S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/11/2017 - 02:18

హైదరాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యులను నియమించాలని కోరుతూ హైకోర్టులో రెండు పిల్స్ దాఖలయ్యాయి. ఏపిసిఎల్‌ఏ ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేష్ కుమార్, మానవ హక్కుల పరిరక్షణ సంఘం సంయుక్త కార్యదర్శి సిహెచ్ జయప్రకాశ్ ఈ పిల్స్‌ను దాఖలు చేశారు.

03/11/2017 - 02:40

సిద్దిపేట/దుబ్బాక, మార్చి 10: చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచి ఆ కుటుంబాలు ఆనందంగా బతికేలా చూద్దామని రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చేనేత సొసైటీలు, దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సమంత సందర్శించి సందడి చేశారు. సిద్దిపేట వీరారెడ్డిపల్లి సొసైటీ, ఆదర్శ సొసైటీలో గొల్లభామ చీరలను ఆసక్తిగా పరిశీలించారు.

03/11/2017 - 02:03

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణలో పదో తరగతి పరీక్షల జంబ్లింగ్ విధానం ప్రహసనంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి కార్పొరేట్ స్కూళ్లు తమ యాజమాన్యంలోని వేరే కేంద్రాలకే జంబ్లింగ్ పేరిట తమ విద్యార్థులను పరీక్షలకు కేటాయించుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది రూపాయిలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

03/11/2017 - 02:02

హైదరాబాద్, మార్చి 10: రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా హామీఇచ్చిన మేరకు లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఐదేళ్ల వ్యవధిలో నియమించే లక్ష ఉద్యోగాలలో ఇప్పటికే 27,481 భర్తీ చేశామన్నారు.

03/11/2017 - 01:34

విజయవాడ, మార్చి 10:అమరావతిని ప్రపంచ దేశాల్లోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నానంటున్నారు. అయితే రాజధానికి సమీపాన పొంచి ఉన్న కొండవీటి వాగు వరద ముంపు నివారణకు మాత్రం శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు.

03/11/2017 - 01:26

విజయవాడ, మార్చి 10: రాష్ట్రంలో చేపట్టాల్సిన పరిపాలనా సంస్కరణలపై చర్చ జరగాల్సి ఉందని, ఈ మేరకు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఈ ఏడాది తలసరి ఆదాయం 1,22,376 రూపాయలు కాగా దేశ తలసరి ఆదాయం 1,03,818 రూపాయలన్నారు. వెలగపూడి సచివాలయం లో కార్యదర్శులు, విభాగాధిపతులు, మంత్రులతో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

03/10/2017 - 02:27

విజయవాడ, మార్చి 9: దక్షిణ భారతంలోనే బేరియాట్రిక్ సర్జరీలకు కేరాఫ్‌గా విజయవాడ మారుతోంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో స్థూలకాయులు విజయవాడకు వచ్చి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకుని తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యాన్ని పొందుతున్నారు.

03/10/2017 - 02:05

హైదరాబాద్, మార్చి 9: ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసిబి దాఖలు చేసిన రెండవ చార్జిషీటులో కూడా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును 22 సార్లు, మొదటి చార్జిషీటులో 26 సార్లు ప్రస్తావించిందని, అందువల్ల చంద్రబాబు నైతిక విలువలకు లోబడి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

03/10/2017 - 01:54

భద్రాచలం, మార్చి 9: తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని మన్యం కేంద్రం భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం గగనతలంపై రెండు హెలీకాప్టర్లు సుమారు అరగంట సేపు చక్కర్లు కొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల నుంచి 25 మంది పోలీసు అధికారులు భద్రాచలం చేరుకుని ఇక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.

03/10/2017 - 01:43

హైదరాబాద్, మార్చి 9: జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ నమోదుచేసిన మూడు కేసులకు సంబంధించి అభియోగాలపై విచారణ జరపవద్దని హైకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాలు మార్చి 17వ తేదీ వరకు అమలులో ఉంటాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సీతారామమూర్తి పేర్కొన్నారు. తమపై దాఖలుచేసిన అన్ని కేసులను కలిపి ఉమ్మడిగా విచారించాల్సిందిగా జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు.

Pages