S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/08/2017 - 01:33

విజయవాడ, మార్చి 7: శాసనసభ, మండలిలోని ప్రిసైడింగ్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష వైకాపా నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలను కాపాడే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనన్నారు. సభాపతి స్థానంలో కూర్చునే వ్యక్తి పార్టీలకు అతీతంగా నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.

03/08/2017 - 01:31

గుంటూరు, మార్చి 7: శాసనసభ సమావేశాల రెండోరోజు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రసంగాన్ని మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యతా రంగాలు కుదేలై ఉంటే ప్రభుత్వం రెండంకెల వృద్ధిరేటు పేరుతో ప్రజలను మోసం చేస్తోందని జగన్ మండిపడ్డారు. దీంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుంటూ ‘మీకు అవగాహనలేదు..

03/08/2017 - 01:31

గుంటూరు, మార్చి 7: ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహబలం ఏమిటో తెలియటంలేదు కానీ.. చేపలకు కూడా ధరలు పెరగటంలేదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. దీనిపై చర్చించేందుకు ముందుగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్షనేతకు 50 నిమిషాలు కేటాయించారు.

03/07/2017 - 04:41

హైదరాబాద్, మార్చి 6: భారతదేశ చరిత్ర నుండి వెనుకటి రాజులూ, ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోలేదని అందువల్లే వైఫల్యం చెందారని ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రాసిన ‘కాకతీయ కళా దర్శనం’ సిద్ధాంత గ్రంథావిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది.

03/07/2017 - 02:04

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకల్యాణం,
వైభవోత్సవ కల్యాణాన్ని సోమవారం వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న వేద పండితులు

03/07/2017 - 01:47

హైదరాబాద్, మార్చి 6: ప్రజాధనాన్ని దోచుకోవడానికే మిషన్ కాకతీయ చేపట్టారని, ప్రాజెక్టుల డిజైన్లు మార్చారని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పుల తడక, దగా అని కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పాలమూరు- రంగారెడ్డి ఎతపోతల పథకంపై కాంగ్రెస్ సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.

03/07/2017 - 01:45

హైదరాబాద్, మార్చి 6: ‘అభివృద్ధి కార్యక్రమాలను మంజురు చేసే బాధ్యత నాది...వాటిని సక్రమంగా అమలు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేసే బాధ్యత మీది’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ అధివృద్ధిపై జనహితలో సోమవారం ముఖ్యమంత్రి విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

03/07/2017 - 01:42

హైదరాబాద్, మార్చి 6: ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వివిధ రంగాల్లో రాణించిన 24మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుధవారం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో వీరికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది.

03/07/2017 - 01:35

అమరావతి, మార్చి 6: తనను తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పోల్చుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కేటీఆర్ నాకంటే పదేళ్లు సీనియర్. ఆయనతో నేను ఎలా పోల్చుకుంటాను? ఒకవేళ మీరలా పోల్చుకుంటే మీ ఇష్టం’ అని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

03/07/2017 - 01:33

విశాఖపట్నం, మార్చి 6: అధికార పార్టీ నేతల వ్యవహారం ఆడింది ఆట..పాడింది పాటగా సాగుతోంది. అధికారంలో ఉంటూ వ్యాపారాలు చేసుకునే ఎమ్మెల్యేలు, నేతలు చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని కోట్లు ఆర్జిస్తున్నారు. విశాఖ జిల్లాలో తాజా సంఘటన దీన్ని మరోసారి రుజువు చేసింది. విశాఖ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు మద్యం దుకాణాలు చాలా ఉన్నాయి. వీటిలో చాలావరకూ నేషనల్ హైవే మీదే ఉన్నాయి.

Pages