S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/28/2017 - 01:50

విజయవాడ, ఫిబ్రవరి 27: ఇంటర్ పరీక్షలు మార్చి 1తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మి సోమవారం కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి వివిధ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే నాలుగేళ్ల డిబార్‌కు గురి కాగలరని హెచ్చరించారు.

02/28/2017 - 01:48

విజయవాడ, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో పలు జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం అర్ధరాత్రి వరకు కసరత్తు చేస్తూనే ఉన్నారు. కడప ఎన్నికతోపాటు, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల ఎన్నికలను ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

02/28/2017 - 03:26

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ పుంజుల శివశంకర్ సోమవారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన శివశంకర్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శివశంకర్ మృతి పట్ల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు.

02/27/2017 - 04:30

కొత్తగూడెం, ఫిబ్రవరి 26: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం మరిన్ని పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఉర్దూ ఘర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) ప్రథమ మహాసభలో ఆయన ప్రసంగించారు.

02/27/2017 - 02:05

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు వచ్చే నెల 2, 3 తేదీల్లో కేంద్రం కీలక సమావేశాన్ని నిర్వహిం చనుం ది. అవసరమైన రికార్డులతో ఈ సమావేశానికి రావాల్సిందిగా రాష్ట్ర అటవీ, సాగునీటి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు కేంద్రం సూచించింది.

02/27/2017 - 01:35

హైదరాబాద్, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలపై కొనసాగుతున్న కసరత్తు రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రగతి భవన్‌లో ఆదివారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల మంత్రులతో ముఖ్యమంత్రి కెసిఆర్ కసరత్తు చేశారు. సోమవారం సాయంత్రానికి బడ్జెట్ ప్రతిపాదనల అంచనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.

02/27/2017 - 01:33

హైదరాబాద్/షాద్‌నగర్, ఫిబ్రవరి 26: ముఖ్యమంత్రి నోరు విప్పితే అన్నీ అబద్ధాలేనని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలో జరిగిన జనఆవేదన సమ్మేళనం సదస్సులో ఆయన మాట్లాడారు.

02/27/2017 - 01:29

హైదరాబాద్/ఉప్పల్, ఫిబ్రవరి 26: మరోసారి నిరుద్యోగులు మోసపోయారు. ఉద్యోగాల ఎరవేసి, డబ్బు వసూలు చేసి చివరాఖరున కుచ్చుటోపీ పెట్టే మోసగాళ్లు ఈసారి ఏకంగా జాబ్‌మేళానే తమ మోసాలకు వేదికగా ఎంచుకున్నారు. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ ‘తంతు’ చివరకు ఉద్రిక్తతకు దారితీసింది. జాబ్ మేళాకు తరలివచ్చిన వేలాది నిరుద్యోగులు మోసం జరిగిందని తెలుసుకుని, కళాశాలను ధ్వంసం చేశారు.

02/27/2017 - 01:21

అమరావతి, ఫిబ్రవరి 26: తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన కడప స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు కీలకపాత్ర పోషిస్తోంది. ఇరు శిబిరాలు కలిపి రూ.90కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కడపలో చిన్నాన్నను గెలిపించుకోవడం ద్వారా జిల్లాలో తన పట్టు కొనసాగించుకునేందుకు వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి శ్రమిస్తున్నారు.

02/27/2017 - 01:21

అమరావతి, ఫిబ్రవరి 26: తెలుగుదేశం పార్టీ ఉత్తరాధికారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శాసనమండలి సభ్యుడిగా త్వరలో చట్టసభలో అడుగుపెట్టనున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలంటూ ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఆమేరకు పొలిట్ బ్యూరో సభ్యుల సిఫార్సులను పార్టీ ఆమోదించింది.

Pages