S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/04/2017 - 02:11

సంగారెడ్డి/ దుబ్బాక/ సిద్దిపేట, మార్చి 3: ఉద్యోగపరమైన ఒత్తిళ్లతో మరో ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు (55) శుక్రవారం మధ్యాహ్నం తన భార్య సరోజన (50)ను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దుబ్బాక పోలీస్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ సంఘటన పోలీసు వర్గాలను విషాదంలో ముంచెత్తింది.

03/04/2017 - 02:05

అమరావతి, మార్చి 3: స్థానిక సంస్థల ద్వారా జరిగే శాసనమండలి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. ఆరుచోట్ల ఏకగ్రీవం కాగా, మరో మూడు చోట్ల పోటీ జరగనుంది.

03/04/2017 - 02:04

విజయవాడ, మార్చి 3: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన బస్సును నడిపిన డ్రైవర్‌కు అసలు లైసెనే్స లేదా? డ్రైవర్ పొంతన లేని సమాధానాలు ఈ అనుమానానికి బలం చేకూరుస్తున్నాయి. లైసెన్స్ ఉందా అనడిగితే ఇంట్లో ఉందని ఒకసారి, ఎక్కడో పెట్టానని మరోసారి చెబుతుండటంతో అసలు లైసెనే్స లేదని అధికారులు అనుమానిస్తున్నారు.

03/04/2017 - 02:00

నల్లమాడ, మార్చి 3: ఇటుకలు మోసే రామక్క, మేస్ర్తి పనిచేసే ఓబులేసు, రోడ్లు ఊడ్చే సాలమ్మ, సోడాలు అమ్మే రాములు, కొబ్బరిబోండాం అమ్మే హనుమంతు, బట్టలు కుట్టే షాహీదా, రాళ్లు కొట్టే నారాయణ, హోటల్లో టీ అందించే బాషా... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు బెంగళూరు మహానగరంలో ఎక్కడ చూసినా అనంతపురం జిల్లావాసులే కనిపిస్తున్నారు. కరవు తరమడంతో వీరంతా పొట్టచేతపట్టుకుని బెంగళూరుకు వలసవెళ్లారు.

03/03/2017 - 03:52

ఖమ్మం, మార్చి 2: విద్యార్థులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో గురువారం జరిగిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు రైతుల రుణమాఫీ, గిట్టుబాటు ధరలే ప్రధాన అంశాలుగా ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు.

03/03/2017 - 02:04

హైదరాబాద్, మార్చి 2:నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) చేదువార్త వినిపించింది. ఇటీవల విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను ఉపసంహరించుకున్నట్టు గురువారం ప్రకటించింది. గురుకులాల్లోని వివిధ కేటగిరి ఉద్యోగాలకు ఫిబ్రవరి 6న టిఎస్‌పిఎస్‌సి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదల చేసింది. దరఖాస్తులకు మార్చి 4 వరకూ గడువు ఉంది.

03/03/2017 - 02:02

హైదరాబాద్, మార్చి 2:బడ్జెట్ సమావేశాలు ముందు అనుకున్నట్టుగా ఈ నెల 8వ తేదీన కాకుండా రెండు రోజులు ఆలస్యంగా 10 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తాజా సమాచారం. బడ్జెట్ సమావేశాలను తప్పనిసరిగా 18 రోజులు నిర్వహించాలన్న నిబంధన ఏమీ లేకపోవడంతో ఈసారి 16 రోజులు మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గవర్నర్ నోటిఫికేషన్ రెండు రోజులలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

03/03/2017 - 01:46

విశాఖపట్నం, మార్చి 2:ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నది ఆ విద్యార్థి లక్ష్యం. అయితే అనుకోకుండా తండ్రి హఠాన్మరణం ఆ విద్యార్థిని దుఃఖ సాగరంలో ముంచేసింది. ఉదయం పరీక్ష రాసి, మధ్యాహ్నం తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తన ధర్మాన్ని పాటించాడు. ఈ సంఘటన స్థానికులను కంటతడిపెట్టించింది. విశాఖ నగరంలోని కుమ్మరివీధికి చెందిన ఎ రామకృష్ణకు ఇద్దరు కుమారులు.

03/03/2017 - 01:41

విజయవాడ, మార్చి 2:రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా తయారు చేస్తానని, ప్రపంచ దేశాల్లో మొదటి 10 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతి గర్వపడేలా అభివృద్ధి చేసి నిజాయితీ నిరూపించుకుంటానన్నారు. ఆశీర్వదించి ముందుకు నడిపించాలని ప్రజలను కోరారు. వెలగపూడి సచివాలయ ఆవరణలో నిర్మించిన రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు.

03/03/2017 - 01:36

విజయవాడ, మార్చి 2: డిపాజిట్లు తీసుకుని ఎగవేస్తున్న సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. అందులో భాగంగా 1999 ఫైనాన్స్ మదుపరుల చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది. దీంతో ఇక డిపాజిట్ ఎగవేతదారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేసే అవకాశం ఏర్పడింది. ఈ చట్టసవరణ బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

Pages