S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/11/2016 - 07:46

కూచిపూడి, జూలై 10: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని నాట్యక్షేత్రం కూచిపూడి సీతామహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ఆదివారం అన్నమాచార్య 608వ జయంతి నాట్యోత్సవాలు వైభవంగా జరిగాయి.

07/11/2016 - 01:13

హైదరాబాద్, జూలై 10: ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుకు సంబంధించి వివరాలు ఇవ్వని స్వతంత్ర అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన, ఆంధ్ర, తెలంగాణకు చెందిన 289 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల వ్యయంపై నివేదికలు వెంటనే ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రెండేళ్లు గడచినా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థులు ఖర్చుపై నివేదికలు ఇవ్వలేదు.

07/10/2016 - 07:46

తిరుమల, జూలై 9: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఉండే ఆలయాన్ని ముంబయిలో నిర్మిస్తామని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి జె ఇ ఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

07/10/2016 - 07:44

విశాఖపట్నం, జూలై 9: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో చెదురు, మదురు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

07/10/2016 - 07:44

కొత్తగూటెం, జూలై 9: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కొత్తగూడెంక్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 10, 11, 12, 13 తేదీల్లో జాతీయ సిల్వర్‌జూబ్లీ బాలోత్సవ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు, 1991 సంవత్సరంలో ప్రారంభమైన బాలోత్సవ్ 25 సంవత్సరాలు ఆయిన సందర్భంగా ఈ సంవత్సరం సిల్వర్‌జూబ్లీ బాలోత్సవ్‌గా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

07/10/2016 - 04:41

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ తెలుగు దేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 10 వేర్వేరు కమిటీలను నియమించాలని ఆ పార్టీ నిర్ణయించింది. శనివారం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ టి.టిడిపి ముఖ్య నాయకులతో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

07/10/2016 - 04:38

హైదరాబాద్, జూలై 9: ఏపి, తెలంగాణ మధ్య ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, డిపాజిట్ల పంచాయతీ తెగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ పరిసరాల్లో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్ధల భవనాలు, బ్యాంకు డిపాజిట్లలో తమకు రావాల్సిన వాటాకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టనుంది.

07/10/2016 - 04:37

న్యూఢిల్లీ, జూలై 9: ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం చేయడం ద్వారా తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బిజెపి వ్యూహరచన చేస్తోంది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం తెలంగాణ నాయకులతో దాదాపు ఐదు గంటల పాటు జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా తూడిచిపెట్టుకుపోయాయి. కాంగ్రెస్ అవసాన దశలో ఉంది.

,
07/10/2016 - 03:24

హైదరాబాద్, జూలై 9 : హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి(ఎస్‌డిఇ) దవాఖానాలో 13 మందికి జరిగిన కంటి ఆపరేషన్లు వికటించిన సంఘటనపై లోకాయుక్త సోమవారం నుంచి విచారణ జరుపుతుంది. మరోవైపు ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు కూడా తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంకోవైపు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది. నివేదికను ఆదివారం ప్రభుత్వానికి సమర్పిస్తారు.

,
07/10/2016 - 03:19

హైదరాబాద్, జూలై 9: క్రమశిక్షణకు మారుపేరుగా పేరొందిన తెలుగుదేశంలో అధినేత ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. స్వయంగా చంద్రబాబునాయుడే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినా, దానిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ఆందోళనబాట పడుతున్న వైనం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.

Pages