S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/10/2020 - 13:07

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసు విషయమై నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కూడా హాజరయ్యారు. అయితే సీఎం హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి.

01/10/2020 - 05:32

మచిలీపట్నం, జనవరి 9: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జోలె పట్టారు. కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో అమరావతి ఐక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ప్రజలంతా ఆర్థిక చేయూత ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం మచిలీపట్నంలో బహిరంగ సభ నిర్వహించారు.

01/09/2020 - 23:23

హైదరాబాద్, జనవరి 9: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు.

01/09/2020 - 23:20

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రానికి 140 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 84 టీఎంసీల నీటిని గురువారం ఇక్కడ జలసౌధలో సమావేశమైన కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేటాయించింది. కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి మే 31గా బోర్డు గడువు విధించింది.

01/09/2020 - 23:16

భీమవరం, జనవరి 9: రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన శక్తి ఆలయాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంక్రాంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 56వ ఉత్సవాలు 13వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు అంటే 33 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

01/09/2020 - 04:45

విశాఖపట్నం: నడి సముద్రంలో మరమ్మతులకు గురై సహాయం కోసం ఎదురు చూస్తున్న సంప్రదాయ నౌక (్ధ) ఆల్ హమీద్‌ను భారత నౌకాదళానికి చెందిన గస్తీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ సుమేథ గుర్తించి సాయం అందించింది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఈడెన్‌లో గస్తీ విధుల్లో ఉన్న సుమేథ సోమాలియా ప్రాంతంలో గస్తీలో ఉండగా సంప్రదాయ చెక్క నౌక ఆల్ హమీద్‌ను నడిసముద్రంలో కనుగొంది.

01/09/2020 - 03:38

నెల్లూరు, జనవరి 8: కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లింలు ఇతర దేశాలలో సంబంధాల కోసం రాజకీయం చేస్తున్నారని సీఎఎను ప్రశ్నించే హక్కు కమ్యూనిస్టులకు లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాబోయే రోజుల్లో సీఎఎపై స్పష్టంగా సఖ్యత ర్యాలీల ద్వారా తెలియజేస్తుందని ఆయన తెలిపారు.

01/09/2020 - 03:36

తిరుపతి, జనవరి 8: మనిషికి పదవులు ముఖ్యం కాదని వ్యక్తిత్వం ముఖ్యమని శ్రీ విద్యానికేతన్ చైర్మన్, దర్శక నిర్మాత, ప్రముఖ హీరో మంచు మోహన్ బాబు అన్నారు. దేశప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలను మంచు మోహన్ బాబుతోపాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలో కలిసిన విషయం విదితమే. కాగా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో బుధవారం 27వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

01/09/2020 - 03:34

తిరుపతి, జనవరి 8: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఈనెల 10వ తేదీన నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నందున ఈనెల 10న శుక్రవారం పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు బుధవారం టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.

01/09/2020 - 03:33

ఖమ్మం, జనవరి 8: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5మున్సిపాలిటీల పరిధిలో తొలిరోజున 11మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనప్పటికి టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఆయా డివిజన్‌లలో నామినేషన్లు దాఖలు చేశారు.

Pages