S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/21/2016 - 01:39

విజయవాడ (రూరల్), డిసెంబర్ 20: లబ్ధిదారులకే నేరుగా పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడులో మంగళవారం రాత్రి చంద్రన్న కానుకల్ని ఆయన ప్రారంభించారు.

12/20/2016 - 04:21

భద్రాచలం, డిసెంబర్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి భద్రాద్రి బాలోత్సవం వేడుకలు సోమవారంతో ముగిశాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులు తమ ఆటపాటలతో మురిపించారు. బాలల పండగకు విశేష స్పందన లభించింది. సుమారు 2 వేల మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

12/20/2016 - 03:03

చింతూరు, డిసెంబర్ 19: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం దండకారణ్య సమీప గ్రామాల్లో రహదారులపై మావోయిస్టులు మందు పాతరలు అమరుస్తూ అలజడి సృష్టిస్తున్నారు. గత శనివారం ఏడుగుర్రాలపల్లి-పేగ గ్రామాల మధ్య రహదారికి అడ్డంగా వరుసగా నాలుగు మందు పాతరలు అమర్చిన సంగతి విదితమే. తాజాగా సోమవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి సమీపంలో రహదారిపై మావోయిస్టులు బిందెలో మందుపాతర అమర్చారు.

12/20/2016 - 02:57

భద్రాచలం, డిసెంబర్ 19: పక్క రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, ఒడిశాలతో కలిసి పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మహబూబాబాద్ ఎంపి ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, మనోభావాలకు భిన్నంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు.

12/20/2016 - 02:14

హైదరాబాద్, డిసెంబర్ 19: వెయ్యెకరాల భూమి. 1.67 లక్షల చదరవు అడుగుల ఇళ్ల స్థలాలు. 27 ఇళ్లు. ఇవీ ఇప్పటి వరకు ఆధారాలు లభించిన ఆస్తులు. ఇవేవో బడా పారిశ్రామికవేత్తవో, భూస్వామి ఆస్తులో కాదు. నరహంతకుడు నరుూమ్ ఆస్తులు. ఇతని క్రైం రికార్డులో 52 హత్యలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 27 హత్యల్లో నరుూమ్ ముఠా పాత్రను గుర్తించారు.

12/20/2016 - 01:47

విజయనగరం, డిసెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరూ కలసికట్టుగా గళం విప్పాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతో మరో ఉద్యోగ విప్లవం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

12/20/2016 - 01:45

అమరావతి, డిసెంబర్ 19: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్‌చంద్ర పునేతా నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీసీఎల్‌ఏ కమిషనర్‌గా పనిచేస్తున్న 84 బ్యాచ్‌కి చెందిన పునేతా నియామకం దాదాపు ఖరారయినట్లు సమాచారం. 2019 వరకూ సర్వీసు ఉన్న పునేతా కంటే సీనియర్ అయిన ఏకె పరీదా (82 బ్యాచ్)కు దాదాపు నిరాశ తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సిఎస్‌గా టక్కర్ కొనసాగుతున్నారు.

12/20/2016 - 01:39

విజయవాడ, డిసెంబర్ 19: కడప జిల్లా గండికోట రిజర్వాయరు నిర్వాసితులకు 479 కోట్ల రూపాయలతో ప్యాకేజీ అందచేయనున్నట్లు జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సంక్రాంతికి ముందే పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడపలోని కొన్ని ప్రాంతాలకు కృష్టా జలాల్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న పురుషోత్తంపురం, జనవరి 2న మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

12/19/2016 - 05:41

చిత్రం..హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జగన్నాథస్వామి ఆలయంలో ఆదివారంనాడు సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్

12/19/2016 - 05:26

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో చలి కాస్త తక్కువగా ఉంటోంది. చాలా ప్రాంతాల్లో పగటివేళ ఎక్కువ ఎండగా ఉండగా, రాత్రివేళల్లో మాత్రం చలి కొనసాగుతోంది. రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలపైగానే నమోదవుతోంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత 9.2 డిగ్రీలు నమోదయింది. మెదక్‌లో 12.5, హైదరాబాద్‌లో 14.7 డిగ్రీలు నమోదయింది.

Pages