S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/02/2020 - 00:43

తిరుపతి, జనవరి 1: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భక్తులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు జరుపుకున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆ సమయంలో తమకు శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కలగపోయినా బాధపడలేదు.

01/01/2020 - 05:25

తిరుపతి: నూతన సంవత్సరంలో శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించనుంది. ఆంగ్ల నూతన సంవత్సరం తరువాత తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ముందుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ రూ. 50 విలువ కలిగిన శ్రీవారి లడ్డూను ఉచితంగా అందించనుంది. ఇదిలావుండగా ప్రస్తుతం ఉచిత క్యూలైన్లలో వెళ్లే భక్తులకు 70 రూపాయలకు 5 లడ్డూలను అందిస్తోంది. ఇందులో ఒకటి ఉచితంగాను, రూ.

01/01/2020 - 01:30

విజయవాడ, డిసెంబర్ 31: కాన్ఫిడెన్షియల్ జీవోల జారీలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే 80 కాన్ఫిడెన్షియల్ జీవోలను జారీ చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాన్ఫిడెన్షియల్ జీవోలను పెద్దసంఖ్యలో జారీ చేయడం గమనార్హం. 2019 జూన్ 1 నుంచి డిసెంబర్ 30 వరకూ 94 కాన్ఫిడెన్షియల్ జీవోలను ప్రభుత్వం జారీ చేసింది.

01/01/2020 - 01:30

విజయవాడ, డిసెంబర్ 31: రాష్ట్రంలో కొత్తగా 39 పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 10, విశాఖ జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 పంచాయతీని ఏర్పాటు చేసింది. కొన్ని పంచాయతీలను పునర్‌వ్యవస్థీకరించింది.

01/01/2020 - 01:24

తిరుపతి, డిసెంబర్ 31: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో శ్రీవారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు.

01/01/2020 - 01:50

గుంటూరు, డిసెంబర్ 31: రాష్ట్ర రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. సాక్ష్యాత్తూ అసెంబ్లీలో అమరావతి నిర్మాణానికి తాము అనుకూలమేనని చెప్పిన జగన్‌రెడ్డి తాజాగా విశాఖపట్నానికి రాజధానిని తరలిస్తామన డం మాటతప్పడం కాదా అంటూ నిలదీశా రు. మంగళవారం రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించారు.

01/01/2020 - 01:53

విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారమయింది. నూతన సంవత్సరం ప్రారంభంతో ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త శకం ప్రారంభం కానుంది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 1ని నియామక దినంగా పరిగణిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

12/31/2019 - 04:54

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం తెలంగాణలో శాంతి భద్రతలపై గవర్నర్‌కే అధికారం ఉండాలని కోరుతూ మంగళవారం గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం సమర్పించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతి యాత్రకు పోలీసులు అనుమతించక పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు టీపీసీసీ పేర్కొంది.

12/31/2019 - 04:24

తిరుపతి, డిసెంబర్ 30: నూతన ఆంగ్ల సంవత్సరాది, జనవరి 6,7 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని విభాగాల సమన్వయంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అదనపు ఈఓ ఏ.వి.్ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/31/2019 - 04:22

భద్రాచలం టౌన్: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం నృసింహావతారంలో భక్తులకు దర్శమిచ్చారు. అధ్యయనోత్సవాల్లో నాల్గవరోజు స్వామికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నృసింహావతారంలో అలంకరించారు. భజనలు, కోలాటాలు, మంత్రోచ్ఛారణల నడుమ మధ్యాహ్న సమయంలో నృసింహావతార రాముడిని మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు మార్మోగుతుండగా స్వామి మిథిలా మండపానికి వేంచేశారు.

Pages