S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/05/2020 - 00:55

కడప, జనవరి 4: ఆక్రమణదారులు, ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకే కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకువచ్చిందని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ దేశంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

01/03/2020 - 13:28

హైదరాబాద్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌రాయ్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సింగపూర్, మలేసియాకు నిధులు మళ్లించినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. ఆర్‌బీఐ, విదేశాంగ శాఖ నిబంధనలకు విరుద్థంగా నిధులు మళ్లించారని, ఇతర అవసరాలకు వినియోగించారని సీబీఐ ఆరోపణ.

01/03/2020 - 05:34

భద్రాచలం టౌన్: మూర్త్భీవించిన ధర్మ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భద్రగిరిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో నిజరూపంలో భక్తులను కనువిందు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో స్వామి గురువారం నిజరూపంలో దర్శనమిచ్చి భక్తులకు అభయమిచ్చారు. ముందుగా ఆలయంలో విశ్వక్సేనపూజ, పుణ్యాహావచనం, స్నపనం నిర్వహించి స్వామిని ఆరాధించారు.

01/03/2020 - 05:11

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ గురువారం నాడు నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.

01/03/2020 - 05:09

హైదరాబాద్, జనవరి 2: ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడాలంటే 2020 క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు మధ్య పోటీ ఉన్నట్లే కార్మికులు, అధికారులు మధ్య విధుల్లో పని చేయాల్సి ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపు ఇచ్చారు. గురువారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో మంత్రి అధికారులతో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు.

01/03/2020 - 00:57

నెల్లూరు, జనవరి 2: ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ సందడి ప్రారంభమైంది. విదేశీ విహంగాల విడిది కేంద్రమైన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టులో శుక్రవారం నుండి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఫెస్టివల్‌లో భాగంగా సూళ్లూరుపేటలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

01/02/2020 - 23:52

విజయవాడ, జనవరి 2: రవాణా రంగంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పోటీతత్వాన్ని దీటుగా ఎదుర్కొంటూ సంస్థ పురోభివృద్ధికి ప్రతి ఉద్యోగి తనవంతు కృషిని నిర్విరామంగా కొనసాగించాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కోరారు.

01/02/2020 - 04:50

భద్రాచలం టౌన్: భద్రాచలం రామాలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో బుధవారం స్వామివారు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఈ రూపంలో ఉన్న స్వామికి తొలుత ఆలయంలో పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి అధ్యయనోత్సవ వేదిక వద్ద ఆసీనులను చేశారు. అక్కడ స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

01/02/2020 - 04:46

కర్నూలు, జనవరి 1: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎవరు చెప్పినా వినకుండా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకుపోతే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. క బుధవారం తనను కలిసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ చిన్న పిల్లాడిలా మొండి వైఖరితో ఉంటే ఆయనకే కాకుండా రాష్ట్రానికి కూడా నష్టం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

01/02/2020 - 04:45

విజయవాడ, జనవరి 1: రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వీలుగా 100 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయంలో ఐటీ పరిశ్రమలకు రాయితీ కోసం 133 కోట్ల రూపాయలు కేటాయించినా, ఆ నిధులను వినియోగించలేదు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ఈ నిధులను ఏపీటీఎస్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages