S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/13/2016 - 05:46

హైదరాబాద్, జూలై 12: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. భూములు అప్పగింతకు ఏటిగడ్డ కిష్టాపూర్ సహా ఎర్రవెల్లి, లక్ష్మాపూర్ గ్రామాల రైతులు ముందుకొచ్చారు. గజ్వేల్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు రైతులతో సమావేశమయ్యారు. లక్షలమంది రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భూముల అప్పగింతకు అంగీకరించినట్టు రైతులు తెలిపారు.

07/13/2016 - 05:42

హైదరాబాద్, జూలై 12: కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం తర్వాత గోదావరి జిల్లాల వరకు నది పరవళ్లు తొక్కుతున్నప్పటికీ, ఉభయ తెలుగు రాష్టాల్లోని గోదావరి, కృష్ణా, పెన్నా నదులపై ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ వెలవెల పోతున్నాయి. కృష్ణాపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు వెలవెల పోతున్నాయి.

07/13/2016 - 05:39

హైదరాబాద్, జూలై 12: రెండేళ్ల వ్యవధి తర్వాత తెలంగాణలో వైస్ చాన్సలర్ల నియామకాలపై ప్రభుత్వం దృష్టిసారించినా, అవి నిలిచేలా లేవని న్యాయనిపుణులు అంటున్నారు. ఛాన్సలర్లు, వైస్ ఛాన్సలర్లుగా అత్యున్నత వ్యక్తులను నియమించాలనే కాంక్షతో తెలంగాణ ప్రభుత్వం యూనివర్శిటీల చట్టాన్ని సవరించింది. దీనిపై ఎంతో కసరత్తు చేసి చివరికి నియామకాల అధికారాన్ని గవర్నర్ నుండి తప్పించి సిఎం చేతిలో పెట్టింది.

07/13/2016 - 05:37

హైదరాబాద్, జూలై 12: క్రమబద్దీకరణ పరిధిలోకి రాని కాంట్రాక్టు ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం తీపి కబురు అందించబోతుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. క్రమబద్ధీకరణ పరిధిలోకి రాని కాంట్రాక్టు ఉద్యోగులకు ఖాళీల భర్తీలో అవకాశం కల్పించడానికి సీనియార్టీ ప్రకారం వెయటేజీ కల్పించాలని భావిస్తుంది.

07/13/2016 - 05:26

న్యూఢిల్లీ, జూలై 12: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వణి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో శాంతి,్భద్రతలను కాపాడాలని మోదీ జమ్ముకాశ్మీర్ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

07/13/2016 - 05:20

హైదరాబాద్, జూలై 12: అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రష్యాలోని చెలబిన్స్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రష్యా పర్యటనలో భాగంగా చంద్రబాబు చెలబిన్స్ గవర్నర్ బోరిస్‌తో సమావేశమయ్యారు.

07/13/2016 - 06:04

హైదరాబాద్, జూలై 12: కేసీఆర్ నెంబర్ వన్.. శివరాజ్‌సింగ్ చౌహాన్ నెంబర్ టూ.. రమణసింగ్ నెంబర్ త్రీ.. ఆనంది బెన్ నెంబర్ ఫోర్.. అరవింద్ కేజ్రీవాల్ నెంబర్ ఫైవ్! ఈ నెంబర్లేమిటని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రధాని నిర్వహించిన సర్వేలో వచ్చిన స్థానాలివి! అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

,
07/12/2016 - 04:22

రాజమహేంద్రవరం/ భద్రాచలం, జూలై 11: ఎగువ నుండి వస్తున్న వరద జలాలతో ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వరదలకు గోదావరి నదికి వరద పోటు తగిలి, క్రమేణా ఉగ్రరూపం దాలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 6.2 అడుగులు నీటి మట్టం ఉండగా, సాయంత్రానికి 7.3 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో దాని ప్రభావం ఇక్కడా ఉంటుంది.

07/12/2016 - 05:11

హైదరాబాద్, జూలై 11: గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాలు 15 అడుగులు మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు సూచించింది. భాగ్యనగర ఉత్సవ సమితి సైతం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

07/12/2016 - 05:13

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ ఎమ్సెట్ వెబ్ ఆప్షన్లకు ఈ నెల 13 వరకూ గడువు సడలించినట్టు ఎమ్సెట్ కన్వీనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు. తుదిసీట్ల కేటాయింపు 16న జరుగుతుందని చెప్పారు. సర్ట్ఫికేట్ల పరిశీలనకు ఇంతవరకూ 68,214 మంది హాజరయ్యారని, అందులో వెబ్ ఆప్షన్లను 66,260 మంది ఇచ్చారని చెప్పారు. అభ్యర్ధులు అంతా కలిపి 33,243,584 ఆప్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు.

Pages