S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/24/2016 - 02:19

సంగారెడ్డి, డిసెంబర్ 23: బంగారు తెలంగాణ సాధనలో భాగంగా తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా తొలి మెట్టు ఎక్కామని, ఇదే స్ఫూర్తితో సమష్టిగా ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకుంటామని సిఎం కె చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

12/24/2016 - 02:06

విజయవాడ (క్రైం), డిసెంబర్ 23: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతిపక్షం అడుగడుగునా అడ్డు తగులుతోందన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో తిరుగులేదని, ఇటీవల సర్వేల్లో కూడా ఇదే విషయం వెల్లడైందన్నారు.

12/24/2016 - 02:04

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 23: ప్రపంచంలోనే సంస్కృతీ సంప్రదాయాలకు మనదేశం పుట్టినిల్లని, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు మనకు వారసత్వ సంపదని, వాటిని పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న తరుణంలో సంప్రదాయాలను విస్మరించకూడదన్నారు.

12/24/2016 - 02:02

గుంటూరు, డిసెంబర్ 23: గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదురుపాకాన పడింది. జనచైతన్య యాత్రల సందర్భంగా పలు గ్రామాల్లో పార్టీశ్రేణుల నుంచి నిరసన సెగలు ఎదుర్కొన్న మంత్రి రావెలపై అధికార పార్టీకే చెందిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి రావెల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు.

12/24/2016 - 01:56

హైదరాబాద్, డిసెంబర్ 23: భారత్‌లో పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం రూపొందించే పథకాలు, విధానాలను సమర్థతగా రూపొందించేందుకు పారిశ్రామికవేత్తలు సలహాలు, సూచనలు ఇవ్వాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కోరారు.

12/24/2016 - 01:49

కర్నూలు, డిసెంబర్ 23: ఒకవైపు గిట్టుబాటు ధర లభించక, మరోవైపు దళారుల మాయాజాలంతో కుదేలవుతున్న రైతుల మెడపై ప్రభుత్వం మరో కత్తి పెట్టింది. ప్రభుత్వ అవసరాలకు సేకరించే భూములకు చెల్లించే నష్టపరిహారం సరిపోదని భావించే రైతులు ఇకపై స్థానిక కోర్టులకు వెళ్లే వీలులేని పరిస్థితి ఎదురుకాబోతోంది.

12/23/2016 - 04:54

హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.

12/23/2016 - 04:48

హైదరాబాద్, డిసెంబర్ 22: డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు, ఎటిఎంల వద్ద పడిగాపులు పడాల్సిన కష్టాలు రెండు మూడు రోజులలో పూర్తిగా తీరిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు రెండు వారాలకు విడుదల చేయాల్సిన మొత్తాన్ని ఒకే వారానికి విడుదల చేయడంతో గురువారం నుంచే నోట్ల కష్టాలు తగ్గుముఖం పట్టాయి.

12/23/2016 - 04:43

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు ఉదయగిరి సీతారామానుజాచార్యులు అనారోగ్య కారణాలతో బుధవారం మరణించారని సమాఖ్య కార్యదర్శి పెద్దింటి రాంబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా వైఖానస సంఘం, ఒంగోలు ఆగమపాఠశాల కార్యదర్శిగా, తిరుమల శ్రీవైష్ణవ దివ్య సిద్ధాంతి వివర్దినీ సభ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా ఆయన పనిచేశారన్నారు.

12/23/2016 - 04:42

హైదరాబాద్, డిసెంబర్ 22: ఏపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు సంబంధించి రెండు రాష్ట్రాలు తాము ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని, వచ్చే సోమవారం నాటికి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని హైకోర్టు గురువారం ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ఆదేశాలను ధర్మాసనం జారీ చేసింది.

Pages