S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/25/2018 - 03:45

అమరావతి, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ వాటర్ కన్జర్వేషన్ అవార్డు సాధించటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. ఈనెల 23న ఢిల్లీలో జరిగిన సదస్సులో స్వీకరించిన అవార్డును, ప్రశంసాపత్రాలను ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో భూగర్భజల వనరులశాఖ డైరెక్టర్ వేణుగోపాల్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు ముఖ్యమంత్రికి అందజేశారు.

08/25/2018 - 03:43

హైదరాబాద్, ఆగస్టు 24: కేరళ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తి తీవ్ర నష్టాన్నికి కారణం అయినందున రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయించారు. ఎడతెరిపి లేని వానలతో వందలాది మంది మృతిచెందగా వేలాది మంది ప్రజలు నిలువ నీడ లేకుండా పోయారని అన్నారు.

08/25/2018 - 03:33

కర్నూలు, ఆగస్టు 24: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ఎగువ తుంగభద్ర నుంచి పూర్తిస్థాయిలో వరద తగ్గగా కృష్ణానది నుంచి గణనీయంగా తగ్గిపోయింది. జలాశయానికి నీటి చేరిక పడిపోవడంతో ప్రాజెక్టు నుంచి దిగువ నాగార్జున సాగర్‌కు నీటి విడుదలను తగ్గించారు. గురువారం తెరిచిన ఎనిమిది గేట్లలో శుక్రవారం ఉదయం నాలుగు గేట్లు మూసివేశారు. జలాశయం నీటిమట్టం 883.10 అడుగులుగాను, నీటినిల్వ 205.25 టీఎంసీలుగా నమోదైంది.

08/25/2018 - 03:27

విశాఖపట్నం, ఆగస్టు 24: క్యాన్సర్ వ్యాధిని అరికట్టడంలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. బాబా అటామిక్ పరిశోధనా కేంద్రం, హోలీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా శాస్తవ్రేత్తలతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారత వైద్య పరిశోధనా సంస్థ ప్రతిరోజు సుమారు 12 నుంచి 13 లక్షల మంది క్యాన్సర్ రోగులను గుర్తిస్తోందని అన్నారు.

08/25/2018 - 01:46

వరలక్ష్మీరూపంలో దర్శనమిచ్చిన
చార్మినార్ భాగ్యలక్ష్మీఅమ్మవారు

08/25/2018 - 01:44

హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

08/25/2018 - 01:43

హైదరాబాద్, ఆగస్టు 24: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు హడావుడి చూస్తుంటే ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చేలా ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీ భవన్ నుంచి జిల్లాల్లోని 20 వేల పోలింగ్ కేంద్రాల కమిటీ సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

08/25/2018 - 01:43

హైదరాబాద్, ఆగస్టు 24: ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు చేస్తున్న హడావుడితో అంతే హడావుడిగా ప్రతిపక్షాలూ అప్రమత్తమయ్యాయి. ఎన్నికలకు సిద్ధంగా ఉండకపోతే దూరంగా ఉంటామా? అనే భావన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి తప్ప తమకు వేరే పని ఏముంటుందని వివిధ పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

08/25/2018 - 01:40

హైదరాబాద్, ఆగస్టు 24: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మరోసారి వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు గృహోపయోగ విద్యుత్తును 101 యూనిట్ల వరకూ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

08/25/2018 - 01:39

హైదరాబాద్, ఆగస్టు 24: ‘రాజ్యసభ సభ్యుడు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసినట్టు పక్కా సమాచారం. ఆయనపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతూ ప్రజాప్రతినిధులమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసాం’ అని నిజామాబాద్ ఎంపీ, స్వయంగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నెలన్నర కిందట బాహాటంగా ఆరోపించిన విషయం తెలిసిందే.

Pages