S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివర్ణ తోరణాలు తొలగించారు

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 4: కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకం, త్రివర్ణ తోరణాలను గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పనికి రాని మరుగుదొడ్డిలో పడేసి జాతి ప్రతిష్టను అవమాన పర్చడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న ‘ఆంధ్రభూమి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘త్రివర్ణ తోరణంపై ఇదేనా గౌరవం..? అనే కథనానికి సిరిసిల్ల ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ స్పందించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి మరుగుదొడ్డిలో పడేసిన జాతీయ పతాకంతో పాటు మూడు రంగుల తోరణాలను తొలగించాలని ఎమ్పిడీవో చిరంజీవిని ఆదేశించారు.

మోత్కూరులో చేనేత క్లస్టర్

న్యూఢిల్లీ, ఆగస్టు 4: నల్గొండ జిల్లా మోత్కూరులో ఇకత్ చేనేత క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా టిఆర్‌ఎస్ ఎంపి బూర నరసయ్య గౌడ్‌కు రాసిన లేఖలో తెలిపారు. మోత్కూరులో ఒక కోటీ 73 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఇకత్ చేనేత క్లస్టర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తమ వంతు కింద 143.38 లక్షల రూపాయలు ఇస్తుందని మిశ్రా తమ లేఖలో పేర్కొన్నారు. సంప్రదాయ పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన స్ఫూర్తి పథకం కింద ఈ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన నరసయ్యగౌడ్‌కు రాసిన లేఖలో వివరించారు.

దోపిడీ దొంగల హల్‌చల్

వినాయక్‌నగర్, ఆగస్టు 4: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడేందుకు మహారాష్టక్రు చెందిన దొంగల ముఠా విఫలయత్నం చేసింది. బుధవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో నాల్గవటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ట్రాన్స్‌కో ఎ.ఇ శ్రీహరి ఇంటికి నలుగురు సభ్యులు గల దొంగలు చేరుకున్నారు. శ్రీహరి అమెరికా పర్యటనలో ఉండగా, ఆయన కుటుంబీకులు ఇంట్లో ఉంటున్నారు. అక్కడికి చేరుకున్న దొంగలు శ్రీహరి ఇంటి కిటికీల ఊచలను తొలగించి లోనికి చొరబడేందుకు సిద్ధమయ్యారు.

ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీజి బృందం

గజ్వేల్, ఆగస్టు 4: ప్రధాని నరేంద్రమోదీ మెదక్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీజి బృందం గురువారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించింది. ప్రధాని గజ్వేల్ మండలం కోమటిబండలో మిషన్ భగీరథతోపాటు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఈనెల 7న వస్తున్న సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డిఐజి నేతృత్వంలో అధికారుల బృందం గురువారం ఏర్పాట్లు పరిశీలించింది. ఈ సందర్భంగా డిఐజిలు నాగిరెడ్డి, అకుల్‌సబర్వాల్, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌లకు భద్రతాపరమైన సూచనలు చేశారు. కోమటిబండ పరిసరాలలో తీసుకున్న భద్రతా చర్యలను వారు పోలీసు ఉన్నతాధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు.

ఒత్తిడి తెస్తా.. పరిహారం ఇప్పిస్తా...

మిర్యాలగూడ, ఆగస్టు 4: తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి టేల్‌పాండ్ భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించేందుకు కృషిచేస్తానని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి అన్నారు. టేల్‌పాండ్ భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం పునరావాసం కల్పించాలని కోరుతూ భూనిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు గురువారం మద్దతు తెలిపారు.

ఉపాధి హామీ ఉద్యోగులకూ 30 శాతం వేతనం పెంపు

హైదరాబాద్, ఆగస్టు 4: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిపి) కింద పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనంలో 30 శాతం పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గ్రామీణ పేదిరిక నిర్మూలన పథకం (సెర్ప్) కింద పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను 30 శాతం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు 20 శాతం వేతనం పెంచనున్నట్టు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి ప్రకటించారు.

క్యారీబ్యాగ్‌లో మృతపిండాలు!

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 4: భ్రూణహత్యలకు గురైన సుమారు ఐదు నెలల వయసు గల మూడు పిండాలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున దర్శనమిచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు క్యా రీబ్యాగ్‌లో గర్భస్రావం చేసిన ఈ పిండా లతో పాటు వైద్యులు, సిబ్బంది వాడిన గ్లౌజులు, ప్రిస్క్రిప్షన్ చీటీలు పడేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రీమియం అని ముద్రించిన ఆ క్యారీబ్యాగ్‌పై మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ ఎం. శే్వతారెడ్డి పేరిట వచ్చినదిగా పోలీసులు, వైద్యాధికారులు గుర్తించారు.

సొంత గూటికి దేవినేని నెహ్రూ!

విజయవాడ, ఆగస్టు 4: పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. పార్టీలో చీలిక అనంతరం ఎన్టీఆర్ తెలుగుదేశంలో కొంతకాలం కీలక పాత్ర వహించి ఆపై గడచిన 17ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలలో ముఖ్య పాత్ర వహిస్తూ వచ్చిన నెహ్రూ తెలుగుదేశంలో చేరాలనే నిర్ణయంపై కృష్ణా జిల్లాలో ప్రకంపనలు రేగుతున్నాయి. తెలుగుదేశంలోనున్న నెహ్రూ ప్రత్యర్థులలో ఆంతరంగిక సమావేశాలు, సమాలోచనలు ఎడతెగని విధంగా జరుగుతున్నాయి. నగరంలో బసచేసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును నెహ్రూ కల్సి ఏకాంతంగా సంభాషించడం ఒక్కసారిగా ఊహాగానాలకు తెరలేపాయి.

హోదా ఆంధ్రుల హక్కు

విజయవాడ, ఆగస్టు 4: ప్రత్యేక హోదా కోసం ఎవరినీ యాచించనవసరం లేదని, అది ఎపి ప్రజల హక్కు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ అజీజ్ పాషా, జల్లి విల్సన్, జి ఓబులేసు, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిలతో కల్సి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఎపిలో అందరూ ప్రత్యేక హోదాపై ఏం జరుగుతుందోనని ఢిల్లీవైపు చూస్తున్నారని నారాయణ అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటించగా, ఆనాటి ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడు 10 ఏళ్లు కావాలని డిమాండ్ చేశారన్నారు.

మున్సిపాలిటీల్లో భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్

తిరుపతి, ఆగస్టు 3: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సౌకర్యం అందజేయడానికి తమ కమిషన్ మున్సిపల్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర శాసనసభ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ కాగిత వెంకటరావు తెలిపారు. గురువారం పద్మావతి అతిథిగృహంలో టిటిడి ఇఓ సాంబశివరావు, ఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్ పుల్లారెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల ఎండి కె.రామ్‌గోపాల్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా అందించడంలో ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు.

Pages