S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/17/2016 - 04:09

హైదరాబాద్, డిసెంబర్ 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిశోధన విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ శుక్రవారం నాడు స్పందించారు. దేశంలో కీలకమైన ఐదు అంశాలపై తాను మాట్లాడతానంటూ ట్విట్టర్లో చాలా రోజులుగా చెబుతున్న పవన్‌కళ్యాణ్ తొలి రోజు గోవ ధ గురించి అనేక ప్రశ్నలు సంధించారు. రెండో రోజు రోహిత్ వేముల ఆత్మహత్యపై ట్విట్టర్లో తన అభిప్రాయాలు పేర్కొన్నారు.

12/17/2016 - 04:02

తెనాలి, డిసెంబర్ 16: తెలుగుతల్లి విగ్రహ శిల్పకళా సృష్టికర్త, వేమూరు వాస్తవ్యులు దేవు శంకర్ గురువారం రాత్రి కన్నుమూశారు. శిల్పరత్న దేవు మహమ్మయాచారి రెండవ కుమారుడు శంకర్. వీరి సంతతి ఆరు తరాలుగా శిల్పకళలో తరిస్తోంది. శంకర్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శంకర్ బాల్యం నుండి తండ్రి వద్ద శిల్పకళను అభ్యశించారు. గత 65సంవత్సరాలుగా శిల్పకళలో ప్రావీణ్యత పొందారు.

12/17/2016 - 02:00

హైదరాబాద్, డిసెంబర్ 16: దేశ ప్రయోజనాల కోసం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం తీసుకున్న సదుద్దేశ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించారు. నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు తలెత్తినా, సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రధాని విధించిన వ్యవధి వరకూ వేచిచూద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

12/17/2016 - 01:53

నరసరావుపేట, డిసెంబర్ 16: రాష్ట్రంలో చంద్రబాబునాయుడి పాలన అబద్ధాలమయమైందని ప్రతిపక్ష నేత, వైయస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డి వైయస్సార్‌సీపీ చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు.

12/17/2016 - 01:44

విజయవాడ, డిసెంబర్ 16: మొదటి ఆరు నెలల్లో రాష్ట్రంలో 12.23 శాతం వృద్ధిరేటు సాధించామంటూ, డిమానిటైజేషన్ ప్రభావం గ్రోత్ రేటుపై పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, అధికారులతో శుక్రవారం తన నివాసం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/16/2016 - 05:37

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ప్రతిష్టాకరమైన స్కోచ్ అవార్డులు లభించాయి. అత్యుత్తమ విద్యుత్ విధానాలను పాటించినందుకు స్కోచ్ మెరిట్ అవార్డు, స్మార్ట్ టెక్నాలజీని అవలంభించినందుకు స్కోచ్ టెక్నాలజీ అవార్డు లభించింది. ఈ అవార్డును గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సదరన్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి స్వీకరించారు.

12/16/2016 - 05:30

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీలను తీసుకురావద్దని తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ (టిజాక్) డిమాండ్ చేసింది. టిజాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ గురువారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రైవేట్ యూనివర్శిటీలు వస్తే వాటిల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉండదన్నారు. ప్రైవేట్ యూనివర్శిటీలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు.

12/16/2016 - 05:29

హైదరాబాద్, డిసెంబర్ 15: శాసనసభా, శాసనమండలి సమావేశాలు ముగిసే వరకు అధికారులు పర్యటనలు, సెలవులు రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఆదేశించారు. శీతాకాల శాసనసభా, శాసనమండలి సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం శాఖాధిపతులతో ప్రదీప్ చంద్ర సమావేశమయ్యారు.

12/16/2016 - 05:26

హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ కాలుష్య సమస్య పెరిగిపోతోందని, కాలుష్యాన్ని అరికట్డడంలో ప్రజలు భాగస్వాములు కావాలని, కాలుష్య నివారణ అందరి బాధ్యతని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. గురువారం డిజిపి కాన్ఫరెన్స్ హాల్‌లో అశ్వని అలర్జీ కేంద్రం ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్వచ్ఛ ఆకాశ్ అభియాన్’ అవగాహన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

12/16/2016 - 05:24

హైదరాబాద్, డిసెంబర్ 15: సమాజంలోని వేలాది సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయాలను భావితరానికి అందించేది కేవలం పుస్తకమని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణలోని కళలు, సాహిత్యం, సంస్కృతి, భాషా, సంప్రదాయాలు, పండుగలను కలగలుపుకుని కాపాడుకోవటంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు.

Pages