S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/27/2017 - 01:18

అమరావతి, ఫిబ్రవరి 26:రాష్ట్రంలో రాజకీయ అంశంగా మారిన నిరుద్యోగ భృతి డిమాండ్ పరిష్కారానికి తెలుగుదేశం పొలిట్‌బ్యూరో ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. త్వరలో విద్యార్హతను బట్టి భృతి ఇవ్వాలని పేర్కొంటూ, ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 10లక్షల కొత్త ఇళ్లు, మార్చి 2న అసెంబ్లీ భవనం ప్రారంభించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

02/27/2017 - 01:16

హైదరాబాద్, ఫిబ్రవరి 26: అమెరికాలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం సోమవారం హైదరాబాద్ చేరనుంది. రాత్రి 9.00లకు శంషాబాద్ విమానాశ్రయానికి శ్రీనివాస్ మృతదేహం చేరుకునే అవకాశం ఉందని మృతుడి బంధువులు తెలిపారు. శ్రీనివాస్ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మల్లంపేట్ స్మశాన వాటికలో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

02/26/2017 - 03:30

హైదరాబాద్/ జీడిమెట్ల, ఫిబ్రవరి 25: అమెరికాలో జాత్యాహంకారంతో జరిపిన దాడుల్లో మన వాళ్లు మృతి చెందడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గళం విప్పాలని, విదేశాంగ శాఖ ద్వారా నిరసన తెలియజేయాలని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు.

02/26/2017 - 03:42

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఒక ప్రభుత్వ ఉద్యోగిపై సంబంధించిన ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు ఆ ఉద్యోగి జాబ్ చార్ట్ (విధులు)ను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. ప్రాంతీయ రవాణాశాఖాధికారి పి సుధాకర్ రెడ్డికి ఒక వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యను తోసిపుచ్చుతూ జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ అనిస్‌తో కూడిన ధర్మాసనం పైతీర్పును వెలువరించింది.

02/26/2017 - 03:19

హైదరాబాద్/బేగంపేట, ఫిబ్రవరి 25: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శనివారం ఆలిండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భారతీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, అమెరికా ప్రభుత్వం అందరికీ రక్షణ కల్పించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్ చేశారు.

02/26/2017 - 03:17

హైదరాబాద్, ఫిబ్రవరి 25: దేశంలో కాంగ్రెస్ పరిస్థితి నీళ్లలోంచి ఒడ్డున పడ్డ చేపలా మారిందని, అధికారం కోసం కొట్టుమిట్టాడుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ బిజెపి కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

02/26/2017 - 02:16

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం నాడిక్కడ మంత్రుల నివాస సముదాయం వద్ద తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసిన కృష్ణమాదిగ ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు పెరిగిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

02/26/2017 - 02:12

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తాటిచెట్లలో పొట్టిరకం చెట్లను సృష్టించాలని వ్యవసాయ, ఉద్యాన శాస్తవ్రేత్తలను తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేరళలోని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ శనివారం సంయుక్తంగా నిర్వహించిన భాగస్వాముల సమావేశంలో ఆయన మాట్లాడారు.

02/26/2017 - 02:14

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర ఖజానాను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కుటుంబ సభ్యులు లూటీ చేస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులపై అవాకులు, చవాకులు మాట్లాడితే ఊరుకోమని గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

02/26/2017 - 02:13

హైదరాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పిజి కోర్సులు ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో చేరేందుకు టిఎస్ పిజిఇసెట్‌ను తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఈ పరీక్షను మే 29,30,31, జూన్ 1న నాలుగు రోజులు పాటు నిర్వహిస్తామని, ఉదయం ఒక షిఫ్ట్, సాయంత్రం ఒక షిఫ్ట్ ఉంటుందని చెప్పారు.

Pages