S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/05/2017 - 02:29

వెంకటాపురం, మార్చి 4: తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం పంచాయతీ రాచపల్లి- మల్లాపురం గ్రామాల మధ్య నుంచి పాలెం ప్రాజెక్టుకు వెళ్లే మట్టి రోడ్డుపై శనివారం ఉపాధిహామీ కూలీలు పని చేస్తుండగా మందుపాతర కనుగొన్నారు. కుడివైపున కొండ ప్రాం తం కోతులకొండ కాగా ఎడమవైపు మైదాన ప్రాంతం ఉంది. కొండపై భాగం నుంచి వైర్లు అమర్చిన మావోయిస్టులు మట్టి రోడ్డు మధ్యలో మందుపాతరకు కనెక్షన్ ఇచ్చారు.

03/05/2017 - 03:19

హైదరాబాద్, మార్చి 4: ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయ అభివృద్ధి చెందుతున్న దశలో రెచ్చగొట్టే విధంగా ఆంధ్ర సిఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని గవర్నర్ నరసింహాన్ వద్ద తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను లాంఛనంగా ఆహ్వానించేందుకు కెసిఆర్ శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు.

03/05/2017 - 01:56

హైదరాబాద్, మార్చి 4: పెండింగ్ పనులు పూర్తి చేసి ఖరీఫ్‌లో ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్ 2 కింద మూడు లక్షల 97 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

03/05/2017 - 01:45

అమరావతి, మార్చి 4: ముఖ్యమంత్రిని అనుచిత పదజాలంతో దూషించిన వ్యవహారంలో ఇప్పటికే ఏడాది సస్పెన్షన్‌కు గురైన వైకాపా ఎమ్మెల్యే రోజాపై పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు అంశంలో మరో ఏడాది సస్పెన్షన్ పొడిగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. శనివారం వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభా హక్కుల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

03/05/2017 - 01:49

అది బెజవాడ బస్టాండ్. అక్కడ ఇద్దరు వ్యక్తుల సంచారం అనుమానాస్పదంగా ఉంది. వాళ్లలో వాళ్లే తర్జనభర్జన పడుతున్నారు. చూడబోతే ఏదో పెద్ద కుట్రకే తెరలేపేటట్టున్నారు. ఈ దృశ్యాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కంప్యూటర్ల ఎదుట కూర్చున్న పోలీసుల కంటపడ్డాయి. సీసీ కెమెరాలను అటువైపు జూమ్ చేశారు. స్థానిక పోలీసులకు వైర్‌లెస్ సెట్లో ఆదేశాలు పంపారు. ఆ ఇద్దరు అగంతకుల్నీ ఫాలో చేసేందుకు నానో డ్రోన్ గాల్లోకి లేచింది.

03/04/2017 - 03:56

హైదరాబాద్, మార్చి 3: వామపక్షాలు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జాతి వ్యతిరేక శక్తులకు వామపక్షాలు వంత పలుకుతున్నాయని చెప్పారు. రాష్టప్రతి పదవికి తాను రేసులో లేనని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుందని చెప్పారు.

03/04/2017 - 02:24

మక్తల్, మార్చి 3: గద్వాల జిల్లా మక్తల్ మం డల పరిధిలోని మంథన్‌గోడ్‌లో స్థలం కోసం జరిపిన తవ్వకాల్లో అతిపురాతనమైన దేవతా విగ్రహాలు బయటపడ్డ సంఘటన స్థలాన్ని శుక్రవారం పురావస్తు శాఖ అధికారులు సందర్శించి అక్కడి విగ్రహాలను ఇతర ఆనవాళ్లను పరిశీలించారు. స్థల యజమాని గ్రామస్తుల అభిప్రాయం వేరకు తహశీల్దార్ ఓంప్రకాష్ సమక్షంలో పురావస్తు శాఖ అధికారులు పూర్తి సమాచారం కోసం శుక్రవాం మరోమారు తవ్వకాలను చేపట్టారు.

03/04/2017 - 02:22

నల్లగొండ, మార్చి 3: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు శుక్రవారం స్వామివారు వటపత్రశాయి ఆలంకార సేవలో పొన్న వాహనంపై విహరించి భక్తులను పులకింపచేశారు. ప్రళయ కాలంలో మరో జగత్తును సృష్టించే క్రమంలో జగత్‌ద్రక్షుడైన స్వామివారు వటపత్రశయనుడైన వేళ.. లక్ష్మీనృసింహుడిని వటపత్రశాయిగా అలంకార సేవ చేసి కోరి న కోరికలు తీర్చే పొన్న (కల్పవృక్షం) వాహనంపై విహరింపచేశారు.

03/04/2017 - 02:14

హైదరాబాద్, మార్చి 3: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని, ఈ నిబంధన యధావిధిగా కొనసాగుతుందని ఇంటర్మీయట్ బోర్డు ప్రకటించింది. ఒక నిమిషం నిబంధన వల్ల పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్‌జామ్‌ల వల్ల సకాలంలో పరీక్షాకేంద్రానికి చేరుకోలేక అనేకమంది విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతున్నారు.

03/04/2017 - 02:13

హైదరాబాద్, మార్చి 3:గ్రామీణ ప్రాంతంలో మహిళలకు డిజిటల్ అక్షరాస్యత మొదలుకొని, స్టార్టప్‌లకు సాంకేతిక సహకారం అందించడం వరకు రాష్ట్రానికి సాంకేతిక సహకారం కోసం గూగుల్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వాల మధ్య శుక్రవారం కీలక ఒప్పందం కుదిరింది. తెలంగాణలో డిజిటలైజేషన్‌పై గూగుల్ ఇండి యా, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.

Pages