S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

01/15/2019 - 01:29

మకర సంక్రాంతి ఖగోళంలో సంభవించే వెలుగుల విప్లవానికి ప్రతీక. ఈ వెలుగుల విప్లవం సూర్యుని చుట్టూ భూమి తిరగడంవల్ల ప్రతి సంవత్సరం నియతంగా ప్రస్ఫుటిస్తున్న పునరావృత్తి! సృష్టిగత వాస్తవాలు మానవ జీవన సంస్కృతిగా సమాజస్థితం కావడం అనాదిగా కొనసాగుతున్న హైందవ జాతీయ ప్రస్థానం. భారత ఖండపు భౌతిక సాంస్కృతిక పరిధికి ఆవల ఉన్న మానవులు చాలా ఆలస్యంగా గుర్తించిన ఈ వెలుగుల విప్లవం గురించి భారతీయులకు అనాదిగా తెలుసు.

01/11/2019 - 21:41

దినమంతా ఎగనేశాము, దీపం తేరా దిగనేద్దాము- అన్నది కేవలం సామెత కాదు. ఒకవైపున పగలంతా వస్త్రాన్ని నిర్మించడం మరోవైపున అదే బట్టను చింపి చీల్చి పోగులుగా విడగొట్టడం.. ఇలాంటి వైపరీత్యం స్వభావంలో, పనితీరులో నిహితమై ఉన్న వైరుధ్యాలకు నిదర్శనం. ‘ప్రపంచీకరణ’ విధానాలు ‘్భరతీయత’ను పరిమార్చుతుండడం నడుస్తున్న చరిత్ర.

01/11/2019 - 01:22

ప్రపంచీకరణ వైఫల్యానికి ఇది మరో సాక్ష్యం. ‘సరిహద్దులు’ చెఱగిపోయి ప్రపంచమంతా ఒకే ఆర్థిక సమాజంగా, వాణిజ్య కూటమిగా ఏర్పడడం ప్రపంచీకరణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశపు ‘సరిహద్దు’ను చరిత్రలో మొదటిసారిగా మూసివేస్తుండడం ఈ వాణిజ్య ప్రపంచీకరణ స్ఫూర్తికి విఘాతకరమైన విపరిణామం. తమ దేశానికీ మెక్సికో దేశానికీ మధ్య ఉన్న సరిహద్దులో ఉక్కు గోడను నిర్మించాలన్నది అమెరికా అధ్యక్షుని ప్రతిపాదన.

01/10/2019 - 01:33

పత్తి విత్తనాల అమ్మకాల వివాదం మరోసారి ప్రచారం అవుతోంది. ‘మొన్‌సాంటో’ అనే బహుళ జాతీయ వాణిజ్య సంస్థకూ, భారతీయ సంస్థలకూ మధ్య కొనసాగుతున్న ‘పరిజ్ఞాన ముద్ర’- పేటెంట్- వివాదానికి సంబంధించి మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఈ ప్రచారానికి నేపథ్యం. ఈ తీర్పు తమకు అనుకూలంగా ఉందని ‘మొన్‌సాంటో’ను నిర్వహిస్తున్న ‘బేయర్’ సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు.

01/09/2019 - 02:37

మానవత్వం కంటె రాజకీయం అధికతర ప్రాధాన్యం సంతరించుకొనడం నడచిపోతున్న ప్రజాస్వామ్య వైపరీత్యం. కేంద్ర ప్రభుత్వం 2016లో రూపొందించిన ‘పౌరసత్వ సవరణ విధేయక’- సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ బిల్-ను కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండడం ఇందుకు సరికొత్త సాక్ష్యం.

01/08/2019 - 01:06

కేంద్ర ప్రభుత్వ నిర్వాహక పక్షమైన ‘భారతీయ జనతాపార్టీ’ సోమవారం సంధించిన ‘రాజ్యాంగ’ వ్యూహానికి, వివిధ విపక్షాలు రూపకల్పన చేస్తున్న ‘రాజకీయ’ అస్తశ్రస్త్ర సమాహారం సమీప నేపథ్యం! నాలుగు నెలలలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో ‘భాజపా’ను గద్దెదించడం లక్ష్యంగా వివిధ ప్రతిపక్షాలు వివిధ వ్యూహాలను విరచించాయి, విరచిస్తున్నాయి.

01/04/2019 - 21:52

సీసపు విష రసాయన ధాతువులు కలసిన ‘మ్యాగీ’ సేమ్యాలను చిన్నపిల్లలు ఎందుకు తినాలన్నది సర్వోన్నత న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ గురువారం సంధించిన ప్రశ్న.. తినరాదన్నది న్యాయమూర్తి ప్రశ్నలో నిహితమై ఉన్న సమాధానం.

01/04/2019 - 01:56

తైవాన్‌ను తమ దేశంలో కలుపుకొని తీరుతామని చైనా ప్రభుత్వం హెచ్చరించడం చైనా దురాక్రమణ చరిత్రలో భాగం.. టిబెట్, సింకియాంగ్, మంచూరియా, మంగోలియా భూభాగాలను శతాబ్దుల తరబడి దురాక్రమించిన చైనా ఇప్పుడు తైవాన్‌పై కనే్నసింది.

01/03/2019 - 21:53

ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రయాణీకులను ‘వీలు’ను బట్టి దోపిడీ చేయడం నడుస్తున్న చరిత్ర! ఇలా దోపిడీ చేయడాన్ని గతంలో ‘నల్లబజారు’- బ్లాక్ మార్కెటింగ్- అని పిలిచేవారు, ‘బ్లాక్ మార్కెటింగ్’ చేసేవారిని ప్రభుత్వాలు శిక్షించేవి, ప్రజలు నిరసించేవారు. ప్రస్తుతం ఇలాంటి దోపిడీ సక్రమ వ్యవస్థగా చెలామణి అవుతోంది!

01/02/2019 - 01:46

మకర సంక్రాంతికి మరో పేరు ‘పతంగ్’ల- గాలిపటాల- పండుగ.. మకర సంక్రాంతి పండుగకూ గాలిపటాలకు అవినాభావ సంబంధం ఉండడం తరతరాల కథ. మన దేశంలోని ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలలో అత్యధిక శాతం చైనాతో ముడివడి ఉండడం నడుస్తున్న వ్యథ.. చైనా గాలి పటాలకున్న దారం- మాంజా- స్వదేశంలో తయారైన గాలి పటాలను కోస్తోంది, తెగిన మన గాలిపటాలు కూలిపోతున్నాయి.

Pages