S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/12/2016 - 02:15

హైదరాబాద్, జూలై 11: రాజేష్, రమ్య దుర్మరణం కేసులో మద్యం సేవించి కారు నడిపిన నిందితుడు ఇంజనీరింగ్ విద్యార్థి శ్రాహిల్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు షాహిల్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పంజగుట్ట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

07/12/2016 - 02:12

న్యూఢిల్లీ, జూలై 11: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 20కు వాయిదా పడింది. సోమవారం నూతన రాజధాని నిర్మాణంపై దాఖలైన పిటిషన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ శ్రీమన్నారాయణ తరఫున న్యాయవాది గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించారు.

07/12/2016 - 02:09

కర్నూలు, జూలై 11: అది కర్నూలు సర్వజన వైద్యశాల. వైద్యఆరోగ్యశాఖ మంత్రి కానినేని శ్రీనివాస్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. చుట్టూ భారీ పోలీసు బందోబస్తు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్న వేళ.. అయినా నాకేం భయం అంటూ ఓ పాత దొంగ యథావిధిగా చేతికి పని చెప్పాడు. ఒకసారి చోరీ చేసి పారిపోయిన వాడు, ఆశచావక మరోసారి చోరీకి వచ్చి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

07/12/2016 - 02:08

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు రాబోతున్నాయి. కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్త వాహనాలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఆర్టీసీ 1,486 బస్సులు కొనుగోలు చేసేందుకు టెండర్లు ఆహ్వానించామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు.

07/12/2016 - 02:07

హైదరాబాద్, జూలై 11: ఆంధ్రప్రదేశ్‌లో పశుసంపదను పెంపొందించటం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసి, రైతుల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ముఖ్యంగా బ్రెజిల్ తరహాలో ఒంగోలు జాతి పశుసంపదను వృద్ధి చెందేలా చూడటం ద్వారా, రైతులకు ఆర్థిక ప్రయోజనం అందుతుందని వివరించారు.

07/12/2016 - 05:06

హైదరాబాద్, జూలై 11: జై తెలంగాణ, జై ఆంధ్ర ఇదే మా నినాదం అని టిఆర్‌ఎస్ ఎంపి కవిత తెలిపారు. అంతేకానీ జై సమైక్యాంధ్ర నినాదం మాత్రం కాదని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో జరిగిన అమెరికా తెలంగాణ సంఘం (ఆటా) ప్రపంచ ప్రథమ మహాసభల వేడుకల్లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జై ఆంధ్ర, జై తెలంగాణ అంటే కొందరు తప్పు పడుతున్నారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.

07/12/2016 - 02:10

తిరుపతి, జూలై 11: కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. టిటిడి కల్యాణ మండపంలో అన్నప్రసాదాలు తయారుచేసి రోజుకు 24 వేల ఆహారపొట్లాలు భక్తులకు పంపిణీ చేయాలని అదేశించారు.

07/12/2016 - 02:00

హైదరాబాద్, జూలై 11: సింథియాను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త రూపేష్‌కుమార్ పోలీస్ కస్టడీపై మంగళవారం విచారణ జరుగనుంది. ఈనెల 3న రూపేష్ తన భార్య సింథియాను హత్య చేసి దహనం చేసేందుకు యత్నించి పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు రూపేష్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. కాగా రూపేష్ కస్టడీకి సంబంధించి కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

07/12/2016 - 01:57

న్యూఢిల్లీ, జూలై 11:చారిత్రక శబరిమలై ఆలయంలోకి 10-50 సంవత్సరాల లోపు మహిళలను అనుమతించకూడదన్న అంశాన్ని సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచికి నివేదించే సంకేతాలు వెలువడుతున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయని, వీరిని శబరిమలై ఆలయంలోకి అనుమతించక పోవడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం పేర్కొంది.

07/12/2016 - 01:57

అనంతపురం, జూలై 11: గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఆరుగురు పులివెందుల వాసులు మలేసియాలో నరకం అనుభవిస్తున్నారు. దుబాయ్‌కి పంపుతామని చెప్పిన ఏజెంట్లు తీరా మలేసియా విమానం ఎక్కించారు. దీంతో వారు వెనక్కు రాలేక, మలేసియాలో నానా అగచాట్లు పడుతున్నారు. మలేషియాలో చిక్కుకున్న తమవారిని వెనక్కు రప్పించాలని బాధితుల కుటుంబ సభ్యులు ఏపి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని సోమవారం కలిసి వేడుకున్నారు.

Pages