S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/25/2017 - 01:44

అమరావతి, అక్టోబర్ 24: వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు గుర్తింపుగా ఇచ్చే అంతర్జాతీయ గుర్తింపు ఉన్న గోల్డెన్ పీకాక్ అవార్డు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులకు, అదీ భార్యాభర్తలకు దక్కడం అరుదైన ఘటన. ఆ ఇద్దరే సిఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి.

10/25/2017 - 01:43

రాజధాని అమరావతికి తుదిరూపునిస్తున్న నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులను లండన్ పర్యటనలోవున్న సిఎం చంద్రబాబు కలుసుకున్నారు. అత్యంత అరుదైన ఆకృతులతో అసెంబ్లీ, సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన బాబు, వీటి తుది రూపును బుధవారం ఖరారు చేసే అవకాశం ఉంది. మంగళవారం నాటి భేటీలో డిజైన్లను చంద్రబాబుకు వివరిస్తున్న కంపెనీ ప్రతినిథి

10/25/2017 - 02:07

హైదరాబాద్, అక్టోబర్ 24: నైరుతీ రుతుపవనాలు (సౌత్‌వెస్ట్ మాన్‌సూన్) మరో 24 గంటల్లో భారత్ నుంచి వెళ్లిపోతున్నాయ. ఈనెల 26న ఈశాన్య రుతుపవనాలు (నార్త్ ఈస్ట్ మాన్‌సూన్) వస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. మంగళవారం వరకు నైరుతీ రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఉన్నాయి.

10/25/2017 - 01:07

హైదరాబాద్, అక్టోబర్ 24: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండడంతో కృష్ణా బోర్డు ఆదేశం మేరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈ ఏడాది నీటి వినియోగంపై ఇండెంట్‌ను సమర్పించాయి. 138.5 టిఎంసి కావాలని తెలంగాణ, 273 టిఎంసి కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నివేదికలు అందించాయ. ఈ విషయమై ఈ నెలాఖరులోగా కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోనుంది.

10/25/2017 - 01:05

విజయవాడ (ఇంద్రకీలాద్రి) అక్టోబర్ 24: సామాన్య భక్తులకే పెద్ద పీట అంటూ చెబుతూ వచ్చిన దుర్గగుడి ఇవో, ధర్మకర్తలు ఉదయం జరిగిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో వివిధ రూపాల్లో భక్తులపై భారం మోపుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశంలో రూ.10 లడ్డూను ఏకంగా రూ.20లకు పెంచేందుకు నిర్ణయంచా రు. గతంలో రూ.50 ఉన్న శ్రీ చక్ర లడ్డూను రూ.100కు పెంచారు.

10/24/2017 - 04:40

హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అదనంగా 16 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. కాచిగూడ-కాకినాడ పోర్ట్‌కు 8, కాచిగూడ-కృష్ణరాజపురం మధ్య మరో ఎనిమిది రైళ్లను నడిపించనుంది. ట్రైన్ నెం.

10/24/2017 - 04:14

హైదరాబాద్, అక్టోబర్ 23: రైళ్లలో కోచ్‌ల పరిశుభ్రత, నిర్వహణపై తక్షణ చర్యలు తీసుకునే విధంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రైల్వేలో అమలవుతున్న శుభ్రత, ప్రయాణికుల భద్రత, సరుకు రవాణా వంటి వాటిపై వివిధ భాగాలకు చెందిన అధికారులతో జిఎం సమావేశమయ్యారు.

10/24/2017 - 02:23

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్జన-్భర్జన పడుతున్నది. ఈ నెల 26న జరిగే వైకాపా శాసనసభాపక్షం సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నది. వచ్చే నెల 2వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే.

10/24/2017 - 02:18

హైదరాబాద్, అక్టోబర్ 23: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావును కలిసి మంతనాలు జరిపారు. వచ్చే నెల 2 నుంచి జగన్ పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. తాను చేపట్టబోయే పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని కోరడంతో పాటు ఆశీర్వాదాన్ని కోరినట్లు సమాచారం.

10/24/2017 - 02:17

హైదరాబాద్, అక్టోబర్ 23: పిజి మెడికల్ విద్యార్థుల జవాబు పత్రాలను మరోమారు దిద్దాలని హైకోర్టు సోమవారం నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ఆదేశించింది. 2017 మేలో జరిగిన ఈ పరీక్షలపై 50 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. డాక్టర్ సి సాయి సువీర్ రెడ్డి తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను విచారించిన జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

Pages