S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/02/2017 - 08:13

హైదరాబాద్, మార్చి 1: చలికాలం పూర్తయి, ఎండాకాలంలో అడుగువేస్తున్న సమయంలోనే సూర్యభగవానుడు అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి చివర, మార్చి తొలి పక్షంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావలసి ఉండగా, అప్పుడే చండప్రచండంగా మండిపోతున్నాడు. ఎండాకాలం మరో నాలుగు నెలలపాటు ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పగటిపూట భయంకరమైన ఎండలు ఉంటాయని అంచనావేస్తున్నారు.

03/01/2017 - 03:30

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, తీవ్రంగా కలచి వేసిందని, నోట మాట రావడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వస్తున్న ఈ ప్రైవేటు బస్సు వంతెనపై నుండి కల్వర్టులోకి పడటం చూస్తుంటే నోట మాట రాలేదని అన్నారు.

03/01/2017 - 02:04

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ వార్షిక బడ్జెట్ నాలుగోసారీ మిగులుతో ప్రవేశపెట్టబోతుంది. వరుసగా మూడు సార్లు మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, వచ్చే వార్షిక బడ్జెట్‌నూ సుమారు రూ.4 వేల కోట్ల మిగులుతో ప్రవేశ పెట్టబోతుంది.

03/01/2017 - 02:01

నల్లగొండ/ నాగార్జున సాగర్, ఫిబ్రవరి 28: నాగార్జునసాగర్ జలాశయం నుంచి కృష్ణా కుడి కాల్వకు నీటి విడుదల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పేచీ తలెత్తింది. వాటా జలాలు పూర్తిగా వదల్లేదని ఆంధ్ర, కోటా పూరె్తైందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు మంగళవారం వాగ్వాదానికి దిగారు. గత ఏడాది ఇదే పరిస్థితి తలెత్తి పోలీసులే బాహాబాహీకి దిగడం తెలిసిందే.

03/01/2017 - 01:58

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టిక్కెట్లతో నేరుగా పరీక్షలకు హాజరుకావచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. డౌన్‌లోడ్ చేసిన హాల్‌టిక్కెట్‌పై ఎవరి సంతకం అవసరం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. డౌన్‌లోడ్ చేసిన హాల్‌టిక్కెట్లపై ప్రిన్సిపాల్ సంతకం ఉండాలనే నిబంధనను సడలించినట్టు ఆయన చెప్పారు.

03/01/2017 - 01:58

అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యే తొలి క్యాంపు ఆఫీసు పరకాల సెగ్మెంట్‌లో సిద్ధమైంది. ఆరు నెలల్లో నిర్మాణం పూరె్తైన ఈ భవనాన్ని గురువారం రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారు.

03/01/2017 - 01:56

హైదరాబాద్, ఫిబ్రవరి 28: అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆయా ఆస్పత్రులను సీజ్ చేస్తామన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరు ఆస్పత్రులను సీజ్ చేసినట్టు చెప్పారు. ఆస్పత్రుల్లో చేసే ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా తప్పని సరిగా పంపాల్సిందేనని చెప్పారు.

03/01/2017 - 01:55

భువనగిరి, ఫిబ్రవరి 28: యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాళిదాసాచారి అరెస్టయ్యారు. మహిళా వైద్యులను వేధించిన కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

03/01/2017 - 01:45

ధర్మవరం: ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు పండ్ల సత్యనారాయణ 2015 లో బలవన్మరణం పాలయ్యాడు. తనకున్న 8 ఎకరాల్లో పంటలు సాగు చేశాడు. రెండుసార్లు అరటి పంట వేసినా తీవ్ర నష్టం రావడం, రూ.2.50 లక్షలు ఖర్చు చేసినా చుక్క నీరు పడలేదు. సుమారు రూ.8 లక్షలు అప్పు భారంగా మారింది. ఆత్మహత్యే శరణ్యమైంది. అతని పెద్ద కుమారుడు సూర్యనారాయణ బెంగళూరులో ఉంటున్నాడు.

03/01/2017 - 01:43

అనంతపురం, ఫిబ్రవరి 28:ఎన్ని బోర్లు వేసినా పాతాళగంగమ్మ పైకిరాననడంతో అన్నదాత గుండె పగిలిపోతోంది. పచ్చని పంటలు నిలువునా ఎండిపోతుంటే నిస్సహాయంగా ఏడవడం తప్ప ఆదుకునే ఆపన్నహస్తం కరవైంది. అప్పులవాళ్లు గడపతొక్కడంతో పరువు బజారునపడుతోంది. ఫలితంగా ఇంటిల్లిపాది భారాన్ని భగవంతుడిపై మోపి కరవుకొయ్యకు వేలాడుతున్నాడు రైతన్న. అనంతపురం జిల్లాలోని మరో కరవు కోణం ఇది.

Pages