిని పైకి తీసుకురావడానికి బీజం వేసింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని అన్నారు. వెనుకబడిన తరగతులకు 8,840 కోట్లతో సబ్‌ప్లాన్ తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమని చెప్పారు.

Pages