S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/13/2017 - 01:50

హైదరాబాద్, మార్చి 12:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగో వార్షిక బడ్జెట్‌ను టిఆర్‌ఎస్ ప్రభుత్వం సోమవారం ఉదయం శాసనసభలో ప్రవేశ పెట్టబోతోంది. ప్రస్తుత వార్షిక బడ్జెట్ 1,30,412 కోట్లు కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,46,500 కోట్ల ప్రతిపాదనతో ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా రూ.

03/13/2017 - 01:37

రాజమహేంద్రవరం, మార్చి 12: కల్పవృక్షంగా పేరొందిన కొబ్బరి చెట్టు నిజంగానే రైతుల ఇంట సిరులు కురిపించనుంది. కొబ్బరి చెట్టు నుండి తీసే ‘కల్పరస’కు ఆబ్కారీ చట్టం నుండి మినహాయింపు లభించడంతో ఇక ఉత్పత్తి ఊపందుకోనుంది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఆబ్కారీ చట్టం నుంచి కల్పరసను మినహాయించడంతో ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా ఉత్పత్తి మొదలైంది. రైతులు ఇతోధికంగా లాభాలు సంపాదిస్తున్నారు.

03/13/2017 - 01:34

విజయవాడ, మార్చి 12: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపసూచకంగా సోమవారం జరగాల్సిన రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలను రద్దుచేశారు. 14న రెండు సభల్లోనూ నాగిరెడ్డి మృతికి సంతాపం తెలియచేస్తారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయని అసెంబ్లీ అధికారులు తెలిపారు.

03/13/2017 - 01:29

నంద్యాల, మార్చి 12: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (53) ఆదివారం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆళ్లగడ్డలోని తన స్వగృహంలో ఉదయం 8.30 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12:15 గంటలకు మరణించారు. నాగిరెడ్డికి గతంలోనూ రెండుసార్లు గుండెపోటు వచ్చింది.

03/13/2017 - 00:54

తిరుపతి, మార్చి 12: హైదరాబాద్‌కు చెందిన ఫోనిక్స్ గ్రూప్ డీలర్, దాత చుక్కపల్లి సురేష్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి 2 లక్షల రూపాయల విలువ చేసే అత్యంత ఆధునిక మోటార్‌సైకిల్‌ను విరాళంగా అందజేశారు. కమాండ్ 300గా పిలువబడే ఈ వాహనాన్ని తిరుమల జెఇఒ శ్రీనివాసరాజుకు అందించారు. ఆలయం ముందు వాహనానికి అర్చకులు పూజలు నిర్వహించారు.

03/12/2017 - 07:53

హైదరాబాద్, మార్చి 11: ఇస్లాం మతం తీవ్రవాదానికి వ్యతిరేకమని, ఉగ్రవాదంపై పోరుకు సిద్ధం కావాలని శనివారం నాడిక్కడ జరిగిన అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మజ్లిస్-ఎ-ఉలెమా-ఎ-హింద్, ఆలిండియా సున్ని ఉలెమా వా సూఫియా బోర్డు సంయుక్త్ధ్వార్యంలో జరిగిన సదస్సలో ఇరాన్, కువైట్, భారత్‌లోని ఇస్లామిక్ స్కాలర్‌లు ప్రసంగించారు.

03/12/2017 - 07:40

భద్రాచలం/చింతూరు, మార్చి 11: చత్తీస్‌గఢ్‌లో మావోలు శనివారంనాడు మారణకాండ సృష్టించారు. మాటు వేసి జవాన్లను ఉచ్చులోకి దించి మట్టుబెట్టారు. ముందుగా మందుపాతర పేల్చి, తర్వాత చుట్టుముట్టి 12 మందిని కాల్చి చంపారు. 10 అత్యాధునికమైన ఆయుధాలను ఎత్తుకెళ్లారు.

03/11/2017 - 05:02

చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచి, ఆయా కుటుంబాలు ఆనందంగా బతికేలా చూద్దామని తెలంగాణ రాష్ట్ర
చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చేనేత సొసైటీలు,
దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సందర్శించి కార్మికులతో మాట్లాడుతున్న సమంత

03/11/2017 - 02:45

సంస్థాన్‌నారాయణపురం, మార్చి 10: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలస్వాలంబన్ పథకాన్ని విజయవంతం చేసిన వెదిరె శ్రీరాం బృందంలో యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జక్కిడి జంగారెడ్డి ఉండటం విశేషం.

03/11/2017 - 02:20

హైదరాబాద్, మార్చి 10: ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ, ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని శుక్రవారం నాడిక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

Pages