S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/23/2017 - 01:58

హైదరాబాద్, జూన్ 22:నీటి లభ్యత ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి వీలైనంత త్వరలో ఖరీఫ్‌కు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ సాగునీటి కార్యాచరణ ప్రణాళికపై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

06/23/2017 - 01:55

హైదరాబాద్, జూన్ 22:మిషన్ భగీరథ పనులు సత్వరం పూర్తి చేయడం కోసం 480పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్షేత్ర స్థాయిలో జరిగే పనులను పర్యవేక్షించేందుకు అవసరమైన 480అదనపు ఉద్యోగాలను మంజూరు చేశారు.

06/23/2017 - 01:44

విశాఖపట్నం, జూన్ 22: విశాఖలో విలువైన భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్, పార్టీ ఎమ్మెల్యేలు కబ్జా చేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వారు తిన్నదంతా కక్కిస్తానని ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ అన్నారు. విశాఖ భూ కుంభకోణంలో నిందితులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైకాపా నేతృత్వంలో గురువారం స్థానిక జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సేవ్ విశాఖ పేరుతో మహాధర్నా జరిగింది.

06/23/2017 - 01:41

నంద్యాల, జూన్ 22: ఓటుకు నోటు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఓటుకు నోటు ఇచ్చేవారు అభివృద్ధిని పట్టించుకోరన్నారు. స్వార్థంతో, ధనార్జనే ధ్యేయంగా చేసే ఇలాంటి పనుల వల్ల ప్రజలకు మేలు జరగదన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం నంద్యాల ఆర్ అండ్ బి అతిథి గృహంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, ప్రజలతో సిఎం మాట్లాడారు.

06/22/2017 - 02:14

విజయవాడ ( ఇంద్రకీలాద్రి), జూన్ 21: విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానానికి 16 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

06/22/2017 - 03:16

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 21: మానవళికి యోగా ఒక సంపద అని, ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి వలన నేడు 177 దేశాల్లో ఆచరిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఎ కనె్వన్షన్ సెంటర్‌లో బుధవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపు ముఖ్యమంత్రి యోగాసనాలు వేశారు.

06/22/2017 - 02:13

న్యూఢిల్లీ, జూన్ 21: ఏన్డీయే రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను బలపరుస్తూ టిఆర్‌ఎస్ పార్టీ తరపున నామినేషన్ పత్రాలపై టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి బుధవారం సంతకం చేశారు. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలుపుతూ చేసిన సంతకాలు వరుస క్రమంలో తొలి సంతకం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాగా, రెండో సంతకం తమ పార్టీదేనని చెప్పారు.

06/22/2017 - 02:12

హైదరాబాద్, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎపి బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. కృష్ణారావును ఎపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి నుండి మంగళవారం తప్పించిన తర్వాత సొషల్ మీడియాలో ఆయనను అవమానించే విధంగా అభ్యంతరకరమైన ఫోటోలను ఒకరు ‘పోస్ట్’ చేశారు.

06/22/2017 - 02:11

హైదరాబాద్, జూన్ 21: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తిరిగి అధికారం చేపట్టేందుకు టి.కాంగ్రెస్ ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తున్నది. ఇందులో భాగంగానే తొలుత ఎస్‌సి, ఎస్‌టి రిజర్వ్‌డ్ స్థానాలపై దృష్టి సారించింది.

06/22/2017 - 01:53

హైదరాబాద్, జూన్ 21: ప్రతి పాఠశాలలో యోగను పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. విద్యార్థి దశ నుంచే యోగ అలవాటు చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి అందిస్తున్న యోగ మనకు ఒక వరం వంటిదని అన్నారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వవ్యాప్తం చేస్తున్నారని కొనియాడారు.

Pages