S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/15/2016 - 02:22

హైదరాబాద్, జూలై 14: ఈ ఏడాది దేశంలోని వివిధ జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధికి 16 బిలియన్ డాలర్లను ఖర్చుపెట్టనున్నట్టు జాతీయ రహదారుల అథారిటీ చైర్మన్ రాఘవచంద్ర అన్నారు. ప్రస్తుతం నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో 250 రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. ఇంతవరకు తమ సంస్ధ 400 రహదారుల ప్రాజెక్టులను పూర్తి చేసిందన్నారు.

07/14/2016 - 07:34

హైదరాబాద్, జూలై 13: తెలుగుదేశం పార్టీ వారసుడు లోకేష్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించే సమయం ఆసన్నమయిందా? ఆ మేరకు ఆయనను ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమించేందుకు బాబు ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇది.

07/14/2016 - 07:10

రాజమహేంద్రవరం, జూలై 13: గోదావరి నది వరద జలాలు ఏటికేడాది వృథాగా సముద్రం పాలవుతున్నాయి. గోదావరి నదికి అనేకసార్లు రికార్డు స్థాయి వరదలు ఎదురయ్యాయి. 1986 వరదలను ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లను పటిష్ఠం చేశారు. ఆ తదుపరి కూడా రికార్డు స్థాయి వరదలు సంభవించాయి. గోదావరి నదికి ఎదురైన వరదల చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఏడాది లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయి.

07/14/2016 - 06:30

హైదరాబాద్, జూలై 13:ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో మెరైన్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న స్టేట్ మెరైన్ టెక్నికల్ యూనివర్శిటీ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో ఐదోరోజు బుధవారం ఈ మేరకు కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది.

07/14/2016 - 06:26

హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో నిర్వహించిన ఎమ్సెట్-2లో హైదరాబాద్ కుర్రాడు రాజుపాలెం ఉజ్వల్ టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. 160కి 155 మార్కులు సాధించిన ఉజ్వల్, కంబైన్డ్ స్కోర్‌లో 97.66 శాతం మార్కులు సాధించి, అగ్రస్థానం చేజిక్కించుకున్నాడు.

07/13/2016 - 07:54

హైదరాబాద్, జూలై 12: దక్షిణాఫ్రికాకు చెందిన సింథియా హత్య కేసును మంగళవారం రాజేంద్రనగర్ కోర్టు విచారించింది. సింథియాను హత్య చేసి తగులబెట్టిన రూపేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. తల్లి దారుణహత్య, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి కుమార్తె సానియా ఒంటరిగా మారింది.

07/13/2016 - 07:53

హైదరాబాద్, జూలై 12: పంజగుట్ట ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో చిన్నారి రమ్య మృతికి కారకుడైన బిటెక్ విద్యార్థి శ్రావిల్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. శ్రావిల్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం కోర్టు స్పందించింది.

07/13/2016 - 07:52

హైదరాబాద్, జూలై 12: హరితహారంలో ప్రతిరోజు జిల్లాకు 20 లక్షల చొప్పున రాష్టవ్య్రాప్తంగా 2 కోట్ల మొక్కలు నాటాలని కలెక్టర్లను అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. హరితహారం కార్యక్రమం నిర్వహణపై సచివాలయం నుంచి మంగళవారం సిఎస్ రాజీవ్ శర్మతో కలిసి మంత్రి జోగురామన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/13/2016 - 07:52

హైదరాబాద్, జూలై 12: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బిజెపి సీరియస్‌గా దృష్టి సారించింది. తెలంగాణలో ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీగా, ఏపిలో సొంతంగా బలం పెంచుకునేలా కార్యాచరణ రూపొందించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆ మేరకు రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.

07/13/2016 - 05:48

హైదరాబాద్, జూలై 12: రాష్ట్రంలో బార్లపై డేగ కన్ను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి బార్‌లో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను విరుద్దంగా 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించే బార్లు, మద్యం షాపుల లైసెన్స్‌లను ఇకనుంచి రద్దు చేయడంతోపాటు చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Pages