S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/15/2016 - 02:46

హైదరాబాద్, జూలై 14: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని కెజి టు పిజి వరకూ ఉచిత విద్యను పటిష్టంగా అమలుచేయాలని తెలంగాణలో గురువారం నాడు జరిగిన బంద్ విజయవంతం అయ్యిందని విద్యార్ధి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణలో పోలీసులు వందలాది విద్యార్ధులను అరెస్టు చేశారు.

07/15/2016 - 02:34

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రాల మధ్య సంబంధాలు, అంతర్గత భద్రత, సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ప్రణాళికలు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 16న జరుగనున్న ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి సిఎం కెసిఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం అనంతరం శనివారం ప్రధానితో సిఎం ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు అధికార వర్గాల సమాచారం.

07/15/2016 - 02:29

హైదరాబాద్, జూలై 14: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో ముసాయిదాలు ఇప్పటికే సిద్ధం కావడంతో, నెలాఖరులోనే వాటిని ప్రజలముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై గతంలో ప్రకటించిన రోడ్ మ్యాప్ మేరకు అఖిలపక్ష సమావేశం జరిగిన తర్వాత ముసాయదా విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది.

07/15/2016 - 02:28

హైదరాబాద్, జూలై 14: రాష్ట్ర రాజధాని సహా, రాష్ట్రంలో కాయగూరల ధరలు మండుతున్నాయి. ఎండాకాలంలో నీళ్లులేకపోవడం తదితర కారణాల వల్ల ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగాయని అంతా సరిపెట్టుకున్నారు. వానాకాలం వచ్చినప్పటికీ ధరలు తగ్గకపోవడంతో జనం కంగారుపడుతున్నారు. వెజ్ కన్నా చికెన్ చీప్ అనుకుంటూ నాన్‌వెజిటేరియన్లు కాయగూరలు కొనడం మానేసి చికెన్‌వైపే మొగ్గు చూపుతున్నారు.

07/15/2016 - 02:25

హైదరాబాద్, జూలై 14: మైనింగ్ అక్రమాలను సహించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని ఐటి, మైనింగ్ మంత్రి కె తారక రామారావు హెచ్చరించారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రైవేటు పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని అధికారుల బృందం పరిశీలించింది.

07/15/2016 - 01:56

హైదరాబాద్, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రివల్యూషన్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పట్టణ ప్రాంతాలతో గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేయడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎపిలోని కీలక గ్రామాలను, వార్డులను స్మార్ట్ గ్రామ పంచాయతీలు, స్మార్టు వార్డులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక అమలుకు అవసరమైన రుణాన్ని అందించేందుకు నాబార్డు అంగీకరించింది.

,
07/15/2016 - 02:17

విజయవాడ, జూలై 14: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం పట్టపగలే దారుణం జరిగింది. ఐసియులో చికిత్స పొందుతున్న ఆరు రోజుల పసికందు క్షణాల్లో మాయమైపోయింది. ఇరవై నిమిషాల క్రితం పాలిచ్చిన శిశువుకు మరోసారి పాలివ్వటానికి వెళ్లిన తల్లికి రోదనే మిగిలింది.

07/15/2016 - 01:49

విజయవాడ, జూలై 14: రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ, విజయవాడ తదితర ప్రధాన పట్టణాలకు అదనంగా ఎసిసిపిలను నియమించారు. కొత్తగా సృష్టించిన పోస్టులకు ప్రత్యేకంగా విజయవాడకు ఇద్దరు ప్రత్యేక అధికారుల(ఓఎస్‌డి)ను కేటాయించారు. గుంటూరు రూరల్ డిఎస్పీ కె సుధాకర్‌ను అదనపుఎస్పీ హోదాలో గురజాల ఓఎస్‌డిగా నియమించారు.

07/15/2016 - 02:16

పొందూరు, జూలై 14: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో దారుణం జరిగింది. బడికెళ్తున్న పదేళ్ల బాలికను వీధి కుక్కలు పొట్టన పెట్టుకున్నాయి. పొందూరు మండలం దళ్లిపేట గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థిని దల్లి స్పందన గురువారం స్కూలుకు వెడుతుండగా, తమలో తాము పోట్లాడుకుంటున్న ఆరు వీధి కుక్కలు అకస్మాత్తుగా స్పందనపై దాడి చేశాయి. ఎక్కడ పడితే అక్కడ కరవడంతో బాలిక సంఘటన స్థలంలోనే కన్నుమూసింది.

07/15/2016 - 01:47

విజయవాడ, జూలై 14: పర్వదినాలు, పండుగ రోజులు వచ్చాయంటే, బిచ్చగాళ్ల ఆదాయం భలేగా ఉంటుంది. మామూలు రోజుల్లోను వాళ్ల సంపాదన బాగానే ఉంటుంది. పనె్నండేళ్లకోసారి వచ్చే పుష్కరాల సంగతి సరేసరి. ఆ పనె్నండు రోజులూ అడుక్కున్నవారికి అడుక్కున్నంత. కానీ ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లేస్తోంది. పుష్కరాల నాటికి ఒక్క బిచ్చగాడు కూడా బెజవాడలో కనిపించకూడదని ప్రభుత్వం హుకుం జారీ చేసింది.

Pages