S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/12/2016 - 03:14

హైదరాబాద్, జూలై 11: ‘హరితహారాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల పని తీరుకు నిదర్శనం. అధికారులకు పరీక్షా సమయం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరు ఎలా పనిచేస్తున్నారో పది జిల్లాల నుంచీ రోజువారీ నివేదికలు తీసుకుంటున్నట్టు సిఎం గుర్తు చేశారు.

07/12/2016 - 03:11

హైదరాబాద్, జూలై 11: మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పూడికతీత, చెరువు గట్టు నిర్మాణాలకు సంబంధించి పనుల్లో నాణ్యత లోపిస్తే ఆ నిర్మాణాలను కూల్చి వేయాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించినట్టు కొన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి తెలిపారు.

07/12/2016 - 03:10

హైదరాబాద్, జూలై 11: తెలంగాణలో జిల్లాల విభజన కీలకమైన విషయాల్లో ఇక్కట్లు తెచ్చేలా వుంది. విద్యారంగానికి సంబంధించినంత వరకు విద్యార్థులకు ‘స్థానికత’ ప్రభావం పెద్దగా ఉండకపోయినప్పటికీ, ఉద్యోగాల విషయంలో ఇది సమస్యగా మారబోతోంది. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల నియామకాలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లాస్థాయి ఉద్యోగాల్లో 80శాతం ఉద్యోగాలను స్థానికులకే రిజర్వ్ చేస్తారు.

07/12/2016 - 03:09

విశాఖపట్నం, జూలై 11: ఉత్తరాదిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావం నెలకొనడంతో తెలంగాణ జిల్లాల్లో రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. చత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకూ కోస్తాను ఆనుకుని అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని సోమవారం రాత్రి ప్రకటించింది.

,
07/12/2016 - 02:46

హైదరాబాద్, జూలై 11 : ఖమ్మం, గోదావరి జిల్లాల్లో గోదావరి నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండగా, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి ఉపనదులైన ప్రాణహిత, పెన్‌గంగా పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం దిగువ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాటన్ బ్యారేజీకి ఉన్న 175 గేట్లను ఎత్తివేసి 5,16,538 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు.

07/12/2016 - 02:40

హైదరాబాద్, జూలై 11: సహజవనరుల వినియోగంలోనూ, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ అగ్రభాగాన ఉన్న రష్యాతో ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేయాలన్న ధృడ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌లో ఇన్నోప్రోమ్-2016 వేదికపై చంద్రబాబు కీలక ఉపన్యాసం ఇచ్చారు. రష్యా, భారత్‌లకు దశాబ్దాల బంధం ఉందని, ఉభయ దేశాలు సహజమిత్రులని చంద్రబాబు అభివర్ణించారు.

07/12/2016 - 02:36

విజయవాడ, జూలై 11: ఉగ్రవాదుల దృష్టి ఇప్పుడు విశాఖ నగరంపై పడిందా? అవునంటోంది ఇంటిలిజెన్స్ విభాగం. ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులు విశాఖపై జరగవచ్చని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), జైషే మొహమ్మద్ (జెఇఎం), ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు విశాఖపై గురిపెట్టినట్టు ఇంటిలిజెన్స్ నివేదిక చెపుతోంది.

07/12/2016 - 02:34

విజయవాడ/నెల్లూరు/నిజామాబాద్: అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళి అక్కడ చిక్కుల్లో పడిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు స్వస్థలాలకు తిరుగు పయనం కాగా, నిజామాబాద్‌కు చెందిన కొంతమంది ఆర్మీ క్యాంపుల్లో తల దాచుకుంటున్నారు. యాత్రికులకు ఇబ్బంది ఏమీ లేదని, క్షేమంగా తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

07/12/2016 - 02:33

కొత్తగూడెం, జూలై 11: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పివికె 5 ఇంక్లెయన్ భూగర్భ గనిలో మంటలు చెలరేగి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. శనివారం రాత్రి గనిలో మంటలు రేగడంతో ఉత్పత్తి నిలిపివేశారు. గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న క్రమంలో ఒక్కోసారి తీయడానికి వీలులేని బొగ్గును వదిలేస్తుంటారు. వదిలేసిన బొగ్గు ప్రాంతానికి సీలు వేస్తూ గోడలు నిర్మిస్తారు.

07/12/2016 - 02:32

విశాఖపట్నం, జూలై 11: ఒక పని చేయాలంటే కొన్ని పనులు నిలిపివేయాల్సిందేనా! ప్రభుత్వ తీరు చూస్తుంటే అలానే అన్పిస్తోంది. ప్రజా సాధికార సర్వే (స్మార్ట్‌పల్స్ సర్వే) పేరిట ప్రభుత్వం చేస్తున్న ప్రయోగంతో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఉద్యోగులంతా సర్వే పనుల్లో మునిగితేలుతున్నారు. రెవెన్యూ, సాధారణ పరిపాలన, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ఒకటేమిటి అన్ని శాఖల్లోనూ పనిచేసే వారే కరువయ్యారు.

Pages