S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/07/2020 - 00:43

అనంతపురం, జనవరి 6: బ్రిటీష్‌కాలం నాటివి, స్వతంత్ర భారతం ఏర్పడినప్పటి నుంచి అమలు చేస్తున్న భారత శిక్షాస్మృతిని సమూలంగా మార్పు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ.కిషన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం అనంతపురం నగరంలో మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తేవాల్సి ఉందన్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదిస్తోందన్నారు.

01/06/2020 - 06:09

ఖమ్మం: జగదభిరాముడి జలవిహారం ముచ్చట గొలిపింది. అశేష భక్తకోటిని తరింపజేసింది. స్వర్ణకాంతులీనే విద్యుల్లతల శోభలో, పావన గౌతమీ పాయల్లో ఓవైపు వేదఘోష మార్మోగుతుం టే.. అంబరాన వెలుగు పూలవాన వర్షించగా భద్రగిరి వేలుపు శ్రీ సీతారామచంద్రస్వామి వారు పావన గౌతమీ గోదావరి నదిలో హంస వాహనంపై విహరించారు. ఈ దృ శ్యాన్ని చూసిన భక్తజనం పులకించిపోయారు. జై శ్రీరామ్.. జైజై శ్రీ రామ్ అంటూ జయజయధ్వానాలు చేశారు.

01/06/2020 - 01:06

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆదివారం కుటుంబ సమేతంగా తిరుపతి చేరుకున్న తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న
ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు

01/06/2020 - 00:46

తిరుపతి, జనవరి 5: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుమలలో ఈనెల 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేపట్టిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమలలో ఆదివారం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లో షెడ్లు, మాడవీధుల్లోని షెడ్లు, కల్యాణవేదిక ప్రాంతాలను పరిశీలించారు.

01/05/2020 - 05:08

తిరుపతి: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి విఐపీలకు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామన్నారు.

01/05/2020 - 04:29

రేణిగుంట, జనవరి 4: హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రం కొల్లాంకు వెళ్తున్న శబరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అయ్యప్పస్వామి భక్తులు ఆపేసి ధర్నా నిర్వహించిన సంఘటన రేణిగుంట రైల్వేస్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ... హైదరాబాద్ నుంచి కొల్లంకు అయ్యప్పస్వామి భక్తులు ప్రయాణిస్తున్న శబరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం మధ్యాహ్నం రేణిగుంట రైల్వేస్టేషన్ 4వ నెంబర్ ఫ్లాట్‌ఫాంకు చేరుకుంది.

01/05/2020 - 04:27

విశాఖపట్నం, జనవరి 4: తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా సముద్రతీరం వెంబడి అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం శనివారం రాత్రి పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.

01/05/2020 - 04:26

అమరావతి, జనవరి 4: విద్యుత్ ఉద్యోగుల పంపకాల్లో మరోసారి వివాదం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర, తెలంగాణ మధ్య రాష్ట్ర స్థాయి క్యాడర్ ఉద్యోగుల పంపకాలపై గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు ఏపీకి 52, తెలంగాణకు 48 శాతం ఉద్యోగులను కేటాయించాల్సి ఉంది. ఏపీ, తెలంగాణల్లో మొత్తంగా సుమారు ఆరు వేల మంది వరకు స్టేట్ క్యాడర్ సిబ్బంది పనిచేస్తున్నారు.

01/05/2020 - 01:35

భద్రాచలం టౌన్, జనవరి 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ముక్కోటి శోభ ను సంతరించుకుంది. రామాలయం విద్యుద్దీపాల వెలుగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో ఉన్న స్వామిని తిలకించిన భక్తులు పులకరించారు. ఆలయం లో ముందుగా స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు

01/05/2020 - 01:05

హైదరాబాద్, జనవరి 4: దేశవ్యాప్తంగా 20 ఐఐఎంలతో పాటు వందలాది మేనేజిమెంట్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే క్యాట్‌లో ఈసారి 21 మంది 99 ప్లస్ పర్సంటైల్‌ను సాధించారు. అందులో తెలంగాణ నుండి ముగ్గురు విద్యార్థులు టాపర్ల జాబితాలో నిలిచారు. తెలంగాణ నుండి సమీర్ అహ్మద్ 99.88 పర్సంటైల్, సుజిత్ రామగిరి 99.79 పర్సంటైల్, పార్త్ గోస్వామి 99.62 పర్సంటైల్ సాధించారు.

Pages