S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/31/2019 - 01:15

హైదరాబాద్, డిసెంబర్ 30: ఎవరెంత అడ్డుపడినా సీఏఏ అమలు జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో జనాభా వివరాలను సేకరించిందని, పదేళ్ల తర్వాత ఎన్‌పీఆర్ పేరుతో తమ ప్రభుత్వం జనాభా వివరాలను సేకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

12/31/2019 - 00:47

యాదగిరిగుట్ట, డిసెంబర్ 30: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా గర్భాలయం గోడలపై ప్రహ్లాద, నృసింహ చరిత్రలకు సంబంధించిన ఘట్టాలను తెలిపేలా లోహాలతో రూపొందించిన చిత్ర ఫలకలను అమర్చే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధానాలయంలో వివిధ పురణా, ఇతీహాస చరిత్రలు తెలిపే శిల్పాలు, దేవతామూర్తుల రాతి శిల్పాలు ఇప్పటికే తీర్చిదిద్ధారు.

12/30/2019 - 23:51

ఒంగోలు, డిసెంబర్ 30:పౌరసత్వ చట్టం భారతప్రజల కోసం ఉద్దేశించింది కాదని, కేవలం పొరుగు దేశాలనుండి వచ్చిన శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వటం కోసం మాత్రమేనని బీజెపీ రాజ్యసభసభ్యుడు జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు. సోమవారం ఒంగోలులో పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి భారీ ప్రజాచైతన్య ప్రారంభమైంది. ఈయాత్రను జీవీఎల్ జెండా ఊపి ప్రారంభించారు.

12/30/2019 - 05:18

హైదరాబాద్/గచ్చిబౌలి: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) అంశాలపై దేశ వ్యాప్తంగా నిర్మాణాత్మకంగా, కూలంకషంగా చర్చ జరగాలని, ప్రజలు కూడా వీటిపై లోతుగా అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఇక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు.

12/29/2019 - 23:15

భద్రాచలం టౌన్, డిసెంబర్ 29: ‘తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు’ అంటూ భక్తులు సాష్టాంగ పడుతుండగా భద్రాద్రి భక్తాద్రిగా మారింది. వైదిక పెద్దలు చెప్పిన ప్రవచనాలు మదిమదినీ పులకింపజేశాయి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రగిరిలో వేంచేసిన దేవదేవుడు వరాహావతారంలో భక్తులకు దర్శినమిచ్చాడు. స్వామివారు ఈ అవతారంలో దర్శనమివ్వడంతో భక్తులు ఉప్పొంగిపోయారు.

12/29/2019 - 23:02

నార్సింగి (హైదరాబాద్), డిసెంబర్ 29: సరస్వతీ శిశుమందిరాల్లో విద్యాభ్యాసం పూర్తిచేసిన విద్యార్థులు స్వలాభం కోసం కాకుండా దేశం, సమాజం కోసం పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ హితవు పలికారు. హైదరాబాద్ బండ్లగూడలోని శారదాధామంలో ఆదివారం సరస్వతీ విద్యాపీఠం పూర్వవిద్యార్థుల మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

12/29/2019 - 04:40

హైదరాబాద్: భారతదేశం చిరంజీవి అని మరణం లేనిదని, ప్రపంచం అంతా పరస్పర సుహృద్భావ వాతావరణం ఉండాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో దీన్ దయాళ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ప్రతినిధికి ఎన్‌సీసీసీ సమిష్టి సేవా పురస్కార్‌ను ఆయన ప్రదానం చేశారు .

12/29/2019 - 04:34

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు బయలుదేరుతున్న నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే 133 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండే జనసాధరన రైళ్లను నడపడంలేదు. దీంతో మధ్య తరగతి, వ్యవసాయ కూళీలు పెంచిన రైల్వే చార్జీలను ఎలా భరిస్తామని ఆందోళన చెందుతున్నారు.

12/29/2019 - 01:08

భద్రాచలం టౌన్, డిసెంబర్ 28: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో రెండవరోజైన శనివారం భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

12/29/2019 - 01:01

విజయవాడ, డిసెంబర్ 28: గిడుగు వారిని ఆదర్శంగా తీసుకుని తెలుగు భాష కోసం చిత్తశుద్ధితో కూడిన మహాగొప్ప ఉద్యమాన్ని సృష్టించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు భాషోద్యమ నేత డాక్టర్ సామల రమేష్‌బాబు పిలుపునిచ్చారు.

Pages