S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/01/2017 - 01:40

విజయవాడ, ఫిబ్రవరి 28:ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటైన 1445 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి.ముందుగానే పరీక్షా కేంద్రాలు పరిసరాల్లో 144 సెక్షన్‌ను విధించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ మిషన్ల షాపులు తెరువరాదంటూ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.

03/01/2017 - 01:36

విజయవాడ, ఫిబ్రవరి 28: ప్రతిష్ఠాత్మక ‘స్టేట్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఏకగ్రీవంగా ఎంపికైంది. సీఎన్‌బిసి టివి 18 సంస్థ అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఏపికి ఈ పురస్కారం దక్కింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలకు చెందిన జాతీయస్థాయి ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక జరిపింది. పురస్కార ప్రదానం మార్చి 23న జరుగనున్నది.

03/01/2017 - 01:35

నందిగామ/పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 28: కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బస్సు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు.

03/01/2017 - 01:28

అమరావతి, ఫిబ్రవరి 28: మరో మూడు గంటల్లో గమ్యస్థానాలకు వెళ్లాల్సినవారంతా నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన దివాకర్ టావెల్స్ బస్సు గమ్యం చేరకుండానే 10 మంది ప్రయాణికులు ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రుల హాహాకారాలతో నేషనల్ హైవే మార్మోగింది. ప్రభుత్వాసుపత్రిలో భయానక వాతావరణం చోటుచేసుకుంది.

02/28/2017 - 04:08

హైదరాబాద్, ఫిబ్రవరి 27: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆదిలాబాద్ యూనిట్ ఆస్తుల వేలాన్ని నిలిపివేయడానికి హైకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే వేలంలో విజయం సాధించిన వారికి ఆస్తులను అందించడంలో సిసిఐకి 3నెలల వ్యవధి ఇచ్చేందుకు అనుమతించింది.

02/28/2017 - 02:38

హైదరాబాద్/శంషాబాద్/జీడిమెట్ల, ఫిబ్రవరి 27: అమెరికాలో నాలుగు రోజుల క్రితం జాత్యహంకారి చేతిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రి 9.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికా నుంచి వచ్చిన కార్గొ విమానంలో శ్రీనివాస్ మృతదేహంతోపాటు ఆయన భార్య, సోదరుడి భార్య, మరో మిత్రుడు వచ్చారు.

02/28/2017 - 02:17

హైదరాబాద్, ఫిబ్రవరి 27: చారిత్రక కట్టడాల వద్ద కబ్జాలను అరికట్టేందుకు, అక్రమ భవనాలు తొలగించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఐటి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ప్రతి కట్టడం, ప్రాంతం జియో ట్యాగ్, పెన్సింగ్ చేయాలని ఆదేశించారు. చారిత్రక ప్రదేశాలతో కూడిన యాప్ తయారు చేయనున్నట్టు చెప్పారు.

02/28/2017 - 02:00

హైదరాబాద్, ఫిబ్రవరి 27: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అంగన్‌వాడీ వర్కర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం రూ.7000లను రూ.10,500కు, అంగన్‌వాడీ హెల్పర్లకు చెల్లిస్తున్న రూ.4200ను రూ.6000కు పెంచినట్టు ప్రకటించారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు.

02/28/2017 - 01:57

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే గర్భిణిలకు ఇకనుంచి మూడు విడతల్లో రూ.12 వేలు చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రసవించే బిడ్డ ఆడ శిశువు అయిన పక్షంలో అదనంగా వెయ్యి రూపాయలు చెల్లిస్తామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు అవసరమైన వస్తువులతో రూ.2 వేల వ్యయం చేసే కిట్‌ను ప్రభుత్వం బహుమానంగా అందజేస్తుందన్నారు.

02/28/2017 - 01:53

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 27: పరిహారం, శాశ్వత పునరావాసం కోసం పట్టుబడుతున్న గ్రామస్థులపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. వారిచేత బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ ముంపు గ్రామాల్లో పూడిపల్లి పంచాయతీలోని అంగుళూరు, నేలకోట, పరగసానిపాడు, నాగళ్లపల్లి, పి.గొందూరు, బోడిగూడెం, డి.రావిలంక ఖాళీచేయాల్సివుంది.

Pages