S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

02/25/2020 - 00:09

మన దేశంలోని జీవ వైవిధ్య సంపద మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి మనసులోని మాట... జీవ వైవిధ్యం ప్రకృతి స్వరూపం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నిహితమై ఉండడం ప్రకృతి స్వభావం! స్వరూపం ఛిన్నాభిన్నం అవుతుండడం శతాబ్దుల వైపరీత్యం, ఫలితంగా ప్రకృతిలో నిహితమైఉన్న స్వభావ సమన్వయం కూడ నశించిపోతోంది! వృక్షజాలం, జంతుజాలం పరస్పరం పరిపోషకాలు కావడం ప్రకృతి సతత హరిత శోభలకు ప్రాతిపదిక!

02/22/2020 - 22:23

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో గత ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన జరిగిన ‘‘మోదీ కుశలమా?’’- హౌడీ మోడీ- అన్న సమావేశానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యాడు. సోమవారంనాడు మన గుజరాత్‌లోని కర్ణావతి- అహమ్మదాబాద్-లో జరుగనున్న ‘‘నమస్తే ట్రంప్’’ సమ్మేళనానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నాడు.

02/21/2020 - 00:47

అ క్షరాలు అజరామర
భావాలకు రూపాలు..
అక్షరాలు విశ్వవిహిత
నాద జనిత రాగాలు..
అక్షరాలు ఎద విరిసిన
అనుభూతుల పరిమళాలు..
‘అమ్మా’ అను పసిపాపల
పరిశోధక స్వరాలు!!

02/20/2020 - 00:28

వ్యవసాయ రంగం సస్య సమృద్ధం అవుతుండడం, స్వదేశీయ గోసంతతి అభివృద్ధికి పథకాలు రూపొందుతుండడం సమాంతర శుభ పరిణామాలు... నడుస్తున్న వ్యవసాయ సంవత్సరం- 2019, 2020-లో దేశంలో ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయట! ఇంత భారీ పరిమాణంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తికావడం ఇదే మొదటిసారి.

02/19/2020 - 00:15

వేణిన్ జొల్లెము వెట్టి
సంఘటిత నీవీబద్ధయై భూషణ
శ్రేణిన్ దాల్చి, ముఖేందు మండల
మరీచీ జాలమున్ పర్వగా
పాణిన్ పయ్యెద చక్క నొత్తి
నిజ ప్రాణేశాగ్ర భాగంబునన్
యేణీ లోచన లేచి నిల్చె...

02/18/2020 - 02:10

అంతర్జాతీయ దౌత్య నియమావళిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంతోనియో గుదరెస్ సైతం ఉల్లంఘించడం ‘అక్రమ ప్రమేయ’ చరిత్రలో వర్తమాన ఘట్టం. మన దేశపు అంతర్గత వ్యవహారాలలో ఇలా అంతర్జాతీయ అక్రమ ప్రమేయం పెరుగుతుండడానికి ప్రధాన కారణం మన దేశం ఇప్పటికీ ‘‘మెతక దేశం’’గా ముద్రపడి ఉండడం.

02/15/2020 - 23:41

ఎన్నికలలో పోటీచేసే తమ అభ్యర్థుల నేరప్రవర్తనకు సంబంధించిన వివరాలను విపులంగా ప్రచారం చేయాలని రాజకీయ పక్షాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం హర్షణీయం. ఈ ‘నేర ప్రవర్తన’ అభియోగాల సమగ్ర సమాచారాన్ని ఆయా రాజకీయ పక్షాలవారు స్థానిక, జాతీయ వార్తాపత్రికలలో ప్రచురింప చేయాలని, సామాజిక మాధ్యమాలలో నిక్షిప్తం చేయాలని సర్వోన్నత న్యాయమూర్తులు గురువారం ఆదేశించడం ‘అనైతిక ప్రవర్తన’పై మరో ‘పిడుగు’.

02/14/2020 - 03:33

సరిహద్దుల గోడ దాటు
బీభత్సం దూకువేళ,
కశ్మీర్ కంఠం చుట్టూ
ఉరి బిగించి ఉన్నవేళ..
నిగమాగమ స్వర విపంచి
‘నిప్పుల’రాగం పలికెను!
వరములిచ్చు కరములందు
శత‘శతఘ్ని’ చెలరేగెను..

02/13/2020 - 01:57

డొనాల్డ్ ట్రంప్ అన్న అమెరికా అధ్యక్షుడికి భారత్, చైనా పరస్పరం ఇరుగుపొరుగు దేశాలన్న భౌగోళిక వాస్తవం తెలియదట!- అన్నది భవిష్యత్తులో చరిత్ర విద్యార్థులు తెలుసుకోబోయే పాఠం... ఈనెల ఇరవై నాలుగవ తేదీ నుంచి రెండురోజులపాటు ఈ అమెరికా అధ్యక్షుడు మన దేశంలో జరుపుతున్న అధికార పర్యటనకు ఇలాంటి అనధికార వాస్తవాలెన్నో విచిత్ర నేపథ్య భూమికలు... డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఒక మహావిచిత్రం!

02/12/2020 - 01:18

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ‘మత ప్రదాత’- వోటర్-ల ‘సమాఖ్య నిష్ఠ’కు నిదర్శనాలు! ముఖ్యమంత్రి అరవింద కేజరీవాల్ నాయకత్వంలోని ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’కి మరోసారి ఘన విజయం సాధించి పెట్టడం ‘మత ప్రదాతలు’ ప్రదర్శించిన ఈ ‘సమాఖ్య నిష్ఠ’! కేంద్ర ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షానికీ ప్రాంతీయ ప్రభుత్వ నిర్వహణ బాధ్యతను కట్టపెట్టవలసిన అవసరం లేదన్నది ఈ ‘సమాఖ్య’- ఫెడరల్- స్ఫూర్తి!

Pages